"http://www.jalleda.com/images/jalleda3d48x32.png">

31 అక్టో, 2010

ఒక తరం ,రేపటి తరం , కి చక్కని పునాది వేద్దాం.. రండి.

ఈ దేశం లోనే కాదు, అన్ని గల్ఫ్ దేశాల్లో జరుగుతున్న మానవ విలువల అతిక్రమణ గురించి హుమన్ వాచ్ అనే సంస్థ ఇచ్చిన రిపోర్ట్ చదివాను, చాల బాధ, కలిగి ఆవేశం తో మనసు రగిలి పోతుంది. 
అయితే , మన రాష్ట్రం లో, కోర్పోరాటే కళాశాల లో జరుగుతున్న అందరం పట్టించుకోని , హింస గురించి ముందుగ రాయాలని  ఇది రాయడం మొదలు పెట్టాను.
ఎనిమిది, తొమ్మిది తరగతులు కి రాగానే,  రోజూ సాయంత్రం ఆడుకునే ఆటలు బంద్. దాని స్థానం లో  ఎక్ష్త్ర క్లాస్స్లు,  లేదా ట్యూషన్లు మొదలు, అప్పుడప్పుడే సాగుతున్న పిల్లవాడి కాళ్లు, చేతులు కట్టేసినట్టే. అది ఒక మెదడేనా? లేక ఒక యంత్రమా? ఇవి కాదు, ఇన్ని రక రకాల కష్టాలు ఎందుకు మనకి అను కునే తల్లిదండ్రులు, ఏకంగా ఉదయం నుంచి రాత్రి వరకు చదువులు చెప్పే ఒక జైలు లాంటి ఖార్ఖానా లో పడేస్తారు. 
ఒక సంవత్సరం పాటు నింపాదిగా చెప్పా వలసిన సిలబస్ ను, ఆరు నెలలో, నో ఇంక ముందు గానో పూర్తి చేసి, ఇంక ఆ తరువాత అంతా రివిషన్ పేరు తో, తోమించడం, చదువు అంటే నే వెగటు  పుట్టదూ? 
ఈ పిల్లలే, కట్టులు తెంచుకుని, విచ్చలవిడిగా ప్రవర్తించడం చూస్తాం, బయట. వారికి ఒక మానసిక వికాసం, ఒక విశ్రాంతి , ఒక  సంపూర్ణ వ్యక్తీ వికాసం ..ఇవేమీ ఉండవు. బాగా చదవడం, ఇంకా బాగా చదవడం, ఇంకా ఎక్కువ మార్కులు తెచ్చుకోవడం ఇదేనా చదువు..అంటే.
నాకు తెల్సిన ఒక స్కూల్ లో, ఉదయమే అయిదు గంటలకి ,ఒక ఫోన్ వస్తుంది, స్కూల్ అధికారి నుంచి. ఆ పిల్లాడే అందు కోవాలి ఆ ఫోన్, నేను లేచే వున్నాను, చదువుతున్నాను అని వారికి హామీ అన్నమాట పిల్లాడి నుంచి. కలలే అపహరించే దొంగలు అన్న మాట గుర్తు వచ్చింది నాకు, కమ్మగా నిద్ర కూడా పోనివ్వరు, ఇదేమి బడి? ఇదేమి చదువు?

తల్లిదండ్రులు ఎందుకు ఇలాగ లొంగి పోతున్నారు? ఈ శిక్ష లా ఉండే విద్య కు?అంటే కంపిటేశున్ అంటారు. రెండు లక్షల పై చిలుకు ఇంజేనీరింగ్ సీట్లు, పిలిచి ఇస్తున్నారు, ఏమిటి ఈ పిచ్చి? ఏమిటి ఈ వెర్రి? 

నాతో చదివిన స్నేహితురాలు ఒక కార్పోరాట్ కళాశాల లో పని చేస్తోంది. ఉదయం ఆరు గంటల నుండి క్లాస్ ట. అక్కడే ఫలహారం, అక్కడే భోజనం, మొత్తం మీద ఒక గంట విశ్రాంతి, రాత్రి ఎనినిది వరకు బోధించాలి. సిలబస్ అంత ఎప్పుడో అయిపొయింది, మళ్లీ, మళ్లీ, రుబ్బి, రుబ్బి, పిల్లల మైండ్ లోకి ఎక్కించాలి. ఇన్ని గంటలు అధ్యాపకలు ఎలా అరుస్తారు? వీళ్ళు మనుషులే కదా? గొంతు మండడూ? మెదడు వేడి ఎక్కి, పిల్లలికి మెదడు వాపు వ్యాధి వస్తుందేమో అన్నాను, హాస్యం గా, కాని కడుపు మండి పోతోంది, నిజం గా ఇన్ని గంటలు పిల్లలు వింటారా? అంటే కళ్ళు పుస్తకం మీద ఉంటాయి ,ఆలోచనలు ఎక్కడో ఉంటాయి. 
ఆదివారం అంటే మనకి హాలిడే ,జోలి డే..ఆ రోజు ఆలస్యం గా నిద్ర లేవడం మన జన్మ హక్కు అనుకుంటాం. మెల్లిగా  లేచి,  ఏ పూరిలో , దోసలో, టిఫిన్ తిని, అమ్మ ఇంక స్నానం చేయవే అని తిడు తూ ఉంటే, పత్రికో, పేపరో, ఫోనో, ఏదో పట్టుకుని వేలాడుతూ, అన్ని పనులు స్లో మోశున్ లో చేసే రోజు అది. 

కాని, ఈ కాలేజ్ లో కాదు. ఆ రోజు ఒక స్పెషుల్ పరీక్ష ఉంటుంది, ఆ వారం లో జరిగిన పాఠాలు మీద.  ఆ రోజు ఇంకా ఉదయమే లేచి, మళ్లీ ,మళ్లీ ఇంట్లో చదువుకుని వెళ్ళి పరీక్ష రాసి రావాలి. ఆదివారం కాలేజే నడిపే వారందిరిని ఒక టో,పడి రోజులో జైలు శిక్ష వేయాలి, నా ఉద్దేశం లో. 

పాఠాలు చెప్పే అధ్యాపకులు కి కూడా ఒక సెలవు రోజు ఉండ వద్దా? ఉదయం ఆరు నుంచి రాత్రి పది వరకు  కాలేజ్ లో నే గడిపితే, ఇంక వారు ఇంటికి వెళ్ళి, వారి పిల్లలను, కుటుంబం తోనూ ఎప్పుడు గడుపుతారు? 

ఇవి   అన్ని కూడా మానవ హక్కుల ఉల్లంఘనే అని పిస్తున్నది నాకు అయితే. ఆల్ ఇండియా లెవెల్  టెస్ట్ ల లో మనకే బోలెడు రాంకులు, వీటి కోసం ఈ మాత్రం కష్ట పడాల్సిందే  అంటారు  , కాని, ఒక లక్ష మండి రాస్తే ఒక వెయ్యి మంది   కి వస్తాయేమో ఈ రాంకులు.  ఈ కర్పోరాటే కళాశాలలు లేనప్పుడు కూడా వచ్చాయి మనకి రాంకులు. 

చదవాలి అనే ఆకాంక్ష, కొంత తెలివి తేటలు , కొంత నియమ నిబద్ధత , ఉండాలి ఆ పిల్లవాడికి, అంటే కాని బలవంతం గా కుక్కి, కుక్కి పెట్టే అన్నం ముద్ద  లాగ, మక్కి పెట్టించి చదువు చెపితే రాంకులు వస్తాయా?

సంస్కారం, ప్రపంచ జ్ఞానం, విజ్ఞానం , సమయస్ఫూర్తి, ఆటలు లో ఓటమి గెలుపుల సంయమనం,  అందరి తో కలిసి సామూహికం గా పని చేయడం,  పదిమంది లో ఒక్కడిగా మెలగడం, అవసరం అయినపుడు సారధ్యం  వహించే నాయకుడి లక్షణం. .. ఇవి నేర్పించేదే విద్య ,చదువు, అంతే కాని, ఒక్క మార్కు తగ్గిందని ప్రాణాలు తీసుకోవడాన్ని నేర్పించే పోటి చదువులు కాదు. 

పని గంటలు అని మనకి ఒక రూల్ ఉంది, దానిని పట్టించు కోరు, పిల్లలకి ఒక చదువు  సమయం అని తొమ్మిది నుంచి సాయంత్రం నాలుగు వరకు బడి వేళ లు ఉన్నాయి.  ఇవేమీ పట్టించు కోని ఈ ప్రైవేట్ కళాశాల యాజమాన్యం పై అజమాయిషీ లేదా? 

అసలు ప్రభుత్వం ప్రాధమిక విద్య  ను పూర్తిగా పట్టించు కోవడం మానేసి, అంతా ఈ ప్రైవేట్ వ్యక్తుల చేతికి అప్పగించింది. ఎంత చిన్న ఆదాయం ఉన్నవారు కూడా అప్పో సొప్పో చేసి, ఈ ప్రైవేట్ బడి లోనే పడేస్తున్నారు తమ పిల్లలిని. వేలకి వేలు ఫీజు. ఉనిఫోరములు, షులు, చదువు ఏం చెపుతారో, తక్కువ జీతాలకు పని చేసే టీచర్లు. ఇది మన విద్య రంగం పరిస్థితి.

వారిలో వారు అధికారం కోసం కుమ్ములాటలు, గ్రూపులు, అస్తవ్యస్త పాలన. ఎంతో ముఖ్యమైన విద్య కు అత్యంత తక్కువ ప్రణాళిక నిధులు. 

కనీస కర్తవ్యమ్ గా ముందు, ఈ కార్పోరేట్ కళాశాల లో పరిస్థితిని సమీక్షిన్ చాలి, రోజు లో పద్దెనిమిది గంటలు చెప్పడం, విద్యార్ధులను కూర్చో పెట్టడం, మానవ హక్కుల చట్టం కింద వీరిని  శిక్షించాలి, తల్లి తండ్రులూ, మేల్కోండి, వారి భారి విజ్ఞాపనలు చూసి, మోస పోకండి, లక్ష మంది లో కొన్ని వేల మంది కి వస్తాయి రాంకులు, అవీ బాగా చదివే కొంత మందికి, నేను  బి  కామ్ చదువుతాను నాన్న అంటే ఎందుకూ పనికి రావు అంటూ, ఎంజేనీరింగ్ లో పడేయకండి, అయిదేళ్ళు చదివినా పాస్ అవని విద్యార్ధులు కనిపిస్తున్నారు, ఎందుకు, వారికి ఆ చదువు మీద అభిరుచి లేదు, అందరు చదువుతున్నారు అని చదివించడం.. . మూస పధ్ధతి లో ఆలోచన ..

ఇకనైనా మేల్కోండి, పిల్లలు స్వభివ కం గా పెరగాలి, వారిని గైడ్ చేయండి, కాని, అణగదొక్కి, కొమ్ములు విరిచి కూర్చో పెట్టడానికి వాళ్ళు గిత్తలు కారు, గాలే చొరబడని, నాలుగు గోడల మధ్య ,రోజు లో పద్దెనిమిది గంటలు కూర్చో బెట్టి, చదువు, చదువు అని అంకుశం తో పొడుస్తూ ఉంటే, వాళ్ళే మరి తిరగ బడతారు. 

బయట సమాజం లో, ప్రేమించు అని వెంట పడే వాళ్ళు, ఆడ పిల్లలని వేధించే వాళ్ళు, తల్లిదండ్రులని ఆస్తి కోసం హింసించే వారు, ఇలాంటి రూపాలను తయారు చేస్తున్నాం, మన విద్య వ్యవస్థ ను  సమూలం గా తీర్చి దిద్దాలి, ముందు గా ఈ ప్రైవేట్ కాలేజ్ విష వ్యవస్థ ని వేళ్ళ తో పెరికి  వేసి, ఒక బాద్య త యుతమైన , ప్రభుత్వ ఆధీనం లో మెలిగే చక్కని శిక్ష బుద్ధులు నేర్పే విద్య సంస్థల నియామకానికి శ్రేకారం చుట్టాలి.
తల్లి దండ్రులు, విద్య వేత్తలు, ప్రణాళిక వేత్తలు,  అందరు కలిసి ,చర్చించి, మన పిల్లలే రేపటి పవ్రులు అనే ఆలోచనతో, చక్కని విద్య వవస్థ కి పునాదులు వేయాలి. 

పువ్వుల్లాగా సున్నితం గ పుట్టిన మన  పిల్లలను చదువు ల పేరిట బలవంతం గా నలిపి వేయకండి, పువ్వుల్లాగే వికసిస్తారు, వారు కూడా, చదువు ని ఆనందించాలి వారు,  భయ పడుతూ ,బెంగ పడుతూ, అసహ్యించుకుంటూ కాదు. 
ఒక తరం ,రేపటి తరం , కి చక్కని పునాది వేద్దాం.. రండి.






28 అక్టో, 2010

అటక మీద జ్ఞాపకాలు..

ఉత్తర భారత దేశం లో వారికి ఒక సంప్రదాయం ఉంది, దీపావళి ముందు సఫాయి అని ఇల్లు అంతా శుభ్రం  చేసుకుంటారు. వారం, పది రోజుల ముందు నుండి మొదలు పెట్టి, ఇల్లంతా మెరిసేలా శుభ్రం చేస్తారు, లక్ష్మి దేవి ని పూజిస్తారు కదా ఆ రోజు. మనకి అలాంటి అలవాటు లేక పోయిన, పండుగ లకి ఇల్లు కడగడం అది చేసే వారం, ఇప్పుడు ఫ్లాట్స్ లో అలాంటి సదుపాయమే లేదు, నీళ్ళు ఎక్కడికి పోవు కదా..
పండుగ కి కాక పోయినా ఏదో, ఒక రోజు ఇల్లు సర్దాలి అనే భూతం ప్రవేశిస్తుంది, అమావాస్యకో...ఎప్పుడో.. సంవత్సరానికి ఒక్క సారి. ఇంక భారీ ఎత్తున అటక తో మొదలు పెడతాను. 
అలాంటి ఒక రోజు..పిల్లలు స్కూల్స్ వదిలి నాలుగు ఐదు ఏళ్ళు అయినా అట్టలు వేసి, నీట్ గా ఉన్న టెక్స్ట్ బుక్స్, ఎప్పుడైనా అవసరం అవుతాయి, అయ్యేయస్ లాంటి పరీక్షలు కి ఇవే చదవాలి ట, అమ్మలు అందరికి  ఏజ్ బార్ అఏంత వరకు పిల్లలికి, ఇలాంటి రహస్య కోరికలు, ఆశలు ఉంటాయి, ఆ పుస్తకాలు, అటక దించి, ఎవరికైనా ఇచ్చేయాలి, అటక అంటే, మన అలమారాల పైన, తలపులు మూసేసి ఉండే, ఒకప్పటి ఖాళీ జాగా..ఇప్పుడు మనకి పనికిరాని అనేక వస్తువులతో  నిండి ఉంటుంది. సరే అని పుస్తకాలు దిమ్పాను, ఎన్నో జ్ఞాపకాలు, ఒక్కొక్క క్లాసు ఎలా పాస్  అవుతూ వచ్చారో, ఎంత గొప్ప గా ఉండేదో, మన పిల్లలు ఒక్కరే ఇంత ఘన కార్యం చేసేరు, అని, స్కూల్ కోసం చేసిన ప్రాజెక్ట్ వర్క్ లో భాగం గా గీసిన చార్టులు, ఏదో ఒక విషయం తీసుకుని , ఇంటికి వచ్చే మాగజీన్ నుంచి కట్  చేసి అంటించిన స్క్రాప్ బుక్లు ,పిల్లలికి మార్కులు మర్నాడే ,దాని అవసరం తీరి పోతుంది, కష్ట పడి చేసింది మనమే కదా, మురిపెం గా దాచడం, ఇదిగో ఇంక ఇప్పుడు దానికీ కళ్ళు తుడుచు కుంటూ వీడ్కోలు పమ్పవలసిన సమయం వచ్చింది.  
పిల్లలు వచ్చి రాని రాత తో రాసిన నాన్న ఎప్పుడు వస్తావు? అని రాసిన మొదటి ఉత్తరాలు, పుట్టిన రోజు గ్రీటింగ్ లు, విరిగి పోయిన విమానం బొమ్మ, ఎంత ఖరీదో, అది చూసి వాళ్ళ కళ్ళల్లో విరిసిన ఆనందం పువ్వులు ఎప్పటికి వాడి పోకుండా ఉండాలి అని కోరుకుంటూ , ఈ విమానం బొమ్మని ఇంక స్క్రాప్ చేయ వచ్చు, ఎన్ని రకాల బోర్డ్ గేమ్స్, అష్ట చెమ్మ అని, నేల మీద సుద్ద ముక్క తో గీసుకుని ఆడే వాళ్ళం మన చిన్నప్పుడు, అవే రాక రకాలు గా అట్ట ల మీద ,రంగు రంగు లాగా చేసి, ఎన్ని గేమ్స్ కని పెట్టారో. అవి కూడా ఇంక పడేయ వచ్చు, వీడియో , సెల్ ఫోనే, కంపూటర్ గేమ్స్ వచ్చాక ,చిన్న పిల్లలు కూడా అవే ఆడుతున్నారు, ఇప్పుడు ఇవి ఎవరు ఆడుతారు? మోనోపోలీ అని లండన్ లో ఉన్న అన్ని ప్రదేశాలు కొనేయడం, ఎంత బాగుండేదో, పేపర్ డబ్బులు, దాచు కోవడం, అప్పు చేయడం బ్యాంకు నుంచి, ఇది కూడా అదే దారి,  మా దగ్గర పేపర్లు కొనే పంచ కట్టుకుని, తలపాగా చుట్టుకునే అతను. పేరే తెలీదు, ఇన్నేళ్ళు గా అతనికి పిల్లలు ఉంటారుగా, ఇచ్చేయడమే..ఇంకా ఎప్పటివో, జూ లో జంతువుల బొమ్మలు, ఇవి దాస్తాను, ఎంత బాగున్నాయో, రంగులు పోకుండా, గృహ ప్రవేశం నాడు ఇచ్చిన రాక రకాల గోడ కి తగిలించేవి, ఏం చేయాలో తెలీదు, ఇన్నిఏళ్ళు అయింది, ఇంక మెల్లిగా వీటిని దిమ్పవచ్చు, క్షమించండి అని మనసులో దణ్ణం పెట్టుకుని , పాత, పాత, పసుపు రంగు లోకి వచ్చిన కాయితాల పత్రికలూ, ఎందుకు దాచానో  , ఉమెన్స్ ఏరా లు ట, ఇల్లు ఎలా  అలంకరించు కోవాలో, ఏవో స్వీట్స్, ఇంకా ఏవో చిట్కాలు, వీటి అవసరం ఇప్పుడు నాకు ఇంక ఉండ దనే అనుకుంటున్నాను ఈ యాభై పడి లో.
ఇల్లు మొహం నుంచి బయట పడాల్సిన సమయం కదా ఇంక. 
ఇదేమిటి, ఏదో  కవెర్ లో, ఫోటోలు, బ్లాకు అండ్  వైట్ ఫోటోలు, ఇక్కడ ఇలా పడి ఉన్నాయి ఏమిటి? ఎప్పుడో ఇంకో జన్మ లాగ ఉంది, మేం ఎం ఎస్ సి చదువు తున్నప్పుడు, వెళ్ళిన అరకు, భిమ్లి పిక్నిక్ ఫోటోలు, నేనే నా ఇంత సన్నం గా ఉన్నానో, నా ఫ్రెండ్స్, అందరు, అవే కదా బాధ్యతలు లేని, అందమైన , మధురమైన ,బంగారు రోజులు..(కవన శర్మ గారి నవల ఇదే పేరుతో ),ఏదో బాక్స్ కామెర తో తీసినవి, మొహాలు సరిగా కనిపించవు , అయిన ఎన్ని జ్ఞాపకాలు మోసుకుని ,దాచు కున్నాయి ఈ బ్లాకు అండ్ వైట్ ఫోటోలు, మన అందరికి మన పాత రోజులు ఇలాగే బ్లాకు అండ్ వైట్ రోజుల లాగే కని పిస్త్హాయి ఇప్పుడు. రంగుల రంగుల గా ఉండదు ఎప్పుడు, మన పూర్వ చరిత్ర, అందుకే కాబోలు సినిమా లో కూడా ఈశ్ట్ మాన్ కలోర్  సినెమా కాస్త ఫ్లాష్ బ్యాక్ చూపించాలంటే ఇలాగే బ్లాక్ అండ్ వైట్ లో చూపిస్తారు. 
ఫలించని ప్రేమలు, ఫలించిన ప్రేమలు, మిగిలిన స్నేహాలు, అల్లుకున్న బంధాలు, సుదూరాల్లో రాణిస్తున్న క్లాస్స్ మేట్స్ గా మిగిలిన మొహాలు, కొండలు, లోయలు, వెచ్చని చలి, పచ్చని ఆవ పూల కార్పెట్ వేసిన అరకు, నింగి నుంచి దూకే నీళ్ళ జల పాతం కింద తల పెట్టి , బుచ్చి బాబు కథ లాగ నిర్వికల్ప స్థితి, మైళ్లు, మైళ్లు, పరుగులు పెట్టడం, అంతా కలిసి ఒక యవ్వన కోలాహల సందడి, ఆకాశానికి ఆశల నిచ్చెనల వేసే ఒక మోహపు వయసు విచ్చలివిడి ఆకతాయితనం, ఇవే, ఇవే కదా నేను, మేం, ఇవి తప్పక ఉండ వలసిందే, జ్ఞాపకాల ఖజానా ఇవి, ఇది చాల విలువ కట్టలేని ఖజానా, ఇంకా ఈ ఉత్తరాల కట్ట కూడా దాస్తాను, అప్పుడే ఎంత సమయం గడిచి పోయింది.
జీవితం లోను..ఇలాగ సర్దడం లోను, ఇలాగ బరువు ఎక్కిపోయింది ఏమిటి మనసు అంతా, అటక మీద బరువు దించాను కాని, మనసు బరువు ??!!

ఇంకా చిన్న వాడి, స్కటింగ్ షూస్, విరిపోయిన బాట్లు, అందరు టెండూల్కర్ లు అవుతారనే ఆశ కదా మన కి, టెన్నిస్ రాకెట్లు, ఒకప్పడి హీరోల పోస్టర్లు, ద్రావిడ్ పోస్టర్ మటుకు మాకు ఎప్పటికి మారదు, ఎనో కార్డులు, పేక ముక్కలు, పెన్నులు,  కొమ్పస్స్ బాక్సులు, అబ్బ ఎప్పటివో, ఎందుకు దాచాను ఇవి, పిల్లలికి అవసరం అవుతాయేమో, అనా ?
పాత ని వదుల్చు కోలేని బలహీనతా? పిల్లలు పిల్లలు గానే ఉంటారని ఊహా? ఏమో.. అమ్మ మనసు లో ఏం ఉంటుందో? ఆమె కే తెలుసు.

ఇంకా ఈ షూ బాక్స్ లో  పాటల కాసేటే లు, చిరంజీవి సినెమా హిట్స్, రఫీ హిట్స్, లతా. ఘంటసాల.. ఎంతో కష్టపడి  రికార్డు కూడా చేయించాను, ఇప్పుడు అన్ని నెట్ లో దొరుకు తాయి, ఇవి కూడా ఇంక పడేయ వలసిన టైం వచ్చింది. 
పాతవి వదిలించుకో, ఇదే కదా ఇప్పటి మాట. ఇంకా ఇలాంటి అటకలు ప్రతి గది లోను ఉన్నాయి, పుస్తకాలు, పుస్తకాలు, పుస్తకాలు,ఎక్కడ చూసినా అవే, ప్రింట్ లో అక్షరం చూస్తె ఏదో వివసత్వం, చదివేయాలని ఆశ, కొని చదివేయాలని ఇంకో వెర్రి ఆశ, పుస్తకాలు ఏదైనా లైబ్రరీ కి ఇచ్చేయాలి ..
ఇంక వంటింటి అటక ఉంది..అది ఒక పెద్ద అఘాతం, ఒక ఫ్యామిలీ కి కావాల్సిన సామాన్లు ఉంటాయి అక్కడ, అది మొదలు పెడితే, ఇంట్లో యుద్ధాలు అయి పోతాయి, అసలు ఇన్ని ఎందుకు? ఎప్పుడు?? కొన్నావు అనే ప్రశ్నలతో..మూడో ప్రపంచ యుద్ధం ఇప్పుడు అవసరమా? 
శాంతి శాంతి..అటక సర్దడం కాదు గాని, కొంచం వేడి ,వేడి కోఫ్ఫీ తాగి ,పాతవి పడేయడం లో ఇంత బాధ , ఇంత శ్రమ ,ఇంత అతలా కుతలం ఉన్నాయి కాబట్టే, ఈ పనులు మనం అలాగ పోస్ట్ పోన్  చేస్తూ ఉంటాం, ఇలాంటి పనులు మగ వారు చేయ గలరా? 
ఒక చీపురు పట్టుకుని అన్ని తుడిచి వేయడానికి, అది అటకే గాని, ఎన్నో జ్ఞాపకాలు, కూడా..ఏమంటారు?

26 అక్టో, 2010

ప్రపంచమే తెరుచు కుంటుంది...

అమ్మలూ ..అమ్మమ్మలూ, నాయనమ్మలు తెరవండి తలుపులు, పట్టండి చిట్టెలుకని.. అదే విండోస్ లో కి లాగ్ ఇన్ అయి, మౌస్‌ పట్టి, కొత్త లోకం లోకి ప్రవేశించండి. ఇప్పుడు అందరి పిల్లలు, వారి పిల్లలు, అమెరికా లోనో లేదా గల్ఫ్ లోనో, ఉంటున్నారు. పిల్లలు గుర్తు వస్తున్నారు అంటూ కళ్ళు వత్తుకోడం   కాదు.. వెంటనే లాగ్ ఇన్ అయిపోయి, చాటింగ్ అంటే మాటలు ,పదాల్లో మాటలు మొదలు పెట్టండి, లేదా పిల్లలు ఫేసు బుక్ లో పెట్టే ఫోటోలు చూడండి. అంటే కాని, ఇల్లు ఖాళీ అయిపొయింది అని దిగులు తో ఇంట్లో వాళ్ళ మతి పోగట్టకండి .
ఎంతో కొంత చదువుకున్న  వాళ్ళు కూడా అదేదో బ్రహ్మ విద్య అన్నట్టు, నాకు కంపూటర్ అంటే ఏమిటో తెలీదు. నేను ఏమి నేర్చుకోలేదు అంటారు. పిల్లలు వారి అమ్మలకి, అమ్ముమ్మలకి, కొంచం ఈ బ్రహ్మ విద్య కానిది నేర్పించి వెళ్ళాలి. విదేశాలకి వెళ్ళే ముందు. మనం దానికీ ప్రోగ్రాంలు రాసి ఏమి నేర్పించ అక్కర్లేదు. 
పవర్ స్విచ్ ఆన్ చేసి, నెట్ మీద క్లిక్ చేసి, ఒక్కోసారి అది ఎప్పుడూ ఆన్ లోనే ఉంటుంది.. ఏదో ఒక ఎక్ష్ప్లొరెర్ కాని, ఒక ఫైర్ ఫాక్స్ కాని పేజీ ఓపెన్ చేసి, మెయిల్ ఓపెన్ చేయడం  నేర్పించాలి.. నెట్ లో కొన్ని ముఖ్య మైన పేజెస్ ఎలా ఓపెన్ చేయాలో కూడా చూపించాలి. ఇంట్లో మగ వారు కూడా, నీకేం వస్తుంది? నువ్వు ఏదో పాడు  చేస్తావు లాంటి మాటల తో ఆమెను నిరుత్సాహ పరచ కూడదు. 
నాన్న ల కన్నా అమ్మ లు ఎక్కువ మిస్ అవుతారు పిల్లలని, అస్తమాను ఫోన్‌ చేసి మాట్లాడండి అని విసిగించలేము , అలాంటప్పుడు ఒక మెయిల్ రాసి పెడితే, వాళ్ళు చూసుకుని , వారి కి వీలు అయినప్పుడు వారే ఫోన్‌ చేయడమో, లేదా మెయిల్ లో విషయం రాయడమో చేస్తారు. 
మాకు తెలిసిన రాజ్యం అత్తయ్య గారు, చినవాల్టర్ లో ఉండే మా అత్తయ్య గారి పిల్లలు నలుగురు అమెరికా లో ఉంటారు , ఎప్పుడో  పదేళ్ళ ముందు నుంచే ఆవిడ నెట్ ఉపయోగించడం నేర్చుకుని, టక టక మని వెబ్ మెర కూడా ఆన్ చేసి  ఇక్కడ వారిని అక్కడ చూపించడం, వాళ్ళ ఇంట్లో జరిగే వ్రతాలు, పుట్టిన రోజుల పండగలు చూడ్డం చేస్తున్నారు ఆవిడ.అన్నిటికి  టికెట్లు కొనుక్కుని అక్కడికి పరుగెట్టలేరు కదా.  ఆవిడకి ఏ డిగ్రీ చదువులు లేవు కాని, ఏదైనా నేర్చు కోవాలి అన్న ఉత్సాహం ఉంది. ఎవరి మీద ఆధార పడకుండా ఆవిడే అన్నీ చూస్తున్నారు  నెట్ లో. ఫోటోలు చూపిస్తారు మనకి. ఎంత ముచ్చట గా ఉంటుందో? 
నాకు తెలిసిన వారు ఎందరో, నా వయసు వారే, కంపూటర్ విద్య నేర్చుకోలేదు అంటారు, ఏ విద్య అక్కర్లేదు అది ఒక మెషిన్, దానిని ఉపయోగించడం వస్తే చాలు, అంటే ఏమిటో  సందేహిస్తున్నారు. నా ఉద్దేశం  ఇంట్లో ఉండే ఆడవారికి ఈ విషయాలు బోధించే సంస్థలు, ఇంటికి వచ్చి క్లాసెస్ పెట్టి నేర్పిస్తాం అని ,నేర్పించడం మొదలు పెట్టాలి. 
ఎన్నో చేయ వచ్చు. స్నేహితులతో మాట్లాడుకోవడం, కథలు చదవడం ,సినిమా కథలు చదవొచ్చు, వార్త పత్రికల లో  వార్తలు  చదవడం , ఎన్నో చేయ వచ్చు. పిల్లలు ఇల్లు వదిలి, చదువు కోసమో, ఉద్యోగం కోసమో బయటకి వెళుతున్నారు.  పాస్ పోర్ట్ ,వీసా లాంటి వివరాలని మనంతట మనమే చూసుకోవచ్చు ఎవరి మీదా ఆధార పడకుండా.
ఒక్క సారి శూన్యం గా అనిపించి, ఏదో బాధ తో, బి . పి .లు, షుగర్ లు వచ్చి, మనకి ఏదో ఆరోగ్య బాధలు ఉన్నాయి అని విచారిస్తూ కూర్చునే రోజులు కావివి. మన ఆరోగ్యం కూడా మనమే బాగా చూసు కోవాలి, ఎక్కడి నుంచో పిల్లలు వచ్చి మనకి సేవలు చేయడానికీ ,వారికి వీలు పడదు, అని తెలుసు కోవాలి. ఉద్యోగ బాధ్యతలు పిల్లలు ఆడ పిల్లలు అయినా మగ పిల్లలు అయిన ఇప్పుడు ఒక్క లాగే ఉంటున్నాయి. 
ఇంక ఆడ పిల్లకి పెళ్లి అయి విదేశం లో ఉంటే, తప్పక అమ్మలు వెళ్ళాల్సిందే డెలివరీ సమయానికి. వారు పంపించే వీసా కాయితాలు, టికెట్ అన్నీ నెట్ నుంచే చూసు కోవచ్చు. అక్కడ వాతావరణం, ఆ ఊరు లో సదుపాయాలు అన్నీ మనం ఇక్కడ ఇంట్లో కూర్చునే చూడ వచ్చు. ఎంత పరిజ్ఞానం ఉంటే ఏ విషయం మీద అయినా అంతా మంచిది, ఈ రోజుల్లో. మన గది లోనే కూర్చుని, ప్రపంచం అంతా చుట్టి రావచ్చు.
ఇంకా వంటలు అవీ ఇష్టం ఉన్నవారు, లెక్క లేని అన్ని వంటల పేజీలు  చూడ వచ్చు, లేదా వారికి తెలిసిన వంటలు, ఇంక చిట్కాలు, ఏవైనా ఇలాగే ఒక బ్లాగ్ లో రాయ వచ్చు. 
నాకు బాగా నచ్చిన టి వి సీరియల్ అమ్మమ్మ.కామ్ లో అమ్మమ్మ ఇంటి నుంచే ఎంత ఉపయోగ పడే విషయాలు చెపుతో ఉంటుంది. మధ్య తరగతి, మామూలు మగవారి మనస్తత్వం కలిగిన భర్త, మూర్ఖం గా ముందు వ్యతిరేకించినా చివరకి ఎలా ఆవిడ గొప్పతనం అంగీకరిస్తాడో, చక్క గా చూపించారు. 
ఇంట్లో గృహిణి గా ఉంటూ, మనం ఏమి చేయలేం, ఏం నేర్చుకోలేదు అని విచారించడం మానేసి, ముందు ఈ ప్రపంచ కిటికీ ముందు కూర్చోండి. చేతిలో మౌస్‌ పట్టు కోండి. క్లిక్ చేయండి. ప్రపంచమే తెరుచు కుంటుంది. మీ ముందు రండి ఈరోజే, ఈ క్షణమే..
ఈ టపా రాసి మూడేళ్ళ యిందేమో , ఇప్పుడు ఇంకా ముందుకి వెళ్ళి పోయాం ..అంతా వాట్స్ అప్ ల కాలం ఇప్పుడు ..మరి ..అమ్మ లూ అమ్మమ్మలూ అందరూ వాట్స్ అప్‌ లే మరి ..
మొబైల్ శకం ఇది , దూరాలు తరిగిపోతున్న కాలం ఇది , మన కళ్ళ ముందే విభ్రాంతికర మార్పులు చూస్తున్నాం ..అనుభవిస్తున్నం ..మన తరం నిజం గా చాలా అదృష్ట వంతులం కదా ,ఎవరేమన్నా ..మొబైల్ జిందాబాద్ .

25 అక్టో, 2010

ఆకలి -ఆహారం- ఎవరు పేదవారు?

ఆకలి -ఆహారం- ఎవరు పేదవారు? ఈ విషయాలు చర్చించడానికి NAC అనే ఒక ఉన్నత అధికారుల సముదాయం.. కి ఎట్టకేలకు సమయం దొరికింది. సుప్రేం కోర్ట్ అనే ఉన్నత న్యాయ స్థానం ఈ మధ్యనే, ఎలుకలు తింటున్నాయి, వర్షం లో నాని పాడయి పోతున్నాయి మన తిండి గింజలు వృధా అయి పోతున్నాయి అనే వార్త కి స్పందించి, వెంటనే మూడు పూటలా భోజనం చేయని మన దేశ ప్రజలు కి ఉచితం గా నయానా పంచి పెట్టమని ,మన అలసత్వ ప్రభుత్వం కి చీవాట్లు వేసింది. మంత్రి వర్యులు, అంతర్జాతీయ క్రికెట్ అనే క్రీడ లో అతి ముఖ్య మైన విషయాలు చర్చిస్తూ, చాల బిజీ గా ఉన్నాం అన్నారు, ప్రధాన మంత్రి గారు , ఫైనాన్సు గురించి మాట్లాడారు, ఎవరు ఏమి అన్నా ,న్యాయ అధికారులు మళ్లీ, మళ్లీ ,ఇదే విషయం గుర్తు చేస్తే, మొత్తానికి ఎవరికి పంచాలి? ఎవరు నిజం గా బీద వారు? ఎవరు రోజుకి వచ్చే వంద రూపాయల కూలి తో , బియ్యం, పప్పు, కూరలు, ఇంకా బలం ఇచ్చే ఒక గుడ్డు, ఇంక పాలు, కొనుక్కోలేరు, ఎందుకు ఇలా నీరసం గా ఉంటారు? ఎందుకు పిల్లలని బడి కి పంపించరు,  ఎందుకు చిన్న పిల్లలు కి వచ్చే వ్యాధులు నుంచి కాపాడ లేరు? ఎందుకు? ఎందుకు?  
వారికి వచ్చే కూలి సరిపోదు అని మన లాంటి వాళ్లకి తెలుస్తుంది కాని , ఎక్కడో సెంటర్ అంటే ఢిల్లీ లో కూర్చునే వారికి ఎలా తెలుస్తుంది. మన ఇళ్ళల్లో పని చేసే పని వారు, ఏమి తినకుండా నే పనిలోకి వస్తారు అని తెలిసిన రోజు ,నేను ఆశ్చర్య పోయాను. జీతం అంతా ఏం చేస్తారు? ఇంట్లో అందరు సంపాదిస్తారు కదా? మన ఇంట్లో లాగ కాదు, ఒకరు సంపాదిస్తే నలుగురు తినడానికి.. అనుకున్నాను. కాని వారికి ఎప్పుడో ,ఏదో శుభా కార్యం కి చేసిన అప్పో, లేదా హాస్పిటల్ కి చేసిన అప్పో, ఇల్లు కట్టుకోవడం, అనదిక్కర స్థలం లో, ఎవరికో డబ్బు కట్టి, ఈ అప్పు వారిని కాన్సెర్ (క్షమించాలి ,ఈ పదం వాడినందుకు, ఇప్పుడు కాన్సెర్ కి మందు ఉంది, మునుపటి లాగ కాదు అని తలుసు, అలవాటు  గా పడి పోయే కొన్ని పదాలు ఇవి) లాగ పీడిస్తూ ఉంటుంది. నెల నెల, లేదా వారం వారం వారు కొంత డబ్బు కడుతూ ఉంటారు. మనకి పొద్దున్న లేస్తే, ఈ పూట బ్రేక్ ఫాస్ట్ కి ఏం వండాలి   , బోర్ కొట్టకుండా, రోజు కో రకం చేసి పెట్టాలి, ఇలాంటి సమస్యలు ఉంటాయి. వారికి ఈ రోజు బియ్యానికి పైసలు ఎవరు ఇస్తారు? ఇంట్లో అందరికి అన్నం కడుపు నిండుగా పెట్ట గలనా? రేశున్  కొట్టు మీద బియ్యం ఏ మూలకి  వస్తాయి. మన లాగ లెక్క గా తినరు కదా,  కంచం నిండుగా ఇంట్లో అందరికి అన్నం, ఏదో ఒక కూర వండాలి అంటే ఎంత చూసుకోవాలి? ఆ ఇంట్లో ఆవిడ? మనం ఇచ్చే జీతాలు , నెలకి ఒక సారి ఇస్తాం, నెల అంతా సరి పోతుంద? మన కి  కొంచం ,కొంచం అర్ధం అవుతాయి వారి కష్టాలు.
ఇంక   ఏ మాత్రం పనులు లేని ఒక మారు మూల పల్లెటూరు ఊహిస్తే, చేద్దాం అన్నా పని ఉండదు. పొలం పని చేద్దాం అంటే, కరువో, వరదలో, ఏదో ఒకటి పీడిస్తో, పనులే దొరకవు. ఇప్పుడు వంద రోజులు పని పధకం లో కొంత నయం అంటున్నారు  . 
ఈ నేపధ్యం లో ఎవరు? పేద వారు? ఎవరికి ఈ తిండి గింజలు పంచాలి అనే ఒక మహా సమస్య లో పడి పోయారు. ప్రభుత్వం వారు. 
ఈ మధ్యనే, అడవి లో దుంపలు తవ్వుకుని తినే వారి గురించి రాసారు. మూడు పూట్ల తిండి కోసం పల్లెలు వదిలి, రోజు కూలి చేస్తూ, పట్టణాల్లో, ఆకాశం కిందే పడుకునే  మైగ్రంట్ కూలీలు కని పించరా? మట్టి లో ఆడుకునే మన దేశ భావి పవురులు కని పించరా? 

మన  దేశం మన ఆకలి ఇన్దెక్ష్ ని చాల కింద కి చూపిస్తూ అవాస్తవాలు ని ప్రచారం చేస్తోంది అని అనేక సంస్థలు చెప్పేరు. ఎత్తైన భవనాలు , షాపింగ్ కాంప్లెక్స్ లు, పట్టణాలు లో అభివృద్ధి , రోజు రోజు కి పెరుగు తున్న సెన్సెక్స్ వీటి మెరుపుల  కాంతి వెనుక ఒక నీడ లాంటి చీకటి ఉంది. అది మన ప్రభుత్వం లో పెద్దలకి కనిపించదు. కళ్ళు తెరిస్తే కని పిస్తుంది.

 ఎందుకు అంత నిరాశ గా రాస్తారు? ఎంత అభివృద్ధి చెందింది మన దేశం దీని గురుంచి రాయ కూడదా? అంటారు కొందరు. మన దేశం లో అరవై శాతం ప్రజలు, ఆకలి తో నే కాళ్ళు మూడు చుకుని పడు కుంటున్నారు అని, చివరకు ఈ రోజు తేల్చారు. వీరినే BPL  అని ఆ గీత కింద ఉంటారు అని అంటారు  . 

పోనీ  ,ఇప్పటికైనా మేలు కున్నారు. వీరికి మూడు రూపాయలకి , గాని, ఇంక తక్కువకే ఆహార పదార్ధాలు సరఫరా చేస్తారు ట.  ఆచరణ లోకి తేవడానికి ఎన్ని రోజులు పడుతుందో కానీ, ఎప్పటి కప్పుడు, వీరికే సరిగ్గా అందు తున్నాయి అని చూసేందుకు కూడా ఇప్పుడే నియంత్రణ లు పెట్టాలి, మొన్నటి వరకు ఎలకలు తిన్నాయి ట, ఇంక వేరే పంది కొక్కులు లాంటి వ్యాపారస్తుల బారిన పడకుండా కాపాడాలి. 

మన దేశం లో, అన్నీ ఉంటాయి, పేపర్ మీద. కాని అంద వలసిన వారికి అందవు అవీ. కాని, దేశం ఇలాగ ఈసురో మని ఆకలి తో ,నీరసం గా మూలుగు తూ ఉంటే, ఒక్కరైనా అంటే ఇరవై శాతం అయితే ఫర్వ లేదు అన్నట్టు కాదు, ప్రతి ఒక్కరు, కడుపు నిండా తిన గలిగి ఉండాలి, ఇదే మన దేశ గొప్పతనానికి నిర్వచనం. ఈ కల నిజం చేయడానికి ,పూనుకోవాలి.

పంచవర్ష ప్రణాలికలు , బడ్జెట్ లు, ప్లానింగ్ కమీషన్లు, మంత్రి వర్గాలు, ప్రభుత్వ పథకాలు, అధికారులు అన్నీ, అందరు.. ఈ దిశా గా ఆలోచించాలి, అంటే గీటురాయి అంటారు, అలాగ, ఈ రోజు ఎంత మంది హాయిగా ,కడుపు నిండా తిన్నారు? ఎంత మంది ఆకలి తో ఉన్నారు? ఎందుకు? అని ఆలోచించే రోజు రావాలి.  ఆ రోజు దేశం నిజం గా అన్నపూర్ణ మన దేశం అని పాడు కునే రోజు.


24 అక్టో, 2010

విలక్షణ మైన ప్రేమ కథ ??

కళ జీవితం నుంచి పుడుతుంది అంటారు.  కొన్ని కథలు చదువుతూ, ఇలాంటివి కథల్లో నే జరుగుతాయి, నిజం గా జరుగు తాయా? అని పెదవి విరుస్తాం.  హిందూ పేపర్ లో ఈ వార్త  కథనం నన్ను చాల కదిలించింది.  మీతో పంచు కోవాలని రాస్తున్నాను. 
మనోహర్ దేవదాస్ గీసిన చిత్రాలు, మహేమా మరియు సీత కోక చిలుకలు.. అనేవి లక్షణ ఆర్ట్ గేలరీ లో ప్రదర్శింప  బడు తున్నాయి.  ఏమిటి వీటి ప్రాముఖ్యం అంటున్నారా?  ఇవి వేసిన మనోహర్ కి కళ్ళు కనిపించవు.  జీవిత సహా చారిణి మహేమ జ్ఞాపకాల తో వీటిని గీస్తున్నాడు మనోహర్. ఆమె ను ఎంతో ఇష్ట పడి, ఆమెను తన ప్రేమతో , గెలుచు కున్నాడు ట. ఎన్నో ప్రేమ లేఖలు రాశాడుట. తన జీవితం లోకి ఆమె వస్తే,  ఎంత  బాగుంటుందో,  తన ప్రపంచం లోకి ఆమె ఎన్ని రంగులు నిమ్పగాలదో అని  వర్ణిస్తూ, ప్రేమ లేఖలు రాసి ఆమె ను ఒప్పించి , ఆమె ను వివాహం చేసుకున్నాడు.
తొమ్మిది సంవత్సరాలు మధురమైన జీవితం గడిపాక ,ఒక రోజు వారి కార్ ఒక లారీ కి గుద్దుకుని ఆక్సిడెంట్ అయింది. ముప్పై రెండు ఏళ్ల మహేమా మెడ కింద నుంచి పక్ష వాతం తో లేవ లేని స్థితి లో ఉంది పోయింది.

చిన్న చిన్న కారణాలు, పెద్దవి చేసుకుని విడి పోయే దంపతులు ఇది చదివి తీర వలసిందే.. 

మామూలు , శరీరాకృతి  కలిగిన మనోహర్, వ్యాయామం  చేసి తన చేతులను దృఢ పరచుకుని, కదల లేని తన భార్య ని తన చేతుల మీదు గా ఇంట్లో తిప్పేవాడుట  . కష్టాలు అన్నీ ఒక్క సారే   వస్తాయి అన్నట్టు ఇదే సమయం లో మనోహర్ కళ్ళకి ఏదో వ్యాధి వచ్చి అతనికి కళ్ళు కని పించడం మానేశాయి ట.
నాకే ఇన్ని కష్టాలు వస్తాయి అని బాధ పడుతూ, కన్నీళ్లు కారుస్తూ కూర్చో కుండా, వీరు    ఇరువురు, ఒకరి కోసం ఒకరు నిలిచి,  కథలు వ్రాస్తూ, చిత్రాలు గీస్తూ, వాటిని అమ్మగా వచ్చిన డబ్బు హాస్పిటల్ ల కు,  దాన సంస్థ లకు ఇచ్చేవారుట.

 "వైగై సూర్య అస్తమయం " అనే చిత్రం ఒక మరణ అవస్థ ను ప్రతి బిమ్బించే చక్కని చిత్రం.. లే లేత గులాబీ రంగు, నారింజ , వోఇలేట్  రంగుల  మబ్బులు , కుంగి పోతున్న సూర్యుడు , ఈ చిత్రం లో కనువిందు చేస్తాయి. 
ఇంకో క చిత్రం. పసుపు పచ్చని  నదిలో, ముగ్గురు నడుం వరకు మునిగి ఉన్న దృశ్యం ..అడవి ఆడ పడుచు , ఒక చిత్రం లో, ఎన్నో, ఎన్నెన్నో చిత్రాలు, అతని మదిలో జ్ఞాపకాల గని నుంచి తవ్వి, ఆ జ్ఞాపకాలకు రంగులు అద్ది, చూపే లేని తన కళ్ళతో ఒక దృశ్యం ను మనసు చక్షువు లతో ఆవిష్కరించాడు. 

 నమ్మలేని విషయం లాగ ఉంది కదూ.. తెలుపు లో ఏడు రంగులు ఉంటాయని విన్నాం, మనకి తెలుసు, నలుపు లోంచి కూడా ఇన్ని రంగులా?  తన సహచరిణి కూడా మరణించింది.. రెండు వేల ఎనిమిది లో..

అయినా ఆమె జ్ఞాపకాలతో అతను బొమ్మలు గీస్తునే ఉన్నాడు.  అతను ఆమె కు రాసిన ప్రేమ లేఖలు గుర్తు చేసుకుని, ఆ మాటలు, ఆ ప్రమాణాలు, ఆ ఊహలు, ఆ కలలు కి రూపం కలిపిస్తున్నాడు. 

ఎలా గీస్తారు? ఈయన ఎందుకు గీస్తారు? ఈయన అనే  ప్రశ్నలు ఉదయిస్తాయి.  అతని కి పోయింది దృష్టే కాని అతని లోని కళ దృష్టి కాదు అని ఒక సమాధానం. 

ఎలా? అంటే... త్రికోణ మితి అనే మాథ్స్ పరిజ్ఞానం , వందల్ కొద్ది  ఫోటోలు తీసి, ఆ వస్తువులకి , కళ్ళకి ఒక అరుదైన మందు చుక్కలు వేసుకుని, కను గుడ్లు పెద్దవి అవడానికి, + ముప్ఫై పవర్ ఉన్న కళ్ళ అద్దాలు, చాల ఎక్కువ లైట్ ఇచ్చే లైట్ వెలుతురూ లో, భూత అడ్డంలు వాడుతూ, చేతికి గ్లోవేస్ వేసుకుని,  ఈ వేడి కి చెమటలు పడితే, చిత్రం పాడు అవకుండా, ఇన్ని కష్టాలు పడుతూ, అతను చిత్ర్రాలు గీస్తున్నాడు. 

అతను గీసిన చిత్రం , మొత్తం స్వరూపం కూడా అతను చూడలేడు  . ఒక రూపాయి కాసంత మేర మాత్రమే, చూడ గలడు  .. అయినా అద్భుత  మైన చిత్రాలు, మనసు ని మైమర పించే చిత్రాలు గీస్తున్నాడు అతను. ప్రేమ భావన  కే రంగులు అద్దు తున్నట్టు,  తన లోనే నిలిచిన , ఆమె స్మృతులు కి రూపం ఇస్తూ,  కొనే వారికి , ఒక ప్రియ మైన జ్ఞాపకం కొనుక్కుని వెళుతున్న ఒక అనుభూతి. విలువ కట్టలేని ఒక చిత్రం.. ప్రతి చిత్రం..

ముప్ఫై మూడు పైన్టింగ్స్ లో మూడు మాత్రమే మిగిలి ఉన్నాయిట. లక్షణ ఆర్ట్ గాలెరి లో. ఇవి అమ్మగా వచ్చిన డబ్బు, శంకర్ నేత్రాలయ కీ, అరవింద్ కంటి ఆసుపత్రి కి వెలతాయిట.

ధన్యుడు మనోహర్ దేవదాస్ .. ధన్యు రాలు మహేమా.
ఇది నిజం గా ఒక విలక్షణ మయానా ఒక ప్రేమ కథ కదా?? 
 

20 అక్టో, 2010

ప్రపంచం మన చేతిలో..

ఇరవై ఏళ్ల క్రితం  ఫోన్ కోసం ఒక ఏడాది తపస్సు చేస్తే  అంటే ముందు అయిదు వేలు ధరావతు కట్టి  ఏమైంది మా ఫోన్ విషయం ,అంటే, అప్పుడేనా ఇంకా ఇన్ని వేల మంది మీ ముందు ఉన్నారు, అంటూ  మురిపించి, మురిపించి, చివరకు ఒక రోజు మేం ఊరులో లేని సమయం లో, ఓ ఫోన్ కేబుల్ కిటికిలోంచి పడేసారు, మా రెండో అబ్బాయి పుట్టిన కొన్ని నెలలకే, ఆ రోజు మా ఆనందం ఇంత అంతా అని కాదు. ఫోన్ ఉన్న కొంత మంది అదృష్ట వంతుల జాబితా లోకి మేమూ చేరాం..అదే ఆంగ్లం లో ప్రివేలేజేడ్ ఫ్యూ అంటారు.
ఇంక ఓ పది ఏళ్ళు ఏ మార్పులు లేవు, పొడవాటి లైన్ లో నిల్చుని ఫోన్‌ బిల్ కడుతూంటే, మీకు మేం ఎంత సేవ చేస్తున్నాం అంటూ డబ్బు తీసుకోవడం  అమ్మయ్య ఈ రోజు మనం ఎంత గొప్ప పని చేసాం, ఒక గంట లోనే బిల్ కట్టేశాం అంటూ నేను నేను అభినందించు కోవడం, ఇవి ఇప్పుడు ఏదో కల లాగ గుర్తు ఉంది.
రాజీవ్ గాంధీ టైం లో, శామ్ పిట్రోడా అనే ఓ టేక్నోక్రాట్ ఆధ్వర్యంలో మొదలయింది, మన సమాచార వ్యవస్థ ప్రయాణం.. ఒక దశాబ్దం లో ఎంత మార్పు, ఇప్పుడు వీధికి నాలుగు ఎస్ టీ డి కొట్లు, పల్లె పల్లె కూ ఫోన్‌ లైన్లు, అదే ఒక విప్లవం మన భారత దేశం లో అనుకుంటే, నవ శతాబ్దం లో అంటే రెండు వేలు ఏడాది నుంచి మన దేశం తన మార్కెట్ తలుపులు తెరిచింది, అంతే, మొబైల్ లేదా సెల్ ఫోన్‌ అనే సమాచార విప్లవం ఉదయించింది మన భారత్ దేశం లో, మన జీవితాలే మారి పోయాయి.
మనం ఇంట్లో లేక పోతే ఏదైనా ముఖ్య విషయం చెప్పాలి, అంటే  అవతలి వారు మనం ఇంటికి వచ్చే వరకు ఓపిక గా వేచి ఉండడమే . ఒకే ఒక ఫోన్‌ రింగ్ అయి, రింగ్ అయి ఓపిక పోయి, నీరసం వచ్చి ఊరుకునేది. మన కి ఏదో ఊరడింపు గా నెల కి, ఒక ఏభై రూపాయలు అదనం గా కట్టించు కుని ఒక కాలర్ గుర్తింపు సదుపాయం అంటూ పెట్టారు. మన సమాచార శాఖ వారు, ఏదీ చేసినా ఒక మెహర్బానీ ఏ వీరికి. వెంటనే ఆ సదుపాయం పెట్టించు కున్నాం . అయితే, ఈ సదుపాయం ఉన్నట్టే చాల మందికి తెలియదు, చాలా రహస్యం గా దాచుకునే వారు, ఇలాంటి సేవలు ..అందరికి అందుబాటు లో ఉంటే, వీరికి పని ఎక్కువ అవుతుందనో ఏమిటో? మరి.
ఇలాంటి సమయం లో ఈ మొబైల్ ఫోన్ అనే సదుపాయం  ఆకాశమే చేతిలో కి వచ్చినట్టు. ఏదో బయట పని లోకి, వెళ్ళే మగ వాళ్ళు కి ఒక ఆభరణం లాగ వచ్చింది మొదట్లో ఈ ఫోన్. జేబులోనో, బెల్ట్ కి నడుము దగ్గరో కట్టుకుని ఉండేది, సౌండ్ వస్తే, మాట వినబడదు, మన మాట వాళ్లకి వినబడదు, సెల్ కవరింగ్ లేదు అంటూ నడుచుకుంటూ , ఎక్కడికో వెళ్ళిపోవడం, దాని మీద బోళ్ళు జోక్స్..
టాటా వారే అనుకుంటా ముందు పోటిగా ప్రవేశించారు రంగం లోకి, అంతే సీను మారి పోయింది. పెను నిద్ర లోంచి ఆవులించుకుంటూ లేచారు. మన భారత దేశ సమాచార శాఖ వారు వారం రోజుల్లోనే ఫోన్ . మీ ఇంటికి వచ్చి అప్లికేస్సన్‌ తీసుకుంటాం అంటూ. నేను రెండు మూడు సార్లు నన్ను నేను, పక్క వాళ్ళని కూడా గిల్లి చూసాను, కలా? వైష్ణవ మాయా? అని..
ఇంట్లో లేక పోతే ఏ బొమ్మనో లోనో, చందనా లోనో, లేదా కరాచి వాల షాప్ లోనో ఉంటాను, నాకు ఎందుకు ఈ సెల్ ఫోన్ లు అవీ అని మొదట చాల వ్యతిరేకించాను. ఏదో అనుమానం మొగుడు లాగ (నా అనుభవం లో కాదు) వెంట వెంట వస్తున్నట్టు, మనం ఎక్కడ ఉంటే అక్కడికి పోన్ ఆ ? అదో మోత దండుగ, ఇప్పటికే భుజం లాగేస్తోంది ఈ హ్యాండ్ బాగ్ మోయలేక అనుకున్నాను. కాని, ప్రలోభంకి లొంగి పోయాను. అది ఒక ఫ్యాషను కదా మరి.
ఒక రోజు హైదరాబాద్ కి విజయవాడ మీదుగా బయలు దేరాను, ఉదయమే వెళ్ళే జన్మ భూమి లో టికెట్ కొనుక్కుని, ఏ సి చైర్ కార్ లో పెట్టె పెట్టి, మా వైజాగ్ స్టేషన్లో కొత్తగా పెట్టిన హోటల్ లో, వేడి వేడి ఇడ్లి తిని, వేడి కాఫ్ఫీ ,ఊదుకుంటూ తాగుతూంటే, రైలు కదిలిపోయింది. నా పెట్టె రైల్ లో, నేను ప్లాట్ ఫాం మీద.. దిక్కు తోచలేదు. వెంటనే స్టేషన్‌  మాస్టర్ కి రిపోర్ట్ చేశాను. అనకాపల్లి లో ఆగుతుంది, అక్కడ కాచ్ చేయండి అని ఒక సలహా ఇచ్చారు. అప్పుడు, ఒక అర గంట తేడా తో బయలు దేరే సింహాద్రి రైలు ఎక్కి, ఈ జన్మ భూమి రైలు ని చేసింగ్  మొదలు పెట్టాను. 
అప్పుడు నా బాగ్ లోని ఈ సెల్ ఫోన్ ,ఒక దేవత లాగ అని పించింది. వెంటనే తీసి, ఎడ పెడ రాజమండ్రి లో ఉన్న మా మరదలు కి, పెట్టె ఉందో లేదో కని పెట్టమని, ఒక ఫోన్, విజయవాడ లో ఉన్న మా మరిది కి ఇంకో ఫోన్ కాల్ కలిపి, నా కన్నా ముందు నా పెట్టె, ఇంకో రైలు లో వస్తోంది, ఎలాగో ఒక లాగు ,దాన్ని అంది పుచ్చు కోమని, చేసి,  ఇంట్లో ఒక ల్యాండ్ ఫోన్ ఉంటే ఏం ప్రయోజనం .ఇలాగ బాగ్ లో ఎప్పుడూ, నా వెంట ఉండే ఈ సెల్ యొక్క మహత్యం ఇంత అంతా అని కాదు. అని చాల ప్రత్యక్షం గా అనుభవం తో నేర్చుకున్నాను  సెల్ ఫోన్ యొక్క అవసరం.. మహత్యం పెట్టె దొరికింది లెండి.
ఇంక ఈ సెల్ ఫోన్ ఇంతై వటుడింతై అన్నట్టు పెరిగి, ఓహో ఎంత వింత అన్నట్టు చేతిలో అద్భుతాలు చూపిస్తోంది. ఫోన్ అంటే మాట్లాడు కోడానికి,టేప్ రికార్డర్ అంటే పాటలు విన డానికి, కేమెర  అంటే ఫోటోలు తీయడానికి ,కంపూటర్  అంటే , మెయిల్స్ అవీ చూసు కోవడం ,నెట్ లో ఏదైనా వెతుకోడానికి,  ఇలాగ వేటి అవసరం వాటికి, నాలుగైదు వస్తువులు కొనుక్కోవడం ఉండేది.
ఇప్పుడు అన్నీ కలిపి ఒకే ఒక బుల్లి, చేతిలో పట్టే అందమైన చిన్న యంత్రం.. సెల్ ఫోన్. అవురా? ఎంత మార్పు.. ? అని ముక్కు  మీద వేలు వేసుకోవాల్సి వస్తోంది.
మాట్లాడు కోడానికి, ఫోటోలు తీసు కోవడం, పాటలు వినడం, వీడియో కూడా తీయ వచ్చు , నెట్ కనెక్ట్  చేసుకుంటే, అదీ వై ఫై అనే కేబుల్ అక్కరలేని సుకర్యం ఉంటే, ఎక్కడైతే ఈ సదుపాయం ఉంటుందో, అక్కడ నుంచి మనం మెయిల్స్ పంపించ వచ్చు, మనకి ఏమైనా తెలుసు కోవాలి అంటే వెతుక్కోవచ్చు, ఇంకా జీ పి ఎస్  అనే సదుపాయం కూడా ఫోనే లో ఉంటే, ప్రపంచం లో ఎక్కడి కైనా మనం దారి చూసుకుంటూ క్షేమం గా వెళ్ళి పోవచ్చు, ఆపద లో ఉన్నాం అనుకుంటే ఒక కాల్ తో పోలీసులకి సమాచారం  ఇవ్వవచ్చు. ఇన్ని ఎందుకు ప్రపంచమే మన గుప్పెట్లో ఉంది.. అంటే అంత విషయమూ చేతిలో పట్టేంత చిన్నదిగా చేసి, రోజు రోజు కి ధర కూడా అందరికి  అందుబాటులోకి తెస్తున్నారు, పోటీ పడి మరీ. 
ఇంకా అంతేనా ఇంకా ఇవ్వాలో రేపో, మనం మాట్లాడే వాళ్ళ మొహాలు కూడా చూడ వచ్చు .నీవేనా నను తలచినది, అని తలుచు కాగానే వారినే చూడ వచ్చు మాయా బజారు లో పెట్టె లాగా అన్నమాట..
తపస్సు చేసి సంపాదించిన ల్యాండ్ ఫోన్‌ నుండి, చేతిలో పట్టే ఈ దివ్య మైన ఆల్ ఇన్ ఒన్..వరకు మన సమాచార వ్యవస్థ ప్రయాణం.. దూరాలను దగ్గర చేసే మహత్తర వరం.
దీని వెనక ఎందరో వైజ్ఞానికులు, అందరికీ వందనంలు.



19 అక్టో, 2010

లైసెన్సు టు కిల్ అని జేమ్స్ బాండ్ అనే డిటెక్టివ్

రోజూ  వార్త లలో చూస్తున్నాం, చదువుతున్నాం.. వర్షాలు భీభత్సం గా జన జీవనం ని అతలాకుతలం చేస్తున్నాయి. ఏదో వర్షా కాలం, మూడో, నాలుగో నెలలు వర్షాలు పడడం అలా కాదు, శ్రావణ భద్రపదాలు వస్తున్నాయి అని, జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పే వారు. ఇప్పుడు అలా ఒక నెల, ఒక ఋతువు అని లేదు, ఎప్పుడు ముంచుకుని వస్తుందో తెలీదు.. మన అస్తవ్యస్త ప్లానింగ్ ఫలితం గా, ఎక్కడ పడితే అక్కడ స్థలం ఉంటే చాలు ఇల్లు కట్టేసుకుని, ఈ వర్షం నీరు వెళ్ళే దారి లేక, ఆ నీరు ఇళ్ళల్లోకి ప్రవేశించడం, ఇంకా వర్షం నీళ్ళల్లో కొట్టుకు పోయి, ప్రాణాలు కూడా పోయిన సంఘటనలు, ముంబై లాంటి, మహా నగరం లో, వర్షం వల్ల ఆగి పోయే జనజీవనం - దీని మీద సినిమాలు కూడా వచ్చాయి..
ఈ నేపధ్యం లో, ఇవ్వాళ పోస్కో అనే స్టీల్ మహా సామ్రాజ్యం కి ఇచ్చిన లైసెన్సు రద్దు చేయాలి అని నిర్ణయించారు. అనే ఒక వార్త చదివాను నెట్ లో. విశాల మైన ,దట్టమైన అటవీ ప్రాంతం అంతా కొట్టి వేసి, అక్కడే ఒక స్టీల్ సామ్రాజ్యం నెల కొల్పుతారుట. కొన్ని రోజుల ముందే వేదాంత అనే ఒక వ్యాపార సంస్థ కి కూడా ఇలాగే లైసెన్సు రద్దు అన్నారు.
లైసెన్సు టు  కిల్ అని జేమ్స్ బాండ్ అనే  డిటెక్టివ్ ఉంటాడు.. అతనికి చెడ్డ వారిని అంటే విలన్లు ని చంపేయడానికి ఒక స్పెషల్ పెర్మిట్ ఉండేది. అలాగ   ఈ మహా సామ్రాజ్యాలు మానవ జాతి ని తుడిచి పెట్టేయ డానికి ఎదైనా      కంకణం  కట్టుకున్నారా ? అని అనుమానం కలుగుతోంది. 
నాకు అర్ధం అవదు. వారు కూడా ఈ భూమి మీదే నివసించాలి   కదా? మొక్క, మాను, అడవి, పూలు, స్వచ్చమైన గాలి, నదులు, కొండలు, మనం తినడానికి అన్నమో ,గోదుమలో, ఇంకా ఎన్నో పంటలు, కూరగాయలు, పళ్ళు, తాగడానికి నీరు.. ఎన్నో, ఇంకా ఎన్నో మనకి ఈ భూమే అడగ కుండానే ఇస్తోంది. ఇలాంటి భూమి ని చెల్లా చెదురు చేసి, ఏదో ఒక ఇనుము ,స్టీలు, తయారు చేసే వాటిని నిర్మించ డానికి మనసు ఎలా వస్తుంది? రేపు వారి పిల్లలు కూడా ఈ భూమి మీదే నివసించాలి కదా?  ఏ ధైర్యం తో, వారు కూర్చున్న కొమ్మనే నరుక్కోవడం లాంటి ఈ పనులు చేస్తున్నారో? అర్ధం అవదు. 
గ్రీన్ పీస్ అనే సంస్థ ఇలాంటి వారి ఆగడాలు, స్వార్ధం, ధన అపేక్ష, మానవ మనుగడ గురించి నిర్లక్ష్యం వెరసి ఒక లైసెన్సు టు  కిల్ పుచ్చు కున్న ఇలాంటి మహా సామ్రాజ్యాల అంతం, నియంత్రణ కోసం తాపత్రయపడుతోంది..
ఈ మహా సామ్రాజ్యాలు , చాల ఉపకారం చేస్తున్నట్టు, ఒక పేద దేశం లో పెడుతున్నాం మిమ్మల్ని ఉద్ధరించదానికే అంటారు. ఉద్యోగాలు వస్తాయి అని ఆశలు చూపిస్తారు. వేల, సంవత్సరాల భూమి  తపః ఫలితం గా అన్నట్టు  ఉద్భవించిన ఈ పెను అడవిలను ,బుల్ డోజేర్లు తో అడ్డం గా నరికి , మన వర్షాలకి, మన అటవీ సంపదలకు, మన అడవి పుత్రులకు, మన సజీవ ,అతి ప్రాచీన సంస్కృతి కి , మన కి ఊపిరి పోసే వృక్షాల కి నిలయ మైన అడవులని  నిర్దాక్షిణ్యం గా నరికి వేసి, పొగలు చిమ్మే ,పొగ గొట్టాలు ని మనకి కానుక  గా ఇస్తారుట. 
కళ్ళు, చెవులు, నోరు మూసుకుని కూర్చున్న మన ప్రభుత్వా లకు , ఎవరు విప్పుతారు గంతలు? ప్రజలే.. అంటే మనమే..
డావ్ అనే నురుగు వచ్చే, ముఖానికి అందాలు , మెరుగులు ఇచ్చే సబ్బు ను తయారు చేయ డానికి, ఇండోనేసియా దేశం లోని  అతి ప్రాచీన రైన్ ఫారెస్ట్ లోని చెట్లను నాశనం చేస్తున్నారుట. ఇంకా వింత ఏమిటి అంటే, మేము మరో చోట చెట్లు నాటుతున్నాం అంటారు వీళ్ళు. నాశనం చేయ కుండా ఉంటే చాలు కదా? 
రోదసి నుంచి చూస్తె ,భూమి ఒక గుండ్రని బంతి లాగా కనిపిస్తుంది. పచ్చని బంతి లాగ ఉండే ఈ భూమి ని ఒకే అఖండ పృథ్వి ,అంతే కాని, ఇక్కడ ఒక ముక్క, ఒక దేశం, నా దేశం, అక్కడ ఇంకో ముక్క, నీ దేశం కాదు.. ఎక్కడ ఏం చేసినా , దాని ఫలితం అందరు అనుభవిస్తాం . 
ఊపిరి పిల్చేందుకు గాలి కూడా కొనుక్కోవలసిన రోజు వస్తుంది, ఇప్పటికే తాగడానికి సీసాల్లో నీళ్ళు కొనుక్కుంటున్నాం..
మన అకాల ,అతి భీభత్స వర్షాలకు, ఎడారి ని తలపిస్తున్న ఎండలకు, ఇంకా చాలా వాటికి, కారణం- మూల కారణం వెతికి, ఇప్పటికైనా మేలుకుని ప్రభుత్వాలను కదిలిద్దాం.. మన పిల్లల పిల్లలకు కూడా ఒక హక్కు ఉంది, ఈ భూమి మన ఒక్కరి సొత్తే కాదు.
పోస్ట్ స్క్రిప్ట్ లాంటి ఒక కొస ఆలోచన..
ఇది చదువు తూ ఏమిటి మరి ఇన్డుస్త్రీలు ,వద్దా? అభివృద్ధి వద్దా? ఈమెకు అంటారా? అని ..కావాలి కాని, కేవలం లాభాలు కోసమే కాదు, మానవీయ ముఖం కలిగిన అభివృద్ధి, కొందరిని తొక్కి, వేసే నిచ్చెనలు కాదు, అందరి కోసం..ఉండాలి ఈ అభివృద్ధి...
ఏమిటి ఈ పిచ్చి వర్షాలు? కలి యుగం.. అని నిట్టుర్చే ముందు, ఈ విషయాలు కూడా తెలుసు కోవాలని రాసాను..



17 అక్టో, 2010

రియల్ బిగ్ హీరోలు, రియల్ రియాలిటీ షో

సూర్యోదయాలు లేవు, సూర్య అస్తమయాలు లేవు, రాత్రి- పగలు బేధం లేదు, భూమి అట్టడుగు, మైలున్నర, కింద, ఖనిజాల అన్వేషణ లో, రాగి ఖనిజం వెలికి తీయడానికి అని భూమి ని తొలుచుకుంటూ, కిందకి దిగిన ఆ ముప్ఫై ముగ్గురు కార్మికులకి ఆ రోజు తెలియదు, తాము మొత్తం అరవై తొమ్మిది రోజులు, సూర్యుడు- చంద్రుడు, లేని చీకటి గుహలో గడప వలసి వస్తుందని.
కూలిపోయిన ఆ మైన్ లో, తాము బతికే ఉన్నామని ,బయట ప్రపంచానికి తెలిసేందుకే, పది హేడు రోజులు పడుతుందని.. రోజూ ఉదయిస్తున్న సూర్యుడని, చూస్తూ, రాత్రి చల్లని చందమామ తో కబుర్లు చెపుతూ, ఫోన్ లో రోజూ, మన దేశం లో, ఉన్న స్నేహితులు, పిల్లలు తో, బంధువులతో మాట్లాడుతూ, బయటకి వెళ్ళలోక పోతున్నాను అని దుఖిస్తూ, కూర్చునే నాకు వీరి కథ , వీరి మొక్కవోని ధీరత్వం ఒక పాఠం.
ఎప్పుడూ, మనకి లేని వాటి గురించే బాధ పెడతాం ఎందుకో? ఉన్న ,అనుభవిస్తున్న సుఖాలు, సవుఖల్యాలు మనకి ఎందుకని కనిపించవు? అని పించింది.
 ఈ నిజమైన రియాలిటీ షో , మొత్తం ప్రపంచాన్నే ఆకట్టుకుంది.
ఎంజేనీరింగ్ ప్రతిభ, కి మానవత్వ విలువలు తోడై, చిలీ  దేశం , ఆ దేశ రాష్ట్రపతి పూనుకుని, అమెరికా నాసా సహాయం, తోడ్పాటు తో, ఒక ఫెనిక్ష్ అనే  మిస్సైల్ లాగా కనిపించే ఒక సన్నని పంజరం తయారు చేసారు, ఫేనిక్ష్ అనే పక్షి, బూడిద నుంచి మళ్లీ పుడుతుంది అని పురాణ కథ. 
ఈ  పంజరం ,భూమి లో తొలుచుకుని కిందకి దిగడానికి శక్తి వంతమైన డ్రిల్ యంత్రం తయారు చేసారు, చైనా సాయం తో. పదిహేడు రోజులు , భూ స్థాపితం అయిన తరువాత, ప్రపంచానికి, వీరు బతికే ఉన్నారని తెలిసిన తరువాత, వారికి, ఒక సన్నని  గొట్టం ద్వారా మందులు,  ఆహారం, ఒక వీడియో కేమెర కూడా పంపించారు.
ఆ రోజూ నుండి, వీరి మొహాలు, వీరి మాటలు విన్తునారు, టీవీ ల సాయం తో, ప్రపంచం అంతా చూసింది, ఈ నిజమైన రియాలిటీ షో ను. వారి ఇంట్లో భార్య పిల్లలు, బంధువులు అందరు వీరిని చూస్తూ,  నిముషం నిముషం వీరి మనుగడ గురించి విచారిస్తూ, ఎంత నరకం అనుభవించి ఉంటారో కదా? 
ఈ మధ్య రియాలిటీ షో అంటూ, ఒక ఇంట్లో, కొంత మంది సెలెబ్రిటి లను పెట్టి, వారిలో వారికి ఏవో స్పర్ధలు పెట్టి ,చాల అసహజం గా ఆఖరికి ఎవరో ఒకరిని బిగ్ బాస్ అని ఎన్నుకోవడం, ఈ షో అందరు చూడడమే  కాదు, ఓటులు కూడా వేసి, గెలిపించడం , ఇదంతా, మానవీయత , సభ్య సమాజ , మధ్య ఉండ వలసిన స్నేహ , సుహృద్భావ భావ శూన్యత కాదా?  ఒక సభ్య సమాజం లో ఉండ వలసిన , గొప్ప విలువలని అపహాస్యం చేస్తూ, ఈ రియాలిటీ షోలను ఎలా అనుమతించారు? ప్రజలు ఎందుకు చూస్తున్నారు? 
ఇలాంటి  సమయం లో,   ఒక ఆపద సమయం లో వ్యక్తులు ఎలా, ఒక సముదాయం గా కూడి, ఒకరికి ఒకరు ధైర్యం  చెప్పుకుంటూ,  ఉన్న వనరులని , అందరి తో పంచుకుంటూ,  పరస్పర సంభాషణ లతో బాధ, దిగులు మరిపించు కుంటూ, మనం మళ్లీ, మంచి రోజు చూస్తాం,మళ్లీ బయట ప్రపంచం లో భాగం అవుతాం అని, విశ్వాసం తో, నిరాశ అనే దెయ్యం ని తోసి, ఆశ అనే దేవుడు హస్తం ని అందు కుని, భూమి అట్టడుగు  పాతాళం లోంచి ఫెనిక్ష్ లాగ పునరజ్జీవమ్    పొంది, మానవీయత కే  మొక్కపోని విజయం ని సమ కూర్చి, ఈ నిజమైన రియాలిటీ షో, ఒక చరిత్ర సృష్టించింది.
ఇప్పటికైనా ఇలాగ  భూగర్భం నుంచి ,ఖనిజాలను వెలికి తీసే, కార్మికులకి మంచి రోజులు వస్తాయా? అనే ఆశిద్దాం. ప్రపంచం అంతా నేడు చూస్తోంది, లాభాలు ఒక్కటే దృష్తి లో పెట్టుకుని,  సరి అయిన జాగ్రత్తలు పాటించని యజమానులు ఇంక ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి,  ప్రైవేటు భాగస్వాములు కి, ప్రభుత్వం ఒక నియంత్రణ యంత్రాంగం తో నియంత్రించి, కార్మికుల కి వెసులుబాటు కల్పిస్తూ, ఆదేశాలు జారి చేయాలి. 
చిలి దేశం అందరి ప్రశంసలు ,మన్ననలు పొందింది. ఇలాంటి ఉపద్రవాలు ఎదురు అయినప్పుడు , చేయవలసిన సహాయ కార్యక్రమాలు చక్కగా నిర్వర్తిన్చిందని, అవసర మైన చోట్ల ,ఇతర దేశాల సహాయ ,సలహాలు తీసుకుందని,  మంచి పేరు పొందింది.
ఈ సంఘటన , ఒక పాఠం గా నిలుస్తుంది అనడం లో సందేహం లేదు. మానవ స్ఫూర్తి ,  సుహర్ద్రం , అవాంతరాలు  ఎదురు అయినప్పుడల్లా,    ఆశావహ దృక్పధం తో ఎలా ముందుకు సాగి పోవాలో నిరూపించింది.. 
ఇవి మనం నేర్చు కోవలసిన పాఠం. రియాలిటీ షో పేరు పెట్టి, విడదీయడ కాదు, మానవ మనుగడ ని ఇంకా అందం గా, ఇంకా సుమధురం గా ఎలా గడపాలి అని అన్వేషణ సాగించాలి..
వసుధైక కుటుంబం అని పాడుకుంటూ, సాగిద్దాం ఈ ఉత్కృష్ట మానవ, కుటుంబ సమాహర సాముహిక పయనం..

14 అక్టో, 2010

మన దేశ పరువు ప్రతిష్టలు..

నిన్నేఒక  వార్త చదివాను, ముస్కాట్ ఎయిర్ పోర్ట్ లో, పాస్ పోర్ట్ పోయిన ఒక మహిళ, నాలుగు 

రోజులు ఎయిర్ పోర్ట్ లోనే మన  ఏమ్బసి వారి సహాయం కోసం ఎదురు చూస్తూ, గుండె పోటు తో 

మరణించింది అని. ఇండియా కి బయలు దేరిన ఆమె  ప్రయాణం అర్ధాంతరం గా దారిలోనే 

ముగిసింది. ఎంత హృదయ విదారకం? నిజం గా జనా అరణ్యం లో నివసిస్తున్నమా? మనం. 

దేశం కాని దేశానికి, ఎన్ని ఆశలు తో వస్తారో ...కష్ట పడి జీవితం లో ఏదో నాలుగు డబ్బులు కూడ బెట్టి బాగు పడాలని,కోటి ఆశలతో ..కష్ట పడినన్ని నాళ్ళు కష్టపడి, ఇంకా ఓపిక ,శక్తీ ,బలం నశించి పెద్ద వయసులో ఈ ఒంటరి మహిళ ఇలాగే  తిరిగి మన దేశం కి బయలు దేరింది. 
దారిలో ఎక్కడో ఆమె పాస్ పోర్ట్ పోయింది. రెసిడెన్సీ అయిపోయిన దేశం వెనక్కి అనుమతించరు. మన భారత దేశం ఏమ్బసి అధికారులు, కి ఫోన్ లో విషయం తెలిపినా , స్పందించ డానికి  మరి ఏమయిందో  ?  రూల్స్, దేశాలు మధ్య గీసిన బోర్డర్ గీతాలు, ఒక పాస్ పోర్ట్ ఎర్రదో, నీలందో, ఒక చిన్న పుస్తకం, దాని మీద అధికారుల సంతకాలు, ఇవే ఎక్కువా? ఒక ప్రాణం కన్నా? 
ఒక తల్లి, ఒక కుటుంబం, ఒక భార్య, ఒక అక్క కాదా ఆమె? ఏమిటి ఈ నిర్లక్ష్యం? మన అధికారులకి, అని మనసు దుఖించింది  .
ఇంక ఇప్పుడు, ఆ చనిపోయిన శరీరం ని దేశం కి పంపించడానికి, ఎన్ని ఆటంకాలు ఉంటాయో? మరి ఇప్పుడు, మానవత ,మేల్కున్తోందో? ఆలస్యం గా నైనా? ఈ దేశాలకి వచ్చే మహిళ లది ఇలాగే ఒక్కరికి ఒక్కో కథ.
ఏదో ఇంత డబ్బు సంపాదిస్తాం అని వస్తారు,  ఒంటరిగా ఎన్నో సమస్యలు ఎదుర్కుంటారు. ఆత్మ హత్యలు వింటాం,  చెత్త కుప్పల్లో  పడేసిన మృత శరీరాలు, చంటి బిడ్డలవి  వింటాం,  రహస్య సంబంధాల్లో పట్టుబడ్డారని వింటాం, అవును మరి చాకిరి కోసం పని మనిషి రూపం లో ఒక మనిషి, వా నికి కూడా కోరికలా? ఎంత ఘోరం.. నడిచే చేతులు కదిలించే, ఒక మర మనిషి, ఇంటి పనులకి కావాలి , కాని, ఒక  సజీవ మనసున్న మనిషి కాదు.ఒక దేశం ప్రజలు, ఇంకో దేశానికి వచ్చి ఇలాంటి చాకిరి పనులు చేస్తూంటే, మన దేశం పెద్దలు కి ఏమి అనిపించదా ?
 ఇంటి పనుల కోసం , ఇంత తక్కువ జీతాలు కోసం, ఈ దేశాలకు వచ్చే మన మహిళలకు, మన ప్రభుత్వం , ఏదో ఒక ఇన్సురన్సు తీసుకుని, వారి జీవితాలకి భద్రత కల్పించాలి. ఏజెంట్లని నమ్మి మోస పోయే వారు ఒకరు,  ఇక్కడ ఎక్కువ డబ్బు కోసం, పదహారు గంటలు, రెండు షిఫ్ట్స్ చేసే వారు, ఇంటికి డబ్బులు పంపిస్తే, అక్కడ భర్తలు,  పిల్లలు కూడా, బాధ్యత లేకుండా ఖర్చు పెట్టి, వీరిని డబ్బు సంపాదించే, ఏ టీ ఏం యంత్రాలు లాగ  చూడడం, ఓపిక  నశించి,  ఇక్కడ ఇంక పనులు చేయలేక ఇంటికి ,వెనకి వెడితే, వీరిని ఆదరించే వారు ఉండరు. 
ఇక్కడ  పని చేసే మహిళల  కి కూడా, చదువు లేకో, ఆలోచన లేకో, తమ కోసం ఏమి దాచు కోకుండా, అంతా బంగారం రూపంలోనో, డబ్బు రూపం లోనో, కుటుంబ సభ్యులు కే పంపిస్తారు. పిల్లలకి చదువు చెప్పించి, పొడుపు చేసి, బ్యాంకు లలో దాచు కోవాలని, ఒక ప్రణాళిక ఉండదు వారికి. ఆడ పిల్లలు ఉంటే వారికి, కట్నాలు ఇచ్చి, పెళ్లి చేయడం, బంగారం కొనడం వీటిలోనే వారి సంపాదన అంతా ఖర్చు అవుతుంది. ఇంక అల్లుల్ల్లు కూడా అత్తగారు  లక్షలు సంపాదిస్తున్నట్టు కోరికల చిట్టాలు విప్పుతారు.
మన దేశం నుంచి వచ్చేటప్పుడే, వారికి ఒక అవగాహన తరగతి లాగ నిర్వహించి, వారి చేత బ్యాంకు లో ఖాతా లు తెరిపించి, ఒక ఇన్సురన్సు తీయించి, ఒక పధ్ధతి లో పంపిస్తే, కొంత మేలు. 
మన దేశమే వీరికి పనులు, కల్పించే స్థాయి కి ఎదగడం ఒక సుదూర స్వప్నమే? ఈ లోపల , వైద్యం, పెళ్ళిళ్ళు,  వ్యాపారం లో నష్టాలు, పండని భూముల మీద అప్పులు, ఏవో శత కోటి కారణాలు, ఉన్న ఊరులో కట్టెలు అమ్మ లేక, సుదూరం గా ఉన్న ఈ గల్ఫ్  దేశాలకి, పొట్ట చేత బట్టుకుని ,నాలుగు డబ్బులు సంపాదించి, కుటుంబం ని పోషించాలని, భాష కాని భాష , కొత్త మనుషులు మధ్య అన్నిటికి తెగించి వస్తున్నారు, వీరికి కనీస , సులభ్యం ఉన్న జీవితం కల్పించాలి, మన దేశ అధికారులు,  దృష్టి సారించాలి, మన దేశం పరువు, ప్రతిష్థ అంటే జెండా లోనే కాదు, బంగారు పతకాలు పొందడమే కాదు,  విదేశి ద్రవ్య నిధులు పెరగడం కాదు,వీరి జీవన విధానం మెరుగు  పరచడం కూడా..
 సాఫ్ట్ వారె ఉద్యోగులు, ఇంజనీర్లు, డాక్టర్లు, మొదలైన నిపుణులు ఒక్కరే కాదు, ఇలాగ పని చేయడం కోసం వచ్చే వారు కూడా మన దేశ ప్రజలే ..మన దేశం జెండా రెప రెప లాడుతూ ఉంటే, మనకి ఎంత గర్వం గా ఉంటుంది, ఈ దేశం లో. ఇలాగ దయనీయం గా పని చేసే వారిని కూడా ఈ  జెండా రెపరెపలు లో చూడ గలమా? 
ఎన్నో ఏళ్ళు ఇక్కడ కష్ట పడి వెనక్కి వెళ్ళే వాళ్లకు, ఎయిర్ పోర్ట్ లో ఒక సహాయ ,సమాచార , వ్యవస్థ నెల కోల్పాలి, ఒక హృదయం సరి అయిన స్థానం లో ఉన్న మానవీయ దృక్పథం తో పని చేసే ఒక దేశీయ అధికారు ఒకరు అక్కడ , ఇరవై నాలుగు గంటలు,  సహాయం, సలహా అందించే ఒక ఫోన్ లైన్, ఇలాంటివి వెంటనే అమలు పరిస్తే ఎంత బాగుంటుంది. 
వారికేం ? నాలుగైదు ఇళ్ళలో పని చేసి ,బాగానే సంపాదిస్తున్నారు, అని అనేవారు ఉంటారు. కాని, నాలుగు  డబ్బులు కూడా వెనక్కి వేసు కోరు, చివరికి ఏమి మిగలదు వీరికి. రోగాలు, శక్తి కోల్పోయిన శరీరాలు తప్ప. 
మన  ఏమ్బసి , మనం, మన దేశం రాక   ముందే, అక్కడి అధికారులు- వ్యవస్థలు, అందరూ కూడి, ఆలోచించి, ఏదో కొన్ని మార్గదర్శకాలు రూపొందించాలి. చాప కిందకి తోసేసి, అంత బాగానే ఉందని, కళ్ళు మూసుకుని ఎని రోజులు ఇంకా గడుపుతాం? 
 ఇలాగ ఎయిర్ పోర్ట్ లో ప్రాణాలు, అదీ , గుండె పగిలి ప్రాణాలు  వదిలే  ఇంకా ఎన్ని వినాలి మనం, మనలోని మానవత మెల్కోడానికి?
    
    

13 అక్టో, 2010

మన నూకాలమ్మ దెబ్బ.. గోలి సోడా దెబ్బ చూపిద్దామా?

 మన వీధి చివర కిరాణా కొట్టు తో మనకి ఎంత అనుబంధం ఉంటుందో? రాత్రి పది గంటలకి, కోఫీ  పొడి అయిపోయిందని గుర్తు వస్తే, ఎవరు తెస్తారు?  అమ్మా! పొద్దున్నకే రంగు పెన్సిల్స్ కావాలి అనో, ఇండియా మ్యాప్ అనో, ఏవో సరిగ్గా పడుకునే ముందు గుర్తు రావడం. వీధి చివర , మన కొట్టు ఒక కల్ప వృక్షం లా అని పిస్తుంది. అప్పుడు. ఇప్పుడు అయితే ఫోన్ సదుపాయం కూడా ఉంది, పిల్లల చిన్నప్పుడు, చెప్పుల్లో కాళ్ళు పెట్టి, చీర సవిరించు కుంటూ, ఆ రాత్రి పరుగులు పెట్టడమే. దేవుడు ఇలాగ కూడా కని పిస్తాడు ఈ కలి యుగం లో అను కునేదాన్ని.ఆ కొట్టు అతని ని తలుచుకుని. పిల్లలు స్కూల్ బస్సు దిగి, నేను వెళ్ళడం ఆలస్యం అవుతే ,అక్కడే కూర్చు నేవారు.. అమ్మ కోసం దిక్కులు చూస్తూ. 
అవును వీధి చివర కిరాణా కోట్లు.. మన జీవితం లో భాగం అయి పోయాయి.
మన తో పాటూ, కొట్టు, ఆ కొట్టు స్వంత దారు, పెద్ద వాళ్ళం అయి పోయాం. పిల్లలు ఇప్పుడు కూర్చుంటున్నారు 
మన దేశం లో ఇలాంటి అనుబంధాలు చాల ఉంటాయి, కూరలు ఇంటికి తెచ్చి అమ్మేవారు, ఉదయానే ,తాజాగా ఆకు కూరలు అమ్మే వారు, ఇంకా మా విసాపట్నం   సముద్రం ఒడ్డునే కదా, మత్స్య పుష్పాలు, అవే చేపలు, రొయ్యలు కూడా అమ్ముతారు  వీధిలో కి తీసుకు వచ్చి. చింత చిగురు అమ్మే అమ్మి గొంతులో అయితే, ఎన్ని స్వర విన్యాసాలు ఉంటాయో? సింత సిగురు అమ్మా ,సింత సిగురు.. నండూరి వారి ఎంకి ని గుర్తు చేస్తూ..
ఈ దేశం లో ఉన్నానా? ఆకు కూరలు తాజా గా కొనుక్కోవడం ఎంత మిస్ అవుతానో? మన దేశం, పేద దేశమని, ఏవో రాక రకాల పేర్లు పెట్టారు, కాని ఇంత సజీవ మైన , జనం తో నిండిన , ప్రేమ నిండిన దేశం నాకు ఇంకొకటి కనిపించలేదు.
మన దేశం స్పెషాలిటి బడ్డి కోట్లు. వీధి కి ఒకటో రెండో బడ్డి కోట్లు ఉండాల్సిందే.మగ పిల్లలు కి ఇంకా బాగా తెలుస్తుంది, అమ్మాయిలు కోసం , ఏదో ఒంకన కాపు కాయడం ఇప్పుడు కాదు లెండి, ఇప్పుడు మెసేజెస్ - సెల్ ఫోన్ ల కాలం, మా కాలం లో.. అన్నీ రకాల పత్రికలూ, ఆ రోజు వార్తా పత్రికలూ, ఓ దండ గుచ్చి, వేలాడేసి, రా రమ్మని స్వాగతం పలుకుతూ,  ఓ పక్కన నిండుగా అరటి గెల, రంగు రంగుల సీసాల్లో నోరూరించే చోకాలేట్లు ,నోరు జివ్వమన్పించి  , కమ్మని రుచి తో పిప్పెర్ మెంట్ బిళ్ళలు, చక చక మని కిళ్ళీ లు కట్టే చేతులు, ఒక్క సిగేరెట్టే కొనుక్కుని, హస్కు కొట్టే పని లేని  మగ రాయుళ్ళు, తల నొప్పి కి  సారిడొన్ బిళ్ళల నుంచి, జ్వరం మందు వరకు, అత్యవ సారానికి,  క్షేమం గా ఉన్నావా? అని రాసి పక్కనే డబ్బాలో పడేసేందుకు, పోస్ట్ కార్డులు, ఇంకా పెద్ద విషయాలు రాయడానికి ఇన్లాండ్ కవర్లు, వీధి రాజకీయాలు నుంచి దేశ రాజకీయాలు వరకు నలిగే తాజా , వేడి, వేడి, కబుర్ల విందు, అప్పుడప్పుడు, ఇంటాయన ని ఇంటికి పంపించి, రూపాయి కాసంత బొట్టు, ముక్కు కి మక్కేర, ఓ కాలి కి అర వీసెడు వెండి కడియం ,గళ్ళ చీర కట్టుకుని, మా విసాపట్నం నూకాలమ్మో , సింహాచలమో, గల్లా పెట్టి దగ్గర   కూర్చుందంటే, ఇంకా చూడ డానికి రెండు కళ్ళు చాలవు, రావి శాస్త్రి కథ ని తెచ్చి కూర్చో బెట్టినట్టే.
ఆహా మన దేశం, మన ఊరు ఎంత గొప్పవో కదా? 
 ఇప్పుడు, అమెరికా లాంటి గొప్ప దేశాలు కి సమానం గా మనకి వచ్చేసాయి మాల్స్. విశాలం గా, శుభ్రం గా, రంగు రంగుల అద్దాలు, మెరుపులతో అన్నీ రకాల షాప్స్ అంటే, కూరగాయలు, టీవీలు, బట్టలు, బంగారం, కార్లు, సినిమాలు, హోటల్స్, అన్నీ ఒక్క చోటే ఉంటున్నాయి.
లోపలి వెళితే కనీసం ఒక్క వెయ్యి రూపాయలు అయినా ఖర్చు, మన ప్రమేయం లేకుండా ఆ జిలుగు జిలుగు వ్యామోహం లో పడి పోతాం. 
ఊరికినే కూడా ఏమి కొనకుండా ,కాళ్ళు నొప్పి పుట్టేవరకు తిరగ వచ్చు కాని, చాల స్థిత ప్రజ్ఞత , చాల పర్సు కంట్రోల్ కావాలి, అది ఇప్పుడే రాదు మనకి, నాకు.
ఒక కేజీ పప్పు కోసమో, ఒక అర డజను అరటి పళ్ళ కోసమో, మనం ఈ మాల్స్ కి పరుగులు పెట్టం. మన వీధి చివర ఒక కిరాణా కొట్టు, ఒక బడ్డి కొట్టు లేని రోజు ఊహించుకోండి. ఎంత కళారహితం గా బోసి పోయి ఉంటాయి, మన వీధులు, మన ఊర్లు.
అందుకే, మన వీధి కొట్లు అని చిన్న చూపు చూడకండి, సజీవ మైన మన వీధులు, మన ఊర్లు ని ఎవరో బయట అమ్బానిలో, వాల్ మార్ట్ వాళ్ళో, వచ్చి, దర్జా గా ,ప్రభుత్వం సాయం తో కబ్జా చేస్తూంటే ,చూస్తూ ఊరుకుంటామా? మన నూకాలమ్మ దెబ్బ.. గోలి సోడా దెబ్బ చూపిద్దామా?  





12 అక్టో, 2010

మహా వ్యాపార మార్కెట్ దేశమా ? భారత్ దేశమా?? మజాకా నా??

కొత్త మోడల్ అడిడాస్, అయిదారు వేలు, ఉంటాయి అవీ, నాకు లేదు అని బాధ పడుతూంటే, కాళ్ళే లేని ఓ యువకుడు కన్పించాడు నాకు.. ఈ మెయిల్ ఇప్పుడు నడుస్తోంది, అందరు చదివే ఉంటారు. మెయిల్ చదివేసాం కదా, హమ్మయ్య ఇప్పుడు మళ్లీ,  కొత్త షూస్ గురించి ఆలోచించ వచ్చు. నాకు ఉన్నాయి కదా మరి, కాళ్ళు, కలలు.. 
కొత్త గా వచ్చినా ఒక సినిమా.. దో గుణ చార్ అనే సినిమా కథ చదివాను, నెట్ లో. ఒక కారు కొను క్కోవడానికి, ఒక మధ్య తరగతి ,కుటుంబ పెద్ద, పడే కష్టాలు ఉనాయి ట. అందులో. ఏదైనా కొనుక్కోడానికి ఇప్పుడు పోటి పడి బ్యాంకు లు అప్పులు ఇచ్చేస్తున్నారు .మన భారత దేశం అంతా ఒక పెద్ద బజారు లాగా కనపడు తోంది ట, అన్నీ దేశాలకి. 
విత్తనాలు కొనుక్కుంటాం అంటే బ్యాంక్లు  పాపం ఆలోచిస్తారు, ఈ బీద రైతు ఎలా తీరుస్తాడు, నా అప్పు, అని ,కాని అదే ఉద్యోగం, వ్యాపారం చేసుకునే తెల్ల కాలర్ ,వారు, అంటే మట్టి అంటని, కుర్చీ లో కూర్చుని ,ఉద్యోగాలు, చేసి, నెల ,నెల, జీతం తీసుకునే వారికి, పోటి పడి మరి అప్పులిస్తారు.
మూడో కారు ,రెండో ఫ్రిడ్జే, కొత్త , టీవీ అతి పెద్దది, అంటే గోడంత , సినిమా ఇంట్లో నే చూసేంతది వీటికి అయితే, సంతకం పెట్టి, క్రెడిట్ కార్డు చూపిస్తే చాలు ,అర గంట లో ఇంటికి వచ్చేస్తుంది. 
శర వేగం గా మారి పోతున్న ఈ టేక్నోలోజి  తో మనం పోటి పడాలి అంటే, ఇంట్లో సామాన్లు బయటకి నడవాల్సిందే, కొత్తవి రావాల్సిందే. 
ఇలాగ మూడో దో, నాలుగోదో కొనుక్కున్తునా ,మనం మొట్ట మొదటిసారి కొన్న టీవీ, కారు ,ఫ్రిడ్జే వాటి ఆనందమే వేరు.
అప్పు చేసి కొన్న మొదటి కలర్ టీవీ ఇంటికి వచ్చిన   రోజు పొందిన ఆనందం, వాయిదా పధ్ధతి లో కొన్న ఆల్విన్ ఫ్రిడ్జే, దాన్లో చేసిన మొదటి ఐస్ క్రీమ్ రుచి, ఆఖరి వాయిదా కట్టేసినప్పుడు కలిగిన యాహూ అని అరవాలి అనేంత గొప్ప గర్వం తో కూడిన వెలుగులు,  మొదటి సారి కారు కొని, దేవుడి గుడి దగ్గర  కొబ్బరి కాయ కొట్టి, ఇంట్లో కుటుంబ సభ్యులతో , వీధి లో ఝామ్మని  పరుగులు తీయడం లో కలిగిన గొప్ప ఆనందం, అలాగే, ఒక స్కూటర్ కొన్నా, మొదటి వాహనం ఎంత  తృప్తి నిస్తాయో, ఇదే కారు, నాలుగేళ్ళు వాడేసి, అమ్మేసి, రెండో కారు కొన్నప్పుడు, అది ఒక మామూలు రోజు, అన్నీ రోజు ల లాగే.. కొత్త వస్తువులు కొనడం లో ఏదో మజా ఉంటుంది. 
కలలు కని, కూడబెట్టి డబ్బులు, పది రకాల షాపులు, మోడల్స్ చూసి, చర్చించి ఇంట్లో వారితో, ఆఫీసు లో, ఆఖరికి ఒక రోజు తెగించి, మనమే దో షాప్ కోనేస్తున్నంత భావంతో, దర్జా గా ,అడుగు పెట్టి, సేల్స్ మాన్ ని , ముప్పై రకాల ప్రశ్నలతో వేధించి, గారంటీ, వారంటీ అంటూ, పరిజ్ఞానం ప్రదర్శించి, కూడా బెట్టిన డబ్బు అంతా, షాప్ వారికి సమర్పించి,  భార్య మొహం లోకి ఒక సారి గర్వం గా చూసి, పది జాగ్రత్తలు చెప్పి, రిక్షా వాడికి, ఆ వస్తువు ఇంట్లో కి చేరే సరికి, పిల్లల కేరింతలతో.. భార్య చేసిన స్వీట్ తో, ఆ రోజే రోజు  , ఆ ఆనందమే ఆనందం  . ఆ తృప్తే తృప్తి.
ఇదే ఆనందం మళ్లీ, రెండోదో, మూడోదో, కొన్న రోజు చచ్చినా రాదు. మొదటి సారి కొన్న ఈ మధుర ఘడియలు, ఇలాగ జ్ఞాపకం గా మిగిలి పోతాయి.
త్రీ డి టీవీ ట , మొహాలు కనిపించే కొత్త సెల్ ఫోన్ ట..రెండు తలుపులు ఉండి, నేను పట్టేంత పెద్ద ఫ్రిడ్జే ట.. చాలా ఉన్నాయి నా లిస్టు లో..
మన దేశం , సూపర్ పవర్ కావాలంటే, నేను ఉడతా భక్తి గా ఏదో చేయాలి కదా మరి. 
బియ్యాలు, కూరలు పండిస్తేనేం, పండించ లేక పోతేనేం, మన సూపర్ మార్కెట్లు, అమెరికా ఆపిల్ ళ్ళు , ఆస్ట్రేలియా లిచి పళ్ళు అమ్ముతారు, అవీ తిని బతికేద్దాం.. 
మహా వ్యాపార మార్కెట్ దేశమా ? భారత్ దేశమా?? మజాకా నా???

11 అక్టో, 2010

వంద కోట్ల భారత్ లో, ఒలీమ్పిక్ బంగారు పతకం ఒక్కరు సంపాదించలేరా ?

ప్రతిభా పాటవాలు ఏ ఒక్కరి సోత్తో కాదు అని  కామన్ వెల్త్ ఆటలు లో దీపిక , డోన మొదలైన ఆట గాళ్ళు నిరూపిస్తున్నారు. వంద కోట్ల భారత్ లో, ఒలీమ్పిక్ బంగారు పతకం ఒక్కరు సంపాదించలేరా ? అంటూ టీవీ లు చూస్తూ, చిప్స్ తింటూ, సోఫా లో కూర్చుని నిట్టురుస్తాం. ప్రభుత్వం ఆటలకు సముచిత స్థానం కల్పించడం లో ఘోరం గా విఫల మయింది. 
ఒక స్కూల్ అంటే, తరగతి గదులు, చుట్టూ విశాల మైన ఆవరణ ,ఆటలకి, పరుగులకి, నాలుగు గోడల తరగతి గది నుంచి బయటకి వచ్చి ఊపిరి పిల్చు కోడానికి, ఒక మైదానం.. కాని, ఇప్పుడు స్కూల్స్ ని చూస్తే కడుపులోంచి దుఖం వస్తుంది. నాలుగు అంతస్తుల అద్దె భవనం, రోజు కి  పదహారు గంటలు చదివిందే చదివి, బట్టి పట్టడం, కళ్ళ ఎదుట నాలుగు గోడలు, చుట్టూ గోడలు, ఊపిరి ఆడని ఈ బడులలో, నీరసం గా వాలి పోయి బయటకు వస్తారు.
ఏ ఆట అయిన టీవీ స్క్రీన్ మీదే ఆడ గలరు, శరీరం కదపకుండా.
విద్య రంగం పూర్తి గా ప్రైవేటు పరం చేసి, పిల్లలకి  ఒక ఎంజేనీరింగ్ లేదా మెడికల్ అంటూ ఒక పరుగు పందెం పెడు తోంది. మనం చూస్తూ ,ఏమి చేయాలో తెలియక , చేతులు కట్టుకుని కూర్చున్నాం.
బాగా ఉన్నతం గా ,జీవితం లో నిలదొక్క కోవాలని, మనం మన పిల్లలని, బాగా చదివిస్తాం. ఆటలు జీవితానికి స్థిరపడ డానికి సరి పోవు కదా? అని మన దృక్పధం.
కాని, నిండైన మన అసలు జీవిత, భారతీయ విలువలు, ఇంకా పల్లె లలో బతికి ఉన్నాయి. ఈ కుస్తీ లు, విల్లు ఎక్కి పట్టి , గురి కి సంధించడం, అవలీల గా ఏభై కేజీలు బరువు ఎత్తడం , చదరంగం ఎత్తులు వేయడం, బలం గా , జీవం తో నిండిన శరీర ఆకృతులు,  తినడానికి లేక పోయినా, మొక్క పోనీ దీక్షతో, వారికి వారే, ఆకాశమే హద్దు అనుకుంటూ, భారత దేశం ముద్దు బిడ్డలం మనమే అని వారే గుర్తు ఎరిగి, ఈ ప్రభుత్వాలు, కళ్ళు మూసుకుని కూర్చుంటే, వారు ఇంటా బయట, గుర్తింపు తెస్తున్నారు.   ఢిల్లీ లో బంగారు పతకాలు     పండిస్తున్నారు.  మన దేశం పరువు నిలు పుతున్నారు.
టీవీ లో చూసాను, తల్లి, నర్సు ఉద్యోగం, తండ్రి ఆటో డ్రైవర్, దీపిక విలు విద్య లో రెండు బంగారు పతకాలు పొందింది. ఆనందం   తో ఒళ్ళు పులకరించింది...దీపావళి మాకు ముందే వచ్చింది అని ఆ తండ్రి, పండుగ చేసుకుంటున్నాడు. మనం అందరం కూడా ఆ  సంతోషం లో పాలు పంచుకుని వారికి మన అబినందనలు  తెలియ పరుద్దాం.
ఇప్పటి కైనా ప్రభుత్వం మేలుకుని, ఆటలు, వ్యాయామం, మన దేశి క్రీడలు, యోగ వంటి విద్యలు చదువు లో భాగం గా చేర్చాలి.
కొమ్పుటర్ లో ఆటలు ఆడడం కాదు, నిజమైన మైదానం లో పిల్లలు పరుగులు తీయాలి, క్రికెట్ ఒక్కటే ఆట కాదు, ఇంకా చాల ఆటలు కూడా ఉన్నాయి అని పిల్లలికి తెలియాలి.
వచ్చే ఒల్య్మ్పిక్స్ కని ఇప్పుడే ప్రారంభించాలి ప్రయత్నాలు.. 
వంద కోట్ల మంది లో, కొందరైనా మన ఆశలు నెరవేరుస్తారు, ప్రభుత్వం, సాయం అని ఎదురు  చూడకుండా , ఎవరి ప్రయత్నాల్లో వారుండే దీపికలు, డోన లు, మనకి ఉండనే ఉన్నారు.
రండి, చప్పట్లు కొట్టి, వారికి ఉత్సాహం నిద్దాం, ఇంక ఏమైనా చేయగలమా? మనం అని ఆలోచిద్దాం. నిండైన కండ కలిగిన జాతి , మన జాతి అని గర్వ పడే రోజు కోసం ఎదురు  చూద్దాం.