"http://www.jalleda.com/images/jalleda3d48x32.png">

30 అక్టో, 2011

పుస్తకం.

పుస్తకం పై అట్ట..ఒక ఆకర్షణ,
అందులో దాగున్నపాత్రలు మరో ఆకర్షణ..


కొత్త పుస్తకం పుటలనించి వచ్చే కమ్మని ,
కమనీయం, హాయినిచ్చే పరిమళం..

హృదయానికి హత్తుకుని,మొదటి పుట లో, తెల్లగా
నాకే అంకితం ఈ పుటఅని,స్పష్టం గా పేరు
రాసుకుని, మురిసి పోయే క్షణమే క్షణం. ఆ క్షణమే
జీవితాన్నే మార్చవచ్చు,అతడు -ఆమె పుస్తకం
లో పుటలు,నా జీవితాన్నిఎలా మార్చాయి? ప్రతి
నిముషం నే శాంత నే నా ?కాదా? అంత శాంత మూర్తి
ని కాగలనా ఎప్పటికయనా?అంత నిబద్ధత ఉందా నా లో?
అని అతలా కుతలం అయిపోయేనే,
పుస్తకం ..అంత తీవ్రమైన ప్రభావం


ఒక జీవితం నే మార్చి వేస్తుంది.
ఒక శ్రీ శ్రీ, ఒక కొ కు.ఒక చలం .
ఒక బుచ్చి బాబు, ఒక రావి శాస్త్రి ,
నాలో ఒక భాగమే కదా ఇప్పుడు.


పుస్తకం లో పాత్రలు, కథ ..వందో,రెండు వందల పుటల లో, ఓకొలిక్కి వస్తాయి, కానీ, ఆ పాత్రల అంతరంగం 
నన్ను జీవితాంతం వెంటాడుతాయి,వేధిస్తాయి?
నీ పాత్ర ఏమిటి అసలు అని నిల దీస్తాయి ..బుచ్చిబాబు  చివరికి మిగిలేది లోఅమృతం, కుముదం ..
చలం రాజేశ్వరి, లాలస ,
అతడు -ఆమె లో శాంత,
శుభ, శాంత ని ప్రేమించిన
శాస్త్రి , శాంత ప్రేమించే
శాస్త్రి అయాడ? జీవితం
అంతా ప్రేమ ..బంధాలేనా?
గోర్కి లో అమ్మా వి కాలేవా?
ఎప్పటికి? నువ్వు ఒక్క
బిందువేనా ? నువ్వు
చైతన్య స్రవంతి వి కావా?
నీ చుట్టూ గోడలు ,
నీ చుట్టూ నీడలు..


పుస్తకం చదివి ..
తిరిగి, దానిని తన
బీరువా లో అందమైన
అద్దం తలుపుల వెనక
బంధించాను,కానీ,
నా తలపుల్లో , ఇంకా
తిరుగుతూనే ఉన్నాయి
ఆ పాత్రలు..ఆ ప్రశ్నలు..


ఆదివారం ఆబిడ్స్ వీధుల్లో
ఇంకొక పాత పుస్తకం ,
ఆ గంధమే వేరు, పాత
పుస్తకాల నించి వచ్చే
ఆ శిధిల ,చేతులు మారిన
చమట వాసనల ,నిక్షిప్తం
చేసుకున్న ఆ పుస్తకం
నేను వెతుకుతున్న పెన్నిధి.


ఎక్కడా దొరకదేమో, నేను
ఎప్పటికి చదవలేనేమో అని,
బెంగ పెట్టుకుని, పుస్తకం కల
కంటున్న నాకు ప్రత్యక్షం
అయిన క్షణం లో, వాడు
అడిగిన వంద రూపాయలు
కి ఇంకో వంద కలిపి ఇవ్వాలని,
నువ్వే నా స్నేహితుడివి ,ఈ రోజు
నించి అని చేయి కలపాలని
వెర్రి ఆవేశం..ఫరవాలేదు, నాలో
ఇంకా నా చిన్నతనం బతికే
ఉంది, అని మురిసిన క్షణం.


పుస్తకం నీ నేస్తం,
పుస్తకం నీ పధం,
పుస్తకం నీ ఊపిరి,
పుస్తకం నీ ఉనికి..


ఇన్ని కూడ బెట్టిన
అటూ, ఇటూ విసిరేసిన
అక్షరాల మూట కాదు
పుస్తకం , ఒక వ్యక్తి
లోపల వ్యక్తీకరణ ,ఒక
ఆలోచనల ప్రవాహం..
ఒక వ్యక్తి అంతరంగం
నీకోసం విప్పి చెప్పిన
ఆ రచయిత ,నీ హితుడు,
నిన్ను ,తన ఊహలతో
కదిలించి , నీకు బంధువు,
నీ జీవితాంతం ,నీకు తోడూ.


పుస్తకం ఒంటరి రాత్రి కి
చక్కని సహచరుడు,
వర్షం సాయంత్రానికి ,
కబుర్లు వినిపించే మిత్రుడు.


ఎప్పుడో గత కాలం లో
ఎప్పుడో  రాసిన నవల
చదువుతూ, నిన్ను నువ్వు
మర్చిపోతావు ఆ క్షణాన


స్వర్గ సుఖం కూడా కాలి
తో తన్నేయొచ్చు, అనుకుంటాడు
ఆ రచయిత, నా పుస్తకం చదివి
నన్ను అమరుడి ని చేసావు
అని ప్రణమిల్లుతాడు పుస్తకం
అమరం, ఆ రచయిత అమరుడు
పుస్తకం అందం గా చేతికి
భూషణం గా అమరితే
ఎంత అందం..ఈ పుస్తకాలు ట.
చదివి వినిపించే పుస్తకాలూ ట.
ఇంక అట్ట లేదూ, లోపల పుటలు
లేవు అంతా అంతర్జాలం లోనేట.


అమ్మో, పుస్తకం లేని రోజు,
పుస్తకం లేని ఇల్లు, పుస్తకాలు
లేని గ్రంధాలయం, పుస్తకాలు
చదువుతూ, హాయిగా నిద్ర
లోకి జారిపోయే రోజులు,
ఇవేమీ లేని, ప్రపంచం నాకు వద్దు..
వద్దే వద్దు. పుస్తకం లేని పొద్దు.
నా జీవితానికి సూర్యుడు లేని పొద్దు.

పుస్తకం కే నా ఓటు,
పుస్తకం లో చదువు కే నా హక్కు,
పుస్తకం లోంచి వినిపించే కథే
నా పిల్లలకి ఇప్పటికీ ముద్దు.


పుస్తకం ,పుస్తకం ,పుస్తకం
అంటూ అరిచి కేకలు వేసే
రోజు ఒకటి వస్తుందని, అది
మాయం అయే రోజు వస్తుందని..


ఏనాడూ కల కనలేదు,
ఈ పీడ కల కి అంతం
మెలకువ తెచ్చుకుని,
పుస్తకం చేతి లో పట్టుకునే

ఉండండి, పుస్తకం విడవము
అని చెప్పండి..పుస్తకం
మాకు ప్రాణం అని చెప్పండి,
పుస్తక ప్రియులూ ఏకం కండి.






























27 అక్టో, 2011

ఎన్నారై.

ఇద్దరు పిల్లలు శృతి ,లయ ల తో ఆరు సూట్ కేసులు మూడు చేతి ్సంచులు  పట్టుకుని, అమెరికా నించి చచ్చి చడి, ముప్ఫై ఆరు గంటలు ప్రయాణం చేసి, రాజీవ్ గాంధి విమానాశ్రయం లో దిగాను . నేను  బయలు దేరి వెళ్లి నప్పుడు ,బేగంపేట విమానాశ్రయమే..ఊరు మధ్యలో ఉండేది,ఇప్పుడు ఓ ఇరవై మైళ్ళ దూరం లో ఉంది.


అయినా ,తను వెళ్లల్సినది విశాఖ పట్నం కి, హమ్మయ్య పక్కనే ఉందిలే జాతీయ విమానాశ్రయం అని సంతోషిస్తూ, అయినా ఎన్ని ఏళ్ళు ఇంకా ఎదురు చూడాలో ,మా విశాఖ పట్నం అంతర్జాతీయ విమానాశ్రయం అవడానికి, నేను ఆరేళ్ళు కింద అమెరికా వెళ్ళేటప్పుడు ఎవరో ,రాజకీయ వేత్త , నా ప్రధమ కర్తవ్యం ,మీకు అంతర్జాతీయ విమానాశ్రయం సదుపాయం కల్పించడమే, అప్పటి వరకూ ,నేను నిద్ర పోను..అని ప్రతిజ్ఞా చేసినట్టు గుర్తు, పాపం, కళ్ళు కాయలు కాసాయో, ఏమిటో? ఇన్ని రోజులు నిద్ర పోకపోతే ఏమవుతుందో?


ఎన్ని లాప్ టాప్ లు? ఇవేంటి? అంటూ ప్రశ్నించే అధికారుల అవక తవక ప్రశ్నలని తప్పించుకుని, బయట పడి, సామాన్ల  బండి తోసుకుంటూ, పిల్ల శాల్తీలు ఉన్నారా ? లేదా? అని మధ్య మధ్య లో, చూసుకుంటూ, మజిలి లో మూడో ,విమానం ఎక్కి, మొత్తానికి నా  కెంతో ఇష్టమైన విశాఖ చేరుకున్నాను .


హమ్మయ్య ..ఇల్లు చేరాను ..ఇంక అమ్మ దగ్గర హాయిగా తన కిష్టమైన కందిపొడి, ముక్కల పులుసు, కొత్త ఆవకాయ లో  నెయ్యి పోసుకుని,వేడి వేడి అన్నం, గుత్తి వంకాయ కూర..ఊ  ..నోరు ఊరుతోంది.


అక్కడ మా ఊర్లోనూ దొరుకుతాయి, కాని, ఏమిటో ఇంత రుచి ఉండవు.


అమ్మా..అమ్ముమ్మా ..అంటూ నేను, పిల్లలు చుట్టేసాం. నాన్న గారు ,సామాన్లు సర్దించడం, మా గది లో అన్ని సరిగ్గా ఉన్నాయా లేదా అని చూస్తున్నారు. అయినా ,మా ఇల్లే కదా.నాకేమైన కొత్తా ఈ ఇల్లు?

అనుకుంటూ ఒకసారి గబగబా తిరిగేసింది, ఏమేమి మార్పులు వచ్చాయా అని చూసుకుంది. ఇల్లు కొంచం బాగుపడినట్టే ఉంది.

అన్నయ్య ఆ మధ్య వచ్చి  ఏవో మార్పులు ,చేర్పు లు చేయించాడుట. తను దేశ రాజధాని ధిల్లీ లో ఉంటాడు.


నేను ఉండేది రెండు నెలలు, కలవడం అవుతుందో అవదో అన్నయ్య ని, ఈ రోజే చెప్పాలి, ఒకసారి రా ,విశాఖ పట్నం..అందరూ కలవొచ్చు అని.

హమ్మ్..పుట్టిన దేశం .పుట్టిన ఊరు అంటారు ..అందుకే.


పెట్టెలు తెరిచి, అమ్మ ,నాన్న లకి, పిన్ని వాళ్లకి ,వాళ్ళ పిల్లలికి అందరికి తెచ్చిన చిన్న ,చిన్న కానుకలు, పంచేసాను .


అదేమిటో, ఒక్కరికి పెద్ద గా నచ్చలేదు, అన్నీ ,ఇప్పుడు ఇక్కడే దొరుకుతున్నాయి అక్కా..అని చెప్పేసేరు..పిన్ని పిల్లలు, జ్యోతి, జగన్. ఉస్సూరుమనిపించింది ..


ఈ కానుకలు కొనడానికి, సేల్ పెట్టిన మాల్స్ అన్ని పగలు రాత్రి ఎలా తిరిగానో  గుర్తు వచ్చి.


స్నేహితులు అందరూ, ఎక్కడెక్కడో ఉన్నారు, పిల్లలని తిప్పడానికి జ్యోతి, జగన్ ఉన్నారు కాబట్టి సరిపోయింది. లేక పోతే బోర్ అమ్మా..అని పాట మొదలు పెడతారు.


శనివారం ,ఓ రోజు అందరం కలిసి తినేద్దాం..అని అనుకుని, పిన్ని వాళ్ళ కుటుంబం, మేమూ బయలు దేరాం..


దసపల్ల లోనో, డాల్ఫిన్ లోనో, మసాల దోసె తినాలని నాలుక పీకింది, అమ్మో కాలరీలు అను కున్నా సరే, ఆ రుచే వేరు.


అబ్బే,దోశ..మేం రాం, పిజ్జా హాట్ కి వెళదాం అన్నారు, పెద్ద పిల్లలు, ఇంక శృతి లయ ఊరుకుంటారా? వాళ్లకి అలవాటు అయిన ప్రాణం..,అమ్మా వాళ్ళు కూడా సరే లేమ్మనారు.


నాకు ఆశ్చర్యం ..వేసింది, నేను ఈ దేశం వదిలి వెళ్లి ఆరేళ్ళు అయింది.ఇంతలో ఇన్ని మార్పులా?


జగన్ పుట్టిన రోజు పండుగ, పద్నాలుగో పుట్టిన రోజు, ఇంకా తరువాత మనం ఏమి చెయ్యం కదా అని, కొంచం భారీ గానే ఏర్పాట్లు చేసారు, పిన్ని, బాబాయి.


శృతి, లయ ,చిన్న పిల్లలు, నాలుగు, మూడేళ్ళు అప్పుడు  ప్రభాకర్ కి అమెరికా ఉద్యోగం రావడం తో వెళ్లి పోయాను  ఒక్కర్తినీ  పిల్లలతో ఎన్ని అవస్థలు పడ్డానో  నాకే తెలుసు.


అమెరికా కలల ని సాకారం చేసే దేశం అంటారు కాని, దాని వెనక ఎంత కష్టం ఉంటుందో, ఇక్కడ మన దేశం లో ఉన్నవారికి తెలీదు.

ప్రభాకర్ కి ఉద్యోగాలు  పోయాయి, మళ్లీ వచ్చాయి. తూర్పు తీరం వదలి పశ్చిమం , ఐ టి కి కేంద్రం కదా అక్కడికి వచ్చేము ..ఈ ఉద్యోగాల అనిశ్చిత లో, నాకింక ఇంక ఇటు వచ్చే ఆలోచనే చేయ లేక పోయాను . 


ఇప్పుడు, ఇన్నాళ్ళకి, పిల్లలి కి తొమ్మిది ,పది ఏళ్ళు వచ్చాక వచ్చాను, వాళ్ళకి  అయితే ఊహ తెలిసాక ఇదే మొదటి సారి అవుతుంది.


తెలుగు బాగానే మాట్లాడుతారు, మేం ఇంట్లో అదే మాట్లాడుతాం కదా,పిల్లలు కి అలవాటే అయింది. నేను, నా పిల్లలకి సంగీతం ,నృత్యం కూడా నేర్పుస్తున్నాను, బాల వికాస్ తరగతులకి వెళతారు ,ఆదివారాలు ప్రభాకర్ తో, శ్లోకాలు అన్నీ చక్కగా చెపుతారు.


జ్యోతి, జగన్, నోరు వెళ్ళ బెట్టారు, మాకు రావు అక్కా అంటూ.


సాయంత్రం పుట్టిన  రోజు పండుగ పార్టీ, ఇంట్లోనే, విశాలం గా ఉన్న ఇంటి ముందు ఏర్పాటు చేసారు. ఏమైనా సాయం చేయనా అంటే, ఎందుకమ్మా ? అన్నీ కేటరింగ్ కి చెప్పేం అనేసారు.


మేం ,అక్కడ మా ఊర్లో ఎంత కష్ట పడుతామో గుర్తు వచ్చింది.వారం రోజుల ముందు నుంచి వంటలు, పిండివంటలు తయారు చేస్తాం. స్నేహితులు, ముఖ్యమయిన ,వాళ్ళు వచ్చి తలో చెయ్యి వేసి  సాయం  చేస్తారు.


పిల్లలు కూడా సంబర పడిపోయారు, పార్టీ అంటే.. ఎవరో, ఇండియా వెళ్ళుతూంటే తెప్పించి, కుట్టించిన పట్టు పరికిణీలు, వాటికీ కుదిరే  చిన్న నగలు, గాజులు, తల లోకి, క్లిప్ లతో సహా అన్ని పెట్టె నించి తీసి,సాయంత్రానికి  అలంకరించుకున్నారు.
నేను కూడా, నా పట్టు చీర, కట్టుకున్నాను, నా ద్రిష్టే తగిలే లాగ ఉంది ,నా పిల్లలకి అనుకుంటూ బయలు దేరి వెళ్ళాం,ఆటో లో.
లయ కి ఎంత నచ్చిందో ఆటో, భలే ఉంది కదా అమ్మ..గాలి వచ్చేస్తోంది   , అని చాలా సంతోషించింది.
శృతి, కి రోడ్ మీదే గేదెలు, ఆవులు అడ్డం గా నిల్చోవడం ఆశ్చర్యం కలిగించింది. ఇద్దరికీ చాల నచ్చింది..విశాఖ పట్నం, ఇండియా..
తను ఎన్నో కబుర్లు, కథలు చెపుతూ ,మన దేశం గురించి పిల్లల్ని ఊహల లో దగ్గర చేసింది..మాధురి ..నిట్టూర్చింది.
డాలర్లు కోసం వెళ్ళేరు కాని, మన దేశం లో ఉన్న అనుభూతి, కొండంత అండ ఎక్కడ ఉంటుంది ఆ దేశం లో?
చల్లని సాయంత్రం..అయినా విశాఖ లో ఉక్క..తెల్సిందే కదా..అయ్యో పట్టు చీర కట్టుకున్నానే ,పిల్లలకి ఇబ్బందే అనుకుంది. కాని, ఏదో సరదా ..
పిల్లలందరూ చేరేరు, హడావిడి గా కేక్ కోయడం, ఆటలు ,పాటలు తో హడావిడి గా ఉంది, ఏవో ఇంగ్లీష్ పాటలు వస్తున్నాయి, ఏమిటో ఎంత మారిపోయింది మన దేశం? అనుకుంది.
పిన్ని వచ్చి, మాధురి ,ఎంత చక్కగా ఉన్నారే నీ పిల్లలు, బాగా పెంచేవు అమ్మా అని అభినందించే సరికి, సంగీతం కూడా నేర్చు కున్నారు అని ,ఒక రకమైన గర్వం తో అనేసరికి..
పిన్ని,పిల్లలూ ఒక్క నిముషం గోల ఆపండి, శృతి ,లయ పాట పాడుతారు ఇప్పుడు అనేసరికి, సద్దు మణిగింది.
ఆ ఇంగ్లీష్ పాటలు ఆపండి, అంటే, ఆగాయి.
నా పిల్లలు, నా వేపు ఒక్కసారి చూసి, నేను పాడండి అనగానే..ఇద్దరూ మఠం వేసుకుని కూర్చుని, తాళం వేస్తూ..
వర వీణా మృదు పాణి, అని వర్ణం, కృష్ణ నీ బేల..అని ఇంకో పాట పడేసరికి చప్పట్లు తో మరు మోగింది. చక్కగా కలిసాయి ఇద్దరి గొంతులు.
నాకు ఎంత గొప్పగా అని పించిందో, మిగిలిన పిల్లలు కూడా మేమూ పాడుతాం అంటూ, సినిమా పాటలు పాడారు..ఏమిటో, నేను మన సంస్కృతి ,మా పిల్లలు ఎక్కడ మరిచి పోతారో అని, మైళ్ళు, మైళ్ళు, ప్రయాణం చేసి, పిల్లలిని అక్కడ దింపి, మళ్లీ నా పనులు చూసుకుని ,వాళ్ళని తీసుకు వచ్చి, ఎంత కష్ట పడి, ఈ సంగీతం అవి, నేర్పిస్తున్నాను. ఏమిటో మరి ఇక్కడ పిల్లలు ఎవరూ నేర్చు కుంటున్నట్టు లేరే..
శృతి, లయ ఇద్దరే పరికిణి లలో బుట్ట బొమ్మల్లాగా ఉన్నారు, మిగిలిన పిల్లలు, ఆడ పిల్లలు, పాంట్లు అవీ టైట్ వి, పైన ఓ షర్టు వేసుకుని, అచ్చం మా అమెరిక పిల్లల్లాగా ఉన్నారు.
మాధురి కి నిజం గా ఏమి తోచటం లేదు, ఇక్కడ..స్నేహితులు అందరూ దూరం గా ఉన్నారు. అమ్మా ఏమిటో, మాట్లాడటమే లేదు, ఎంత సేపూ  సీరియల్స్ అంటుంది, వాళ్ళు ఎవరో ఇంట్లో మనుషుల్లాగా మాట్లాడుతుంది.
నిన్నటికి నిన్న వర లక్ష్మి వ్రతం.., నేను, ఎక్కడో, ఏడు సముద్రాల అవతల, నాలుగు చోట్ల తిరిగి, మైళ్ళు కి మైళ్ళు కార్ లో పడి తిరిగి సంపాదిస్తాను, పూజ సామాగ్రి.
లాప్ టాప్ ముందు పట్టుకుని, మరీ పూజ చేస్తాం మేం అక్కడ. ఉద్యోగాలు చేసుకునేవాళ్ళు అయితే సెలవు పెట్టి మరీ చేస్తారు ఇలాంటి పండగలు. అమ్మ,మా చిన్నప్పుడు ,ఎంత బాగా చేసేదో, నాకు గుర్తుంది. మా పిల్లలు కి ఈ  సంప్రదాయాలు ,నేర్పించాలని నా తాపత్రయం.
మొన్న లక్షిమ్వారం  ,అమ్మ తాపిగా సేరియల్స్ చూస్తూ కూర్చుంది, అమ్మా..రేపు పూజ కదా, అంటే ఒక్క ఫోన్ చేసింది, అన్ని సరుకులు వచ్చి పడ్డాయి, పూలు తెండి, అని నాన్నగారికి ఒక పురమాయింపు.
వంటలు ఏం చేద్దాం? అని నేను ఉత్సాహ పడుతూంటే, అబ్బా ,ఇప్పుడు ఆ కష్టాలు ఏం పడక్కర లేదు అమ్మాయ్..అని ఏమండి, ఆ బెజవాడ హోం ఫూడ్స్ వాడికి ఫోన్ చేయండి, మీ పేరు చెబితే ఇంటికే పంపిస్తారు, పిల్లలు తింటారు, ఒక డజను పూర్ణాలు, ఓ అర కేజీ పులిహోర, కొంచం కేసరి ,ఓ పావు కేజీ మురుకులు, అంటూ లిస్టు చెపుతూ ఉంటే, తెరిచిన నోరు తో వింటూ ఉండి పోయాను. 
పూజ కూడా ఇంక ఒక్కటే హడావిడి, అమ్మాయ్ ..ఇంత చాదస్తం ఎప్పుడు వచ్చిందే నీకు? మీ మామ్మ దగ్గర నుంచా? అని ఎప్పుడో పర లోకం లోకి వెళ్లి పోయిన తన అత్తగారిని గుర్తు చేసుకుంది.
అయ్యో, నాకా చాదస్తం? నిజమేనా? అని నేనూ ఆలోచనలో పడ్డాను.
ఈ రోజు పండగ స్పెషల్ నాగార్జున సినిమా వేస్తారే, పాటలు ఎంత బాగుంటాయో? మీ ఊరు లో చూసావో లేదో? నువ్వు చూడు..అని పూజ అయింది అనిపించింది అరగంట లో.
ఇదేమిటి? ఈ టీ . వి. లు, సినిమాలు ఇవే మన దేశం సాంప్రదాయమా ఇప్పుడు? నేను ఏదో కోల్పోతున్నాను, దూరం గా ఉన్నాను అనుకునే దాన్ని. కాని, ఇక్కడ అంతా ఎంత మారిపోయిందో?
శ్రుతి ,లయ అడగనే అడిగారు, అమ్మా ఇక్కడ ఎవరు పరికిణీలు వేసు కోవటం లేదేమిటమ్మా..అని,మరీ నేను ఎంతో ముచ్చట పడి కుట్టించాను, ఇక్కడ చూస్తే, అందరూ జీన్సే.
నేను అక్కడ అవి వేసుకున్న,ఇక్కడికి నా పాత సల్వార్ కమీజ్ లు తెచ్చు కున్నాను, చీరలు    ఇక్కడ కొనుక్కుందాం అని.
ఏమిటో? నాకు కొంచం అయోమయం గా నే ఉంది..నేను ఊహించుకున్నంత గొప్పగా లేదెందుకు? నా ఊరు..లేకపోతే నేనే ఎక్కువ గా ఊహించు కుంటున్నాన ?
రాత్రి ప్రభాకర్ తో ఇదే మాట్లాడేను. కదిలి పోతున్న, చైతన్య వంతమైన సమాజం, తనలో కి ఎన్నో మార్పులు చొప్పించు కుంటుంది, అది ఒక సజీవ ప్రవాహం..నువ్వు, దానిలో ఎప్పుడో ,ఉన్న ఒక పార్శ్వం మటుకు నీతో తెచ్చుకున్నావు. అది ఎక్కడో అంతర్లీనం గా ఉంటుంది.
ఆరేళ్ళ తరువాత వచ్చి, నువ్వు ఒక జరిగి పోయిన  గతం వెతుక్కుంటున్నావు. సమాజం అలా జడ పదార్ధం లాగ ఉండదు కదా, నువ్వు ఎందుకు మారలేదు? అని అక్కడ వాళ్లకి నిన్ను చూసినా అలాగే ఆశ్చర్యం గా ఉంటుంది.
సరే, మరీ ఎక్కువ ఆలోచించకు, రేపు మీ అన్నయ్య వస్తున్నాడు కదా, హాయిగా గడపండి, పిల్లలందరిని, కైలాస గిరి, జూ,రిషి కొండ బీచ్ కి తీసుకు వెళ్ళండి ..అంటూ గుర్తు చేసాడు . 
ఈలోగా నువ్వు   విశాలాంధ్రకి వెళ్లి బుడుగు పుస్తకాలు,ఓ పది కాపీలు ,రాజాజీ 
రామాయణం ,మహాభారతం ..ముళ్ళపూడి వారి కోతి కొమ్మచ్చి, వేమన పద్యాలూ,
సుమతి శతకం, పెద్ద బాల శిక్ష..అంటూ ఇంత లిస్టు చెప్పేడు.

మన తెలుగు వాళ్ళ పిల్లల పుట్టిన రోజులు అయితే, పిల్లల కానుక లతో పాటూ మేం ఒక తెలుగు కథ ల పుస్తకం ఇవ్వడం అలవాటు చేస్కున్నాం.
ఏముంది ఇంత లోనే రెండు నెలలు అయి పోతాయి. రెండు నిముషాల్లగా.
మళ్లీ ఎప్పుడు వస్తామో? ప్రభాకర్ చెప్పినట్టు ఈ దేశం, మన వాళ్ళు, నాన్ రెసిడెంట్ భారతీయులు గా మారి పోతున్నారు..
ఆ పేరు మాకు పెట్టేరు కాని, మేమే నిజమైన భారతీయులం..నాన్ రెసిడెంట్ భారతీయులం..ఇక్కడ ఉన్న వీళ్ళే..
ఏమిటో నా ఆలోచనలు అన్ని ఇలాగే ఉంటాయి.
మళ్లీ ,నా ఇద్దరు పిల్లలు, ఆరు సూట్ కేస్ ల నిండా మన దేశీయ వస్తువులు, పచ్చళ్ళు,పట్టుచీరలు, పూజ పుస్తకాలు, సంగీతం సీ డి లు,లేపాక్షి లో బుట్ట బొమ్మలు, ఏటి కొప్పాక చెక్క బొమ్మలు, చందనం పొడి సాషే లు, మెత్తని మన కాటన్ నైటీ లు  ,చెప్పులు, నృత్యానికి గజ్జెలు, కూచిపూడి నృత్య సంబంధిత పుస్తకాలూ, కుంకుం, పచ్చటి దంపించిన పసుపు, అప్పడాలు, విజయ నగరం వి, ఇంకా పిల్లలు బీచ్ ఇసకలో ఏరి తెచ్చుకున్న గవ్వలు, రాళ్ళు, ఒక్కటి మర్చి పోయినా ఊరుకోరు,చివర గా అటూ ఇటూ ఊగి, ఎంత డాలర్లు సంపాదించినా ,ఇంత ఖరిదా అను కుంటూ కొన్న రాధా కృష్ణ ల చందనం బొమ్మ, సూట్ కేస్ అంతా ఎంత సువాసనో?
ఎన్ని వాసనలు, పరిమళాలు, స్మృతులు, జ్ఞాపకాలు  ..
ఈ ఎన్నారై ఎన్నని మోసుకు వెళ్ళగలదు ..మాధురి..అయ్యో,ఎంత కష్టం నీకు  అని కళ్ళు తుడుచు కుంటూ, తిరిగి ప్రయాణం అయాను  శ్చిమ దేశానికి,ఇంక సూర్యుడే అస్తమించలేదు అక్కడ..
మనకి అప్పుడే తెల్లవారింది.. కను కొనలు నించి రాలి పడ బోయిన కన్నీరు చుక్క ని మీటుతూ పయన మయాను ..నేను ..ఎన్నారైను ....

23 అక్టో, 2011

ఆకాశం జాబిలి..మీ ఇంట్లోనే..

చల్లని సాయంత్రం ,

సంధ్య మేలి ముసుగు
వేసుకుని, అలవోకగా,
అల్లనల్లన నడుస్తూ,


ప్రియుడు వదిలిన
ఎర్రని చెంపలని,
మరింత ఎర్ర పరుస్తూ,
సిగ్గుతో తల వంచి,


గాలి పైటతో ,కబురు
పంపింది, పూల
బాలలూ, నా తల
నిమ్పరూ..అని.


ఆకాశం ,ఆమె
కోరిక విన్నది,
తన నేచ్చేలే
కదా అని, చెప్పింది,


మిణుకు మిణుకు
తారలు, వచ్చి,తుంటరి గా
కన్ను మీటాయి,
ఆమె ని పలకరించాయి.


తారలే అసూయ
పడేలా, తెల్లని,
చల్లని చందమామ
ఇంతలో,ప్రత్యక్షమై,


వెన్నెల పైట వేసి,
సాయం సంధ్యని
సమాయత్తం చేసింది
చీకటి ప్రభువు తో


ఏకం కమ్మని,ఎంత
చల్లని వెన్నెలో,
ఎంత వెండి వెన్నెలో,
ఎంత మంచి జాబిలో.

అమ్మా చెప్పే కథలకి మూలం జాబిలి
పిల్లాడి మారాం కి ఆరామము జాబిలే.
ప్రియుడి కోసం వేచే నెచ్చెలి చెలి ,జాబిలే,
రాని ప్రియురాలి మేడ, వెన్నెల జాబిలి నీడలే..
వెండి వెన్నెల నుంచి ఎంత కోసినా
తరగదు, వెన్నెల వెండి, అమ్మా
ప్రేమ నుంచి ఎంత తవ్వుకున్న
తరగదు, అమ్మకే కుదిరే ప్రేమ.


అమ్మా నాన్న ,అక్క తమ్ముడు,
వెన్నెట్లో తిన్న పెరుగు అన్నం
ముద్దలు ఇస్తాయి, పెద్ద అయాక
గోరంత గా పెరిగి, కొండంత ధైర్యాలు.
ఆడపిల్లల ఒప్పి గుప్పి ఆటలు,
ఆ వెన్నెట్లోనే , గిర గిర తిరిగి
గుమ్మటం లా కూర్చుని, అమ్మా
కళ్ళు తిరుగుతున్నాయే అంటే..


అప్పుడేనా పిల్లా..ఇంక ఎంతుందో
ముందు, చెమ్మ చెక్కలు, కోతి
కొమ్మచ్చులు, ఎప్పటికి ఉండాలే
నీతో, పిల్లా..ఈ వెన్నెల సాక్షిగా..
అనే అమ్మా మనసు ఎంత
చల్లనో, అమ్మా దీవెన ఎంత
వెలుగో, అమ్మా పిలుపు,
సాయంత్రం వెలిగే చందమామ ..


మైమరపు, అమ్మా లేక పోయినా
ఎక్కడయినా చందమామ ఉంటుందనే గా
చందమామ మనకి ఉన్నది,
అమ్మా చందమామ ,ఎప్పుడో


కుదుర్చుకున్న ఒప్పందం ట.
జాబిలి లాంటి చక్కదనం అని
పోలుస్తారు, ఆమె అంతా చల్లగా
ప్రేమిస్తున్దనేగా..గుండెల్లో,


పోడుపుకుని, బిడ్డ లాగే
ప్రేమిస్తుంది, అంతా మనిషిని,
అందుకే, ఆమె లేక పోతే,
అతనికి అమవాసే..


పున్నమి నాడూ అమవాసే,
ఎప్పటికి పున్నమి, జాబిలి,
నీ పెరట్లో నే కావాలా??
నెచ్చెలి ని చల్లగా నవ్వించు.


ఆ నవ్వే నీకు వెన్నెల,
ఆమె నవ్వే వెన్నెల ని అంటి
పెట్టుకుని ఉండే జాబిలి,
ఆకాశం  జాబిలి..మీ ఇంట్లోనే










..








..


















చిత్రాలకే చిత్రం..సినిమాలకే సినిమా

దూకుడో, మూకుడో తేల్చుకొమ్మని, అంటే, సర్వ జనం అలా సమ్మె లు చేస్తూంటే, నేను మటుకు ఎందుకు వెనకబడి పోవడం..అని వంటింటి టూల్స్ అంటే, మూకుడు ముట్టనని సమ్మె చేసిన సరే, ముప్ఫై రోజులు కాదు ,నలభై రోజులు చేసినా మాకు ఒక్కటే..అని కేంద్రం..తేలిగ్గా..చులాగా ,కేరేజాట్ అని తీసి పడేసినట్టు..గా మా ఇంట్లో కేంద్రం కూడా..అలానే..కాని, రేపో..మాపో..అని నిర్దుష్టం గా ఏమి సమాధానం చెప్పకుండా ,అలా దాటేస్తూంటే ఆ సినిమా మా ఊరు నించి దూకేసింది..

సరే లెమ్మని, ఆ దుఖం మరిచి పోడానికి, ఏవో రకరకాల బ్లాగ్స్ చదువుతూంటే, ఎప్పుడూ నావే చదువుకుని ఎంతని మురిసి పోతాను? అని..అప్పుడప్పుడు నాకే ఏదో జ్ఞాన బోధ దానంతట అదే అయిపోతూ ఉంటుంది మరి..
దూకుడు లో డైలోగ్స్ అని ఎవరో రాసి, పుణ్యం చేసుకున్నారు..నా బుర్రలోంచి దూకుడు దెయ్యం కూడా దెబ్బకి వదిలింది.
అవేమిటి ..రకరకాల తిట్లో, ఇంకా మాటాడితే నేను రాయలేని, మాట్లాడ లేని ......ఇలాంటి భాష ని పెద్ద పెద్ద స్టార్స్ చేత పలికించి, జనం ని ఎంత వెర్రి వెంగలయాలని చేస్తున్నారో?
నా జీవితం లో నేను ఎప్పుడూ ఇలాంటి భాష వాడలేదు, నా చుట్టూ ఉండే నలుగురో, పది మందో, కూడా ఇలాంటి భాష వాడడం నేను ఎరగను.
మా ఇంట్లో మొత్తుకుంటూనే ఉన్నారు, మిస్సమ్మ..మాయాబజారు, వెలుగు నీడలు, పెళ్లి నాటి ప్రమాణాలు, నర్తన శాల ఇంకా ఇలాంటి ఎన్నో మంచి,మంచి ఆణిముత్యాల లాంటి సినిమాలు ఇష్టపడిన నువ్వు, ఏమిటి ఇలా భాష మార్చేసి, పోకిరి, ఊసరవెల్లి, యముడు, మొగుడు, దూకుడు..ఇడియట్, వెధవ అంటూ ఇలా తిట్ల పురాణం లోకి దిగావు అంటే, నువ్వు స్వీట్ హోం లో బుచ్చి బాబు వి, నీకు తెలిదు, ఇప్పుడు అన్నీఇలాంటివే వస్తున్నాయి మరి మారుతున్నకాలం తో మనం మారక పోతే ఎలాగా అని ఇన్ని రోజులు, దబాయింపు స్వరం తో నెట్టుకు వచ్చాను.
ఎంత పొరపాటు చేసాను? అని ఈ రోజు..చాల బాధ పడుతున్నాను , ఏ సినిమా విడుదల తీస్తే అది చూసేయక్కర్లేదు కొంచం మన విచక్షణ చూపించి, ప్రమాణాలు నిలపాలి అని చిలక్కి చెప్పినట్టు చెప్తూనే ఉన్నారు..ప్రిన్స్ , నాగ్..అంటూ నేనే ఏదో భ్రమ లో కొట్టుకు పోయాను.
అయినా ఏ సినిమా చూసినా ఏమున్నది..స్టొరీ, అదే స్క్రీన్ ప్లే ఆర్ ట్రీట్మెంట్ ..ఒక హీరో..సకల గుణాభిరాముడు, కాని, భాష చూస్తే వర్స్ట్. తను మటుకు తానూ,మొదటి చూపు లోనే హీరోయిన్ ని చూసి, కాలేజ్ అయితే ఒక టీసింగ్ సాంగ్ తో ఎంట్రి..ఆ పై, నాలుగు సీన్ల తరువాత విలన్ ఎంట్రి, ఇద్దరూ తాగుతారు, క్లబ్లు కి వెళతారు..కాని, ఏమిటో..హీరో అనేసరికి అన్నీ దురలవాట్లు..హీరోయిన్ తో ఓ సాంగ్ వేసుకునే సరి కి సరి అయిపోతాయి..కాని, విలన్ మటుకు నలుగురు చిన్న చితక , చింపిరి మొహం వేసుకుని ,దెబ్బలు తినడానికి రెడి గా ఉండే వారితో, చివర వరకు తిరిగుతూ ఉంటాడు.
ఎందుకైనా మంచిది, సరిగ్గా చూడండి, వీళ్ళల్లో ఒకడు, హీరో అయిపోతాడు, గబుక్కున..
ఇంకా ఎప్పుడూ, హీరో చేత ఎప్పుడు పడితే ,అప్పుడు ఎక్కడ పడితే అక్కడ దెబ్బలు తింటూ..కుయ్యో మొర్రో మంటూ ఉంటాడే అతనే జోకర్..సారీ ..హాస్య నటుడు..
లేదా.. కుళ్ళు జోకులు చెపుతూ ,కాలేజ్ లో విద్యార్ధుల అపహాస్యానికి బలి అయే వాడూ ఒక హాస్య నటుడే..
ఇంకా పిడికిలి బిగించి ఒక్కటి ఇస్తే ...ఓ అర మైలు దూరానికి వెళ్లి పడితే..వాడే పాపం ఒక విలను..ఇంక హీరో గారు ఒక్కటి ఇస్తే ,రక్తం, అన్నీ వేపులనించి ఫౌంటెన్ లా జిమ్ముతుంది..
నేను అసలే రక్తం చూస్తే ..కళ్ళు తిరిగే టైప్..అలాంటిది, పెద్ద పకోడీ పొట్లం లోంచి పాప్ కోరన్ ని నమిలి, నమిలి, మింగేస్తూ..ఒక్క క్షణం కళ్ళు మూస్తే ..ఎన్ని రక్తాల ఫౌంటెన్ లు మిస్ అవుతానో, అనుకుంటూ మైమరచి చూస్తోండడం..
అబ్బా..ఇదేమిటో..ఇలా మారిపోయాను..
పోనీ,డ్యూయెట్ లు ఏమైనా బాగుంటాయా?అంటే..ఒక్క ముక్క అర్ధం అయితే ఒట్టు..పాపం ఆ హీరోయిన్ తో బాటు, పాట లోని మాటలని, నమిలి మింగేస్తూంటాడు ..ఎక్కడికో, మారిషస్సో, ఇటలీ యో, అమెరికయో వెళ్ళే , పాపం ఆ హీరోయిన్లు నిర్మాతలకి భారం ఎందుకని, చిన్న, చిన్న,కర్చీఫలే డ్రెస్ లు గా వేసుకుని..ఎంత సహకరిస్తారో.
ఇంక హీరోయిన్ ఎన్ని సాంగ్స్ వేసుకున్న ఫర్వ లేదు, హీరో గారి చెల్లెలు, ఎవరినైనా ఒక్క చూపు చూసి, మనసు పడేసుకొనే లోపే, హీరో ..అన్నయ్య గా మారిపోయి వీరంగం ఎక్కి, పరువు ప్రతిష్ట అంటాడు..
నాకు అర్ధం కానిది అదే హీరోయిన్ అన్నయ్య అంటే..పాపం విలన్ అయిపోతాడు..ఇంక రివెంజ్ లేనిదే ఒక్క సినిమా నడవదు.
ఎంత ఎక్కువ గన్ ఫైట్స్, ఎన్ని శవాలు, ఎన్ని ఎతైన బిల్డింగ్ నించి గ్రావిటి సూత్రం తల్ల కిందులు చేసే జుంప్స్, ఎంత లాంగ్ చేసిన్గ్స్, ఎంత హీన మైన విలన్ డెత్ లు, ఎన్ని సార్లు హాస్య నటులు తన్నించు కున్నాడు..ఇలాంటి లెక్కల మీదే ..సినిమా విజయాలు ఆధార పడి ఉన్నాయి..
వీటన్నిటి తో, విసిగి వేసారి, నాని లాంటి చిన్న హీరోల సినిమాలు, నెమ్మదిగా వంద రోజులు ఆడేస్తున్నాయి.
ఈ మధ్య చూసిన అలా మొదలయింది..ఎంత హాయిగా ఉందో?
పెద్ద కత్తులు, గన్నులు, గోడ్డళ్ళు .ఏరులుగా ప్రవహించే రక్తాలు..బాబోయ్..వీటికి మమ్మలిని అలవాటు చేయకండి..అని జనం సుతి మెత్తగా చెపితే వినరు..వినటం లేదు..
చెత్త భాష, చెత్త సినిమాలని..వెనక్కి పంపించండి..శత దినోత్సవాలు, పండగలు అంటూ నెత్తి కి ఎక్కించుకోకండి ప్లీస్..
మన పిల్లలు ఎవరైనా..తోలు తీస్తా, వంచుతా గుద్దుతా..గిద్దెడు రక్తం కక్కిస్తా..ఏమే ..ప్రేమిస్తావా ,చస్తావా?? నీ తాట వలుస్తా...ఇంక..నాకు వీలు కాదు రాయడం..ఇలాంటి మాటలు అంటారా? అంటే మనం సహించ గలమా?
అమ్మా..తెలుగు సినిమా ఆ ..అమ్మో వద్దు అమ్మా..అని పారిపోయే మా పిల్లలిని ,కాదు రా ,ఇది బాగుంది, రా కలిసి చూద్దాం  అని గలిగే ఒక్క తెలుగు సినిమా ఎప్పుడు వస్తుందో..
ఈ లోగా ,మధ్యాన్నమో, అర్ధ రాత్రో వచ్చే ..మిస్సమ్మ సినిమా ముందు కూర్చో బెట్టి, పళ్ళెం లో పకోడీలు వేసి, అబ్బ..ఎన్ని సార్లు అమ్మా అంటే..ఊ .ఈ సారి ..ఒక్క మాట కూడా మాట్లాడని బాలకృష్ణ ,అదే ది గ్రేట్  డెఫెక్టివ్ అనబడే గ్రేట్ డిటెక్టివ్ నాగేశ్వరావు అసిస్టెంట్ ని చూడరా, ఎంత బాగా చేసేడో, చిన్న పెన్సిల్ పట్టుకుని ,అన్నీ ఎలా ఎక్కిస్తాడో చూడు.చూడు..అంటూ కడుపుబ్బా నవ్వే నన్ను చూసి, కిందటి సారి సావిత్రి అందం, నటన చూడ మన్నావ్..అంతకు ముందు ఎన్టీఅర్ నటన ,అందం చూడమన్నావ్..అంతకు ముందు ఎస్వీఆర్ జమున..అబ్బాబా..అన్నీ కలిపి ఒక్కసారి చూడొచ్చు  కదా..
ఊహూ ..అదేరా.మాస్టర్ పీస్ అంటే..ఎన్ని సార్లు చూసిన విసుగు రాదు, ఇది సినిమాకి టెక్స్ట్ బుక్, ఇది..గొప్ప..అంటూ మాటల కోసం వెతుక్కుంటూ ఉంటే..చిత్రాలకే చిత్రం..సినిమాలకే సినిమా..అంటూ ముగించేడు.
సరే ,ఇంతకి దూకుడు..దగ్గర కి వద్దాం..లెంపలు ఘాట్టిగా వేసుకుని, ఒక దణ్ణం పెట్టి, గులాబ్ జామ్‌  నైవేద్యం సమర్పించుకుంటాను..ఇంట్లో..నా ..దాసుడి తప్పులు దండం తో సరి ..అనేసారా  మీరు కూడా...

20 అక్టో, 2011

జరిగితే జ్వరం అంత సుఖం లేదని..

జరిగితే జ్వరం అంత సుఖం లేదని..అంటారు.ఇరవై ఏళ్ళ క్రితం, మా అబ్బాయి కి టైఫాయిడ్ వచ్చి హాస్పిటల్ లో జాయిన్ చేసినప్పుడు, పిల్లల డాక్టర్ గారు, ఇంత పవర్ ఫుల్  మందులు ఇస్తున్నాం , అన్ని పెట్టేయండి, పప్పు అన్నం తో సహా..అందులో ఉండే ప్రోటీన్ ముఖ్యం అంటే, నేను ఒక మూడు గిన్నెల కారేజ్ లో పప్పు అన్నం ,కూర  అన్నం, ఇంకా చారు అన్నం మూడూ జాగ్రత్తగా తెస్తే మా అమ్మ ససే మీరా టైఫోయిడ్ వచ్చిన పిల్లాడికి పప్పు అన్నమా అరగదే అంటూ పెట్ట నివ్వలేదు..

అలా ఇంకా వెనక్కి వెళితే ఆరుగురం పిల్లలం ఎప్పుడయినా జ్వరాలు అవి వస్తాయి, కదా , స్కూల్ మానడానికి వచ్చే కడుపు నొప్పుల లా ఉత్తిత్తి జబ్బులు కాకుండా ఓ రోజు ఎవరికో వచ్చేది జ్వరం.

రావడమే వంద , నూట రెండు. ఇంక హాయిగా ముందు స్నానం బంద్..మా ఇంట్లో వాళ్ళందరకి స్నానాలు అవి అంతగా ఒంటికి సరిపడవు. అందుకే నాకు బీనా దేవి కథ " అతి సర్వత్ర వర్జేయత్" లో లాగా, ర్రాయి మీద నిల్చుని, పై నుంచి కిందకి ఊరికినే నీళ్ళు కింద పోసే సీన్ భలే ఇష్టం..
ఇంకో హాయి స్కూల్ కి వెళ్లక్కర్లేదు..,

అంతే అంత వరకే ఆ హాయి , రోజూ, సూర్యుడు ఉదయించడం ,తప్పి పోతుందేమో గాని, మా ఇంట్లో, పెద్ద గిన్నెడు ,కాఫీ డికాషను మటుకు, అటు సూర్యుడు ఇటు పొడిచే సరికి,  కమ్మటి వాసన తో పొయ్యి పై కి ఎక్కాల్సిందే, ఏదో పళ్ళు తోమేం అనిపించుకుని, (ఇది కూడా దేవుడు ఇచ్చిన వేలు బ్రష్ తో నే) తలా ఒక గ్లాసూ పట్టుకుని క్యూ కట్టే వాళ్ళం.

అందరం ఉఫ్ ,ఉఫ్ మని కాఫీ స్వర్గం లో ఉంటే, పాపం ఈ జ్వరం వచ్చిన మా తమ్ముడు మటుకు ( ఎక్కువ తమ్ముడి కే ఈ జ్వరం స్కూల్ జ్వరం ) మటుకు తెల్లని పాలు లో పంచదార కలపిన ఉత్తి పాలు..అప్పుడు ఏ బోర్న్ విటాలు అవి లేవు మరి తాగాల్సిందే , జ్వరం రూల్ నెంబర్ ఒకటో, రెండో , 
పదో..

అక్క..అక్కా..కొంచం కాఫీ అంటూ వెంట పడితే ఆ తెల్లని పాల లో, ఈ నల్లని కాఫీ చుక్కలు రెండంటే రెండు వేస్తే..హమ్మయ్య అని గొంతు దిగేవి.

మేం అందరం గబా గబా స్కూల్ కి తయారు అయి వెళ్లి పోయే వాళ్ళం జ్వరం తగ్గాలంటే లంఖణం పరమ  ఒషుధం అని రెండు తియ్యని హోమియోపతి మాత్రలు నోట్లో వేసి, అమ్మ పనిలో పడిపోయేది.

ఇంక ఇంట్లో ఉన్నవాళ్ళకి ఒకటే బోర్ , స్కూల్ లేదు, దెబలాడుకోడానికి ,కొట్టు కోడానికి, అక్క చెల్లెళ్ళు ,తమ్ముడు లేరు, ఇంక అమ్మని సాధించడమే సాధించడం..

అందరం వచ్చి, ఆకళ్ళు తో అన్నాలు తింటూ ఉంటే, వాడికి మటుకు నెయ్యి తో కాల్చిన బ్రెడ్, పంచదార జల్లి. ఇచ్చేది అమ్మ 

మాకేమో నోరు ఊరిపోయేది,బ్రెడ్, పంచదార రుచికి వాడేమో, వికారం గా మొహం పెట్టి, అక్కా..కొంచం ఆ బంగాళా దుంప కూర పెట్టు..అని చేయి చాపే వాడు.

ఇంక అమ్మ వంటిట్లోకి వెళ్లి నప్పుడు, మేం మెల్లిగా బార్టర్ చేసుకునే వాళ్ళం వాడి చేతిలో ఒక అన్నం ముద్దా, మా చేతిలో ఒక బ్రెడ్ ముక్క..

నాలుగో రోజూ , మా తమ్ముడి కి పెట్టే, ఒక కారప్పొడి అన్నం  నెయ్యి, చారు అన్నం ఎంత రుచో? అది ఆ జ్వరం తగ్గిన నోటికి, స్వర్గం ముందు ఆమడ దూరం లో నిల్చున్నట్టే.

నాకు అయితే స్కూల్ పోతుందని భయం తో జ్వరం తెచ్చుకునే దాన్ని కాను, చాల బుద్ధి మంతురాలిని మరి. టీచెర్ 'స పెట్ ఎప్పుడూ..

కాని, ఇప్పుడో, ఎంత జ్వరం అయినా అన్ని తినేయొచ్చు అంటారు. జ్వర లక్షణాలు అన్ని ఉంటాయి, దెర్మోమేటర్ .అయిదు నిముషాలు నోట్లో కొరికేసినా  ఒక్క డిగ్రీ పెరగదు . నేను అయితే వేడి నీళ్ళల్లో ముంచి ,ఇది పని చేస్తోందా లేదా అని చూస్తాను.

నేను, డాక్టర్ దగ్గరికి వెళ్లి ఆయన గబ గబా రాసి ఇచ్చేసిన మందు చీటీ పట్టుకుని, ఆయన అటు తిరిగి సొరుగు లో మనం ఇచ్చిన నోటు పడేసుకుని ఆ రోజు కలెక్షన్‌  తనివి తీరా చూసు కోనీకుండా , 

డైట్ ఏమిటండి ?అని అడిగితే పిచ్చి దానిని చూసినట్టు,ఇంత అమాయకులా మీరు ,ఏమైనా తినేయ వచ్చు ఆంటిబయోటిక్ కదండీ ,మీరు బలం గా అన్ని తినాలి  అనేసరికి..

అయ్యో, లంఖణం మందు చెప్పే డాక్టర్లు ఏమయిపోయారు? అని ఆలోచిస్తూ ఆయన చెప్పిన మందులన్నీ కొని, ఒక సొరుగు లో పడేసి, ఇంకా మూడ్రోజులు చూద్దాం అనుకుంటాను.

క్రోసిన్ తో తగ్గిపోయే జ్వరాలే అన్ని, కాని, పాపం డాక్టర్లు, మందుల షాపుల వాళ్లకి, మనం పూర్వ జన్మ లో ఉన్న బాకీ తీరుస్తే గానీ, మనకి రుణ విముక్తి అవదు అని అలా మందులు మురగ పెడుతూ ఉంటాను.

ఇంతకీ, ఏదో ,ఒక పూట ఆ కారోప్పొడి  అన్నం ఏదో, ఇంత నెయ్యి చుక్క వేసుకుని లాగించేయా వచ్చు కదా..

అంటే, అబ్బే, ఆ నాలుగో, ఐదో రోజుల లంఖణం..ఆ పీక్కు పోయిన నాలుక కి ఆ కారం తగలడం అది ఒక సుఖమే..

అందుకే జరిగితే జ్వరం అంత సుఖం లేదు..ఇవాళో, రేపో, మిరియాల చారు పెట్టుకుని హమ్మ్ఒక పట్టు పట్టాల్సిందే.ఏమిటో ,జ్వరాలు కూడా రూపం మార్చేసుకున్నాయి కాబోలు ఇప్పుడు . 

సరే, ఇంత చాలు ,ఏమో , కొంచం ఒళ్ళు వేడి గా ఉన్నట్టుండి ఉండండి మరి మా పని చేయని ధర్మ మేటర్ కి పని చెపుదాం.

చ..జ్వరం మీద బ్లాగ్స్ ఏమిటి? అంటున్నారు కాదు కాదు లంఖణాలు మీదే అని తప్పించు కున్నాను . 

19 అక్టో, 2011

అదితి..

అదితి అలసట గా ఇంట్లో కి అడుగు పెట్టింది.

అబ్బ ..ఆఫీస్ అయింది, ఇంక ఇంట్లో కి అడుగు పెడితే..హు..పని అంతా కళ్ళ ముందు కదిలింది.

ముందు ఒక కప్పు టీ పెట్టుకుంటాను..అనుకుని, ఆఫీస్ బాగ్ కొక్కేనికి తగిలించి, బెడ్రూం లోకి వెళ్లి, ఓ ఇంట్లో వేసుకునే సింపిల్  కాటన్ డ్రెస్ వేసుకుని,మొహం కడుక్కుని,వచ్చి టీ కోసం నీళ్ళు పడేసింది.

హరీష్ వచ్చేసరికి ఎంత రాత్రి అవుతుందో? హరీష్ కి ఎల్ ఐ సి లో పని.

ఇంట్లో పిల్లలు కూడా లేరు, ఇద్దరు స్కూల్ నుంచి వచ్చి ట్యూషన్ కి వెళ్లి ఉంటారు.


వేడి, వేడి, గా టీ తాగుతూంటే హుమ్మ్  ..ఎంత రిలాక్సింగ్  గా ఉందో? ఆఫీస్ లో కూడా టీ తాగుతుంది ,ఇది ఇంటి మహత్యమే..ఇల్లు..ఆ ఫీలింగే వేరు.
అదితి బ్యాంకు లో ఆఫీసర్ ..బాధ్యత ఎక్కువే మరి.

సరే, ఇంక రాత్రి వంట సంగతి చూడాలి.అత్తయ్య ఉంటే,ఆవిడ సాయం కొండంత ఉండేది. ఆడపడుచు డెలివేరి కి సాయం గా యు ఎస్ వెళ్లారు.
ఇంతలో సెల్ రింగ్...

ఇంకెవరు? హరీష్..

ఏమిటి ఈ రోజు ఈ స్పెషల్ ..ఫోన్..పిలుపు.ఈ సమయం లో ..
అదితి..మై స్వీట్ డార్లింగ్..అంటూ..మొదలు పెట్టి, అప్పుడే మొదలు పెట్టలేదు కదా..ఇవాళ వంట వద్దు..నువ్వు ,పిల్లలు, చైనా బౌల్ కి వచ్చేయండి.

నో,నో,నేనేం వినను..తొమ్మిది ..షార్ప్..అక్కడే కలుద్దాం.

అదితి నిట్టూర్చింది. వంట తప్పింది అని ఏమంత సంతోషం లేదు, పదిహేనేళ్ళ సాహచర్యం లో అర్ధ మయింది..

హరీష్ నాకు ఇష్టం లేని పనులు ,నాచేత చేయించాలంటే ,ఇలాగే ఏదో సడన్ ప్రోగ్రాం వేస్తాడు.


అలసి పోయి ఉన్నాను అసలే..ఆఫీస్ పని తో, ఆడిటింగ్ ఉంటుందని,అందరం కష్ట పడుతున్నాం. ఎంత కష్టమైన ఈ ఉద్యోగం ఇలా చేస్తున్నాను అంటే ..నాన్న గారే కారణం.


చిన్న ఊరు బొబ్బిలి, స్కూల్ మాస్టారు,నలుగురు ఆడ పిల్లలు, కానీ ఏనాడూ ,బాధ పడుతోనో, బరువు అనో అనుకోలేదు. అందరి ని ఎవరికీ ఇష్టమైన చదువులు వారిని చదివించారు.


పెద్ద అక్క అపూర్వ డాక్టర్ ,రెండో అక్క అనన్య ఇంజేనీరింగ్ చేసి మంచి జాబ్, అమూల్య  మూడో అక్క..లెక్చరర్ ..తను ఆఖరిది ,అదితి..అందరం..ఒకే కొమ్మకి పూసిన చక్కని పుష్పాలు ..ఎవరి అందం, వారిది. ఎవరి చక్కదనం వారిది..


అందరం ఉద్యోగాలు చేస్తున్నాం..నాన్న కోరిక అదే.మేం ఉద్యోగాలు చేస్తూ,మా కాళ్ళ మీద మేం నిలబడాలని. ..జీవితం లో ,స్వతంత్రం గా బ్రతకడం చాలా అవసరం..అన్నట్టు ,ఎప్పుడూ మాటల్లో చెప్పక పోయినా,మా ఉద్యోగాల కోసం తాపత్రయ పడడం .ఎక్కడ వచ్చినా ఉద్యోగం మాతో ఉండడం ,పెళ్ళికి ముందు మాకు సపోర్ట్ అంతా.అమ్మ ..నాన్న లే.

నలుగురు పిల్లలం ఉన్నా,ఎక్కడ ఒక్క రెండ్రోజులు కన్నా ఎక్కువ ఉండరు, అందరం పెళ్ళిళ్ళు చేసుకుని, హాయిగా ఉంటున్నారు,నాకు ఇంకేం బెంగ లేదు అంటారు.


ఆరు నెలలు అయింది, అప్పుడే.అమ్మ నాన్న లని చూసి. ఎక్కడ ఊపిరి సలపని ఉద్యోగాల పని, పిల్లలు శిరీష ,శిశిర లు చదువులు, పరీక్షలు, ఏమిటో ఫోన్ లో మాట్లాడడం కూడా అవటం లేదు.


పోనీలే అమ్మ..అందరూ బాగుంటే..ఫోన్ లు ఎందుకు? అంటారు పైగా ..అమ్మ కి మా దగ్గర వచ్చి ఉండాలని ఉంటుంది, కాని ,నాన్నగారు అక్కడ ఊపిరి సలపని వాళ్ళ దినచర్య లో మనం భారమే కాని, ఏమి సాయం కాదు అని ఆపేస్తూంటారు.


ఎంతో కష్టపడి ఈ ఉద్యోగం ,ఎన్నో పరీక్షలు రాసి, ఎంత మంది తో నో పోటీ పడి, సంపాదించుకుంది. కాని .ఏమిటో..ఒక్కోసారి, పిల్లల ని చూసుకుంటూ ఇంట్లో ఉంటే బాగుంటుందా ? అని పిస్తుంది.


కాని, నాలుగు రోజులు సెలవులు వరుసగా వస్తే, మళ్లీ ఇల్లు ..ఇంటి పనులు విసుగు వచ్చేస్తాయి. బాబోయ్ ..నేను ఇంట్లో ఉండలేను, నా ఉద్యోగం నాకు చాల ముఖ్యం..అని అనిపిస్తుంది.


ఇంకా హరీష్, మంచి వాడే ,చాల సపోర్ట్ చేస్తాడు ,అన్ని బాగుంటాయి..కానీ,చిన్నపట్ట్నించి మగ వారే ఇంటికి ఆధారం అని పించే మాటలు, వాతావరణం లో పెరిగాడేమో, అప్పుడప్పుడు విసిగిస్తాడు. స్వార్ధమో, తన ఆధిక్యమో, ఏదో..ఇబ్బంది ..అనిపిస్తుంది.

ఏం చేయగలదు? తనే కొంచం అడ్జుస్ట్ అవుతూ, అప్పుడప్పుడు  వచ్చే ,చిన్న తగాదాల ,చిన్న  గొడవల వరకు మితం చేస్తూ..చాల మంది కన్నా నయమే కదా..మెల్లగా మారుతాడు అని సరి పెట్టుకుంటోంది.

ఇవాళ ,ఈ సడన్ ఔటింగ్ ఎందుకో, లీలగా నాకు అర్ధం అవుతోంది. వారం మధ్య లో..హుహ్..నాకు ఇలాంటి అన్ ప్లాన్డ్ ఔటింగ్ లు నచ్చవు.నువ్వు మరి లెక్కల మనిషి వి అని తేలిక గా తీసేస్తాడు.

పోనీలే, పిల్లలకి చినీస్ ఫుడ్ ఇష్టమే, నాకు ఇన్ని రకాల వంటలకి టైం ఉండదు, ఏదో హడావిడి గా పొద్దున్నే కుకేర్ పెట్టి, అన్నం, పప్పు, కూర చేస్తుంది, అంత కన్నా టైం ఎక్కడ ఉంటుంది?


సరే..లెమ్మని, తయారు అయి కూర్చుంది, పిల్లల కోసం ఎదురు చూస్తూ. ఇంకా పావు గంట లో వచ్చేస్తారు.


హరీష్ వాళ్ళది చాల పెద్ద ఫ్యామిలీ, ఒక డజను మంది కసిన్స్ ఉంటారు, వాళ్ళవి ఎప్పుడూ ఏవో పెళ్ళిళ్ళు, ఇంకేవో మొదటి పుట్టిన రోజులు అంటూ పిలుస్తారు. అన్నిటికి వెళ్ళాలి మనం అంటాడు.

నాకు ఎలా కుదురుతుంది ? నువ్వు వెళ్లి రా..అంటే చ..ఆడ వాళ్ళు లేకుండా ఫన్ క్షన్ లకి వెళితే పోతు పేరంటాలు అని వేళ కోళం చేస్తారు అంటాడు.

నాకు సెలవులు తక్కువ,బాధ్యత గల ఉద్యోగం. ఎంత బాగా ,చేసినా, ఆడ వాళ్ళు, చీరలు ,షోకులు అంటూ చీప్ గా మాట్లాడే మగ సహోద్యోగులు, ఎన్నని చెప్పను, ఇంట్లో ఇలాంటివి నేను చెప్పను అసలు.

ఈ నెల లో ,మాకు ఆడిషన్ ,చాల బిజీ ..ఈ నెల మధ్య లోనే ,హరీష్ కి ఎంతో ఇష్టమైన అక్క రజని అక్క కూతురు సంజన పెళ్లి.

యు ఎస్ లో చదువుకుని వచ్చింది సంజూ, మంచి అమ్మాయి. సరదా, అంటూ మూడు రోజుల పెళ్లి చేస్తున్నారు. రజని ,బావగారు కి ఒక్క అమ్మాయి. గ్రాండ్ గా పెళ్లి అంటూ ఆరు నెల నించి ప్లాన్ చేస్తున్నారు.

హరీష్ మూడు రోజుల ముందే వెళుతున్నాడు..సాయం ,మా అక్కకి అంటూ..నేను కూడా రావాలని, తన కోరిక..అతి కష్టం మీద రెండు రోజులు సెలవు కి మేమో పెట్టి ఉంచాను.

పిల్లలి కి సరదాయే, సంజు అక్క పెళ్లి, అని..

ఇంత బాధ్యత ఉన్న ఉద్యోగం లో ఎందుకు చేరనా? అని మొదటి సరిగా బాధ పడుతున్నాను. ఏ క్లెర్క్ అయిన అయి ఉంటే, ఒక లీవ్ లెటర్ పెట్టి వెళ్ళొచ్చు, కాని, ఆడిటింగ్ అయే టైం లో నేను బాధ్యత గల ఆఫిసుర్ గా బ్యాంకు  లో ఉండాలి.

హు..చూద్దాం ..ఏమవుతుందో?

ఇవే జీవితం లో పరీక్షలు.. అంతా పెద్ద పి . ఓ.పరీక్ష లో నే నెగ్గాను..ఇది దాట లేనా?

చైనా బౌల్ లో డిన్నర్ బాగా జరిగింది.

హరీష్ చాల ఖుషి మూడ్ లో ఉన్నాడు.హమ్మయా.నేను అనుకున్నట్టు ఏమీ కాదు లే అను కున్నాను.

రాత్రి, పడుకున్నాక వచ్చింది ..విషయం.

అదీ..."మా రజని అక్క ఇవాళ ఫోన్ చేసింది."

"ఈ పెళ్లి చాల ఘనం గా చేస్తున్నారు కదా కట్నాలు అవి లేవనుకో.. కాని బంగారం ధర పెరిగి పోవడం,నీకు తెలుసు గా పెద్ద గా బంగారాలు అవి కొనే లేదు సంజు కి, ఎమ్ ఎస్ చేయడానికి చాల అయింది."

"నీకూ తెలుసు గా.".అవును మా బ్యాంకు లోనే లోన్ ఇప్పించాను..

"ఇప్పుడు పెళ్లి ఖర్చులకి డబ్బు అనుకున్నట్టు సరిపోలేదు, మనం కొంత సర్దాలి, తరువాత మెల్లిగా తీర్చేస్తారు. "బావ గారు గుంటూర్ వికాస్ లో లెక్చరర్ ..

"ఎంత?" నా గొంతు లో వణుకు.

"అయిదు లక్షలు.."

నాకు ఒక్క క్షణం ..మొద్దు గా అయిపొయింది, అయిదు లక్షలా..ఇంత ఆర్భాటం గా మూడు రోజుల పెళ్లి ఎందుకు?? అని మళ్లీ నేనే, ఈ సినిమాల ప్రభావం తో, పిల్లలికి ఇలా చేయక పోతే నచ్చదు..

ఒకరిని చూసి మరొకరు, అందరూ ఇదే దారి, పెద్ద హోటల్, పూల అలంకరణ , అయిదు ,ఆరు పూటల భోజనాలు, భారి విందులు, మళ్లీ వచ్చిన వారికీ కానుకలు, బందువలకి బట్టలు, పెళ్లి వారికీ ఖరీదైన బట్టలు..అవుతాయి మరి లక్షలు.

"సరే ..ఎక్కడివి అంత డబ్బు.".మన దగ్గర అన్నాను..
సంవత్సరం క్రితమే ఈ కొత్త ఫ్లాట్ లోకి మారాం. లోన్ కాకుండా ఇంటీరియర్స్ చేయించ దానికి, మాకు నచ్చినట్టు..చాల ఖర్చు అయింది. ఇంకా ఎక్కడ ఉన్నాయి, నా జీతం..ఎక్కువే గాని, పిల్లల స్కూల్ ఫీజు, ఇతర ఖర్చులు, ఎక్కడకి పోతున్నాయో నెలకి లక్ష దాటుతోంది ఖర్చు, ఒక్కో సారి.హరీష్ జీతం లోన్స్ తీర్చడానికి సరిపోతున్నాయి..ఇల్లు, కార్ లోన్లు.

" నువ్వు నీ బ్యాంకు లో లోన్ తీసుకో.. పర్సనల్ లోన్.."

వడ్డీ రజని అక్క వాళ్ళు తీర్చేస్తారు..మా సేవింగ్స్ లో చాల తక్కువ నిల్వలు ఉన్నాయి అని నేను భయ పడుతున్న టైం లో ..ఈ అదనపు ఖర్చు.

ఏమిటో? బ్యాంకు లో అంత పెద్ద జమ ఖర్చులు బాలన్సు చేస్తాను గానీ, ఇంట్లో మటుకు, నా లెక్క ఎప్పుడూ తప్పు తోంది.

రజని అక్క అంటే నాకూ ఇష్టమే, ఎలా..సరే..చూడాలి..లోన్ దొరకడం పెద్ద కష్టం కాదు గానీ..నా పేరు మీద లోన్ అంటే నాకు కొంచం ఇబ్బంది గానే ఉంటుంది.

"పోనీ వాళ్ళే లోన్ పెట్టొచ్చు కదా..అంత టైం లేదు, మనం రెండు మూడు రోజుల్లో ఈ డబ్బు వాళ్లకి అంద చేస్తే, పెళ్లి పనులు చురుగ్గా సాగుతాయి."

చూద్దాం..నేను నా అకౌంట్ లో కొంత వెనక వేస్తూ ఉంటాను, చిన్న మొత్తాలు ఫండ్స్ లో పెడుతూ ఉంటాను, లోన్ లేకుండానే ఇవ్వ వచ్చు..కాని రెండు రోజులా..ఇంత తక్కువ టైం లో..

రెండ్రోజులు కాదు గానీ , ఒక వారం లో డబ్బు రెడి చేసి పంపించేం. హరీష్ చాల సంతోషించేడు, నా పరువు నిలబెట్టావు ..

అని చెయ్యి పట్టుకుని ..ఒకటే అభినందనలు,

"సరే, నువ్వు అనుకున్నట్టు అంతా అయింది, పిల్లలు నువ్వు వెళ్ళండి, నేను పెళ్లి రోజు కి వస్తాను, రాత్రి కి బయలుదేరి."

"మూడు రోజులు సెలవు, అంటే నేను చాల ఇరకాటం లో పడి పోతాను. చాల ముఖ్యమైన ఆడిటింగ్ జరుగు తోంది, నేను లేక పోతే అస్సలు బాగుండదు.రజని అక్క కూడా నేను ఫోన్ చేసి మాట్లాడ తాను ..ప్లీస్.
అర్ధం చేసుకో.."

హరీష్ ఒక్క క్షణం ఆలోచనలో పడినా ..తప్పదు ..అని అర్ధం చేసు కున్నాడు..

హమ్మయ్య ఈ సారికి, రజని వాళ్ళ అవసరం..నన్ను ఇలా ఆదుకుంది..
నా ఉద్యోగ నిర్వహణ లో ఇలాంటి ఇంకా ఎన్ని పరీక్షలో?

ఇవే జీవితం లో లెక్కలు.. ఈ ఆడిటింగ్ అయ్యాక ఒక వారం చివర ,ఒక రోజు అయిన సెలవు పెట్టి, మూడ్రోజులు బొబ్బిలి వెళ్లి అమ్మ నాన్నలని చూడాలి..అని నిశ్చయించు కున్నాక తెరిపి గా అనిపించింది.
అదితి హుషారు గా ఆఫీసు కి బయలు దేరింది..తేలిక అయిన మనసు తో.

18 అక్టో, 2011

అన్నం పర బ్రహ్మ స్వరూపం...

పసుపు , ఎరుపు, ఆకు పచ్చ రంగులు..అంటే ఏవో పువ్వులో,నచ్చిన రంగులో కాదు,మనం తిన వలసిన పళ్ళు, కూరల రంగులు ట. తూచి,తూచి, కాలోరీలు లెక్క పెట్టు కుంటూ తినాలి ట. కమ్మగా వాసన, మరింత కమ్మని రుచి ఇచ్చే నెయ్యి ,ఊరికే అలా వాసన చూసి, పక్కకి తోసేయాలి ట. నాలిక మీద జివ్వు మనిపించే పండు మిర్చి, కొత్త ఆవకాయల రుచి ఎప్పుడో ఏడాది కి ఒక్క సారి కి సరి ట.

చిన్నప్పుడు బ్రెడ్ అంటే జ్వరం వచ్చిన వాళ్ళకే..వాళ్ళు తింటూంటే, శుభ్రం గా కంచాలు కంచాలు లాగించిన వాళ్ళు కూడా..అమ్మా..మాకో బ్రెడ్ అంటే అబ్బ ..మీకెందు కే ..అది జ్వరం వాళ్ళకే అంటే..అబ్బ మాకెప్పుడు వస్తుందో జ్వరం..అని బెంగ వచ్చేది.

బ్రెడ్ కోసం జ్వరం రావాలని కోరుకునే అమాయక బాల్యం రోజులు అవి.ఇప్పుడు రోజూ టోస్ట్ చేసుకుని, సాండ్  విచ్ బ్రెడ్      తింటూంటే..అయ్యో ,అమాయకం గా ఎందుకలా అడిగే వాళ్ళం. తథాస్తు దేవతలు, ఈ కోరిక మటుకు తథాస్తు అని దీవించి తీర్చేసారు ,అనిపిస్తుంది నాకు.

అన్నం బరువు, తెల్లని అన్నం మరీ ను ట. ఎర్రని దంపుడు బియ్యం తిన వచ్చుట. అయ్యో,మా ఏలూరులో దంపుడు బియ్యం వాళ్ళు ..అదే వాళ్ళ ఇంటి పేరు అనుకునే వాళ్ళం.. ఎన్ని రోజులు తిన్నామో? అప్పుడు తెల్లని అన్నం అంటే ఎంత మోజో..వాళ్ళంతా ఏమయారో పాపం?

పాపం..ఏమయారో? అందరం తెల్ల బియ్యం కే అలవాటు పడి పోయాం.చిన్నప్పుడు గుజ్జన గూళ్ళు అంటూ, చిన్న కంచు గిన్నెల్లో, మా పిల్లల చేత అన్నాలు వండించి, తాటాకు బొమ్మల పెళ్లి చేయించే వాళ్ళు.
ఇప్పుడు  అచ్చం అలాగే ,అంతే అన్నం తినాలిట.. వందో ,నూట యాభయ్యో గ్రాముల బియ్యం ట.

అలాగా కడుపు మాడ్చుకుంటేనే ఆరోగ్యం గా,వందేళ్ళు బ్రతుకుటాము ట.నేను చదివే పత్రిక  ల లో కూలిన గోడలు సేరియల్స్, లేదా సెక్రెటరీ 
సేరియాల్  ,తరువాత యండమూరి అభిలాష ,ఇలాంటి వి, ఉండేవి, కొంచం సినిమా 
వార్తలు, కాని ,ఇప్పుడు పత్రిక తెరిస్తే, ఆరోగ్య నియమాలు, స్పెషలిస్ట్ ల తో సలహాలు, ప్రశ్నలు -సమాధానాలు, ఏదో ఒక డాక్టరు చేత, అది కాక ,ఏదో ఇంగ్లీష్ మాగజిన్ నించి తస్కరించి 
రాసిన స్పినాచ్ యొక్క ప్రాముఖ్యం వంటిట్లో అని, ఈ స్పినాచ్ అంటే ఏమిటో ,అని 
ఎప్పుడూ ఒక రహస్య సందేహం..నాకు అయితే..తోట కూరా, పాల కూరా..ఏదో 
ఒకటి ఆకూ కూర అని సర్ది చెప్పుకోవడం..

ఇన్ని ఆరోగ్య సమస్యలు, సలహాలు, షుగర్ వ్యాధి వారు తీసు కో వలసిన జాగ్రత్తలు, 
బీ.పి..వారు తగ్గించాల్సిన ఉప్పు, ఇలాంటి ఎంతో సమాచారం కో కొల్లలు గా ,నాలుగు వేపులా..
ఓహో ,అందరూ పాటించేస్తున్నరు ,మనమూ పాటించాలి..అనుకుని మంచి రోజు
చూసుకునే టైం కి, ఒక వార్త కనిపించింది.

అన్నం తినే వాళ్ళు భయపడ కుండా తినేయండి, పిండి పదార్ధం లు కూడా మంచి వే..అని..

ఇలా కాదు అను కుని, డాక్టర్ సలహా కోసం వెళితే ఆ హాస్పిటల్ లో ఇసక వేస్తె 
రాలనంత మంది జనం. ఇదేమైన సినిమా హాల్ ఆ అనిపించేలా?
ఏమిటి ,మరి ఈ సలహాలు ఎవ్వరు పాటించటం లేదా? ఎడ పెడ రాస్తున్నారు కదా.ఏమిటి ఇన్ని రోగాలు? కానీ విని ఎరగనివి?
చిన్న పిల్లలికి ,పెద్ద వాళ్లకి అని లేదు..
ఎక్కడ వచ్చిందో ఈ తేడా?
అమ్ముమ్మ , అమ్మ లాగ, శుభ్రం గా రెండు పూటలా..అన్నం,పప్పు,పప్పు లోకి నెయ్యి, కూర, కూర లోకి నూనె, పులుసు, పచ్చడి, మజ్జిగ..ఇలా సమస్త రుచులతో అన్నం తింటే..అన్ని సమస్యలు సర్దు కుంటాయా?
లేక ,ఇలా ఒక కంప్యుటర్ ,ఒక టీ వి. ముందు నించి కదిలి పనులు చేస్తే సర్దు కుంటుందా ఆరోగ్యం..అని ఆలోచన .. వచ్చింది.
చెప్పుచేది ఏమిటంటే..అన్నం పరబ్రహ్మ స్వరూపం..
ధైర్యం గా లాగించేద్దమా కంచం కంచం డు..కంది పొడి అన్నం విత్ ముక్కల పులుసు కి జై, గోంగూర పచ్చడి అన్నం విత్ ఉల్లిపాయ కి జై, ఆవకాయ విత్ నెయ్యి, అన్నం కి జై.ఆఖరి గా చిక్కని పెరుగు అన్నం లో, మాగాయ ముక్క కి జై..
అందుకే..అన్నం పర బ్రహ్మ స్వరూపం..అని ఎప్పుడో చెప్పేరు..
అంటూ లేచాను, నా రెండు పుల్కాలు, చించి, గోదావరి లో పడేద్దామని..ఏమో..పెద్దల మాట చద్దన్నం మూట..అని కూడా అన్నారు, టోటల్ గా ఈ రోజు మటుకు ,నేను అన్నం కే నా ఓటు..
రేపటి సంగతి ఆలోచించుదాం.

ఇంత పిలుపు చాలు...

వసంతమా?? ఎక్కడా??


నీవెక్కడ? మల్లెలు,

చిన్న బోతున్నాయి,

జాజులు ,విరులు,



దిక్కులు చూస్తూ,

వెతుకు తున్నాయి,

ఏమిటో నీ అలక

ఎందుకమ్మా ఇంకా



హరివిల్లు లు దారి

వేయ లేదా? చిరు

జల్లులు నేల

మట్టి వాసన లు



ఇంకా గుబాళింప లేదా?

ఎందుకమ్మా ,నీ అలక

చిరు గాలులు మత్తెక్క

లేదా? చిరు గంటలు



మువ్వల సవ్వడి లు

నీ దాకా రాలేదా?

హేమంత చలి దుప్పటి,

తొలగ లేదా? మలి



సూర్య బింబం ఇంకా

చీకటి అమ్మా ఒడి లో

ఆటలు ఆపలేదా?

నీకు స్వాగతం చెప్పలేదా?



ఎందుకమ్మా ? వసంతం,

ఎందుకమ్మా నీ అలకలు,

ప్రసన్నం..గా దిక్కు ,

దిక్కులా ప్రసరించు



నీ దృక్కులు, అదిగో

హరివిల్లు, ప్రేమ

ప్రేమ తో సంభాషిస్తూ.

అదిగో , అమ్మా ఆర్తి



చినుకులు ,మీద

పడీ, పడ గానే

పులకించిన మది

నుండి వచ్చే మట్టి



వాసనలు, పాపాయి

నవ్వుతో వికసించిన

మల్లెలు, ఆమె జడలో

అలంకరించే ఆశల



జాజులు,విరి జాజులు,

భువి ఎప్పుడూ ,

అందం గా తయారు

అయే ఉంటుంది,



కొంటె కుర్రాడు ,లాగా

గ్రీష్మపు గాలులు,

ఈడ్చి కొడుతూ,

చెదురు మదురు



చేసి ఉంటాయి, ఆమె

అందాల సిరులు,

ప్రేమ తో మన్నించి,

ప్రేమగా అడుగు పెట్టు,



నీ ఇల్లే కదా,నీ కెరుకే,

కదా, ఈ భువన మోహపు,

వసంతం చిరునామా,

నీకు తెలియని ఆమనా??



ఉంటాను మరి, ఇంత

పిలుపు చాలు లెమ్మని,

ఏదో గుండె చప్పుడు,

చెపుతున్నది, ఇంత



పిలుపు చాలు లెమ్మని,

నా గుండె చప్పుడు

చెపుతోంది, ఆమనీ,

రా ,రమ్మని ,ఇంత



పిలుపు చాలు...









నాలోని ప్రేమ ఏనా?

ప్రేమ ఎంత గొప్పదో,



నా మొహం అద్దం లో


చూసాక తెలిసింది,


నీ మొహమే నా అది..






ఎదురుగ ఉంటే


నువ్వు ఎంత


క్లిష్తం ..ఒక అర్ధం


కాని పజిల్ .






దూరం గా నువ్వు


ఉంటే,చిక్కు ముడి


విడి పోయి, అంతా


తేట తెల్ల మవుతుంది.






నన్ను నేను కూడా


అంత ప్రేమించ లేను,


నాలో ఎన్నో, చీకటి


కోణాలు, మరెన్నో






సంక్లిష్త ప్రశ్నలు.


అన్నిటికి నువ్వు,


నీ నవ్వే ఒక


సమాధానం.






నువ్వే నన్ను ఇలా


ప్రేమ మూర్తి గా


ఆవిష్కరించావు,


మరి ఇలాగే ఉంటానేమో?






నీ కళ్ళకి, నీ మనసుకి


నచ్చిన ప్రేమ మూర్తి


గా ఇలాగే ఉంటాను


నేను, నాకు ఇదే బాగుంది మరి.

12 అక్టో, 2011

అతడు..అతడే..

హు..చేతిలో పేపర్ కింద
పడేసి,గడ్డి పరక  తో మాట్లాడే
చివరికి మిగిలేది దయానిధి లా
మళ్లీ హు..అని నిట్టూర్చాడు.

హు..అని నిట్టూరిస్తూ మళ్లీ,ఇదే
నా భాష అయిపొయింది,ఈ
నిట్టూర్పులే, నా భాష, అయింది,
అనుకుంటూ టీ వి. రిమోట్ అందుకున్నాడు.

ఒక మాట అంటే మరో మాట గా
మారుస్తుంది,మాట్లాడితే ప్రేమ
పోయింది అంటుంది,అదేమైన
జ్వరమా నాలుగు రోజుల్లో

పోడానికి, గట్టిగ పట్టిన చెయ్యి,
ఎప్పటికి విడనని పట్టుకున్న చెయ్యి,
ప్రేమ అన్నం పెట్టదు కదా,ఉద్యోగాలు
తప్పవు కదా, ఉద్యోగాల్లో, అవస్థలు

నువ్వు ఉద్యోగం చేయి,నీకు తెలుస్తుంది,
అంటే పిల్లలు చిన్న వాళ్ళు,నాకు ఇంట్లో
నే బోలెడు పని ,అది చాలు అంది,మరి
నా బాధ ఎలా చెప్పను?

ఆదివారం వస్తే,బయటకి,అంటే,బాబోయ్ ,
సిటీ ట్రాఫిక్, లో నడపడం మాటలా?
నాకు ఇంట్లో కూర్చుని ,హాయిగా టీ వి
ల లో, వచ్చే నాన్ సెన్స్ అంతా చూస్తో

ఉండాలని, పిల్లలతో  ఆడుకోవాలని,
ఇంట్లో ఆమె వండే బిర్యాని ,తినేసి,
మంచం ఎక్కేయాలని, అంటే పూర్తి గా
సెలవు అంటే సండే ..లా గడపాలని.

ఆమె కి రోజు వంటలు వండి,వండి,
ఆ రోజు వంటింటికి సెలవు చెప్పాలని
ఉంటుందని నాకు తెలుసు, పిల్లలు
కూడా ,బయటకి వెళదాం అంటే

ఎగిరి గెంతుతారు కూడా,పార్కులు
జూలు, గుడులు,కొత్త ప్రదేశాలు 
అన్ని అయిపోయాయి కదా?
ఇంకా ఏమున్నాయి కొత్తవి?

ఇల్లే పదిలం అని నేను ఒక్కడినే 
ఒక పార్టి, ఏమో ,ఇంట్లో అంత అలసి 
పోతావు,బయట తిరిగి కూడా అలసటే 
కదా,ఏమిటి నీ పంతం..అంటే ఈ 

మగవాళ్ళు కి ఎప్పటికి అర్ధం కాదు,
మా మగువుల మనసు అని ఒక 
లుక్ ఇస్తుంది, మా మగ వాళ్ళ కి 
హుహ్..మనసే లేదు అని ఎప్పుడో

అయిపొయింది తీర్మానం.  ఏమని
చెప్పను ,మా కష్టాలు? నీవీ కష్టలేన?
ఎప్పుడు నీదే పై చేయి కదా? ఏది ఆ
పై చెయ్యి చూపించు ఒక్కసారి,

అంటే ,మీరు చాల తెలివైన వాళ్ళు,
ఒప్పుకున్నారు కదా..అలా కాదు,
ప్రేమ.అనే ఒక్క బలహీనత ని
ఎంత బాగా వాడుకోవాలో

మీకు తెలిసినట్టు ,మరి ఎవరికీ
తెలియదు అని మరొక అభియోగం,
ఏమో ..ప్రేమ అంటూ ఏవో మాటలు ,
మంత్రాలు వేయడం మాకు రాదు,

ఆమె ఒక్క కన్ను సైగ తో ,
నన్ను అదుపు చేస్తుంది
అని చెపితే ,మూతి విరుపు
ఒకటి, ఏమో మా మగవాళ్ళ

కష్టాలు, తోటి మగవాడి కే
తెలుస్తుంది, ఆదివారం.ప్రశాంతం
గా గడుపుదామంటే ఎంత గొడవ
అయిందో? సతీష్ మళ్లీ ఫోన్,

ఒరేయ్, సినిమా వద్దు లే పోనీ,
మన మాధవ్ వచ్చాడు రా,
యు ఎస్ నించి, మంచి ఫారెన్
విస్కీ రా..అంటే, మరి నేను లేచి

పాంటూ,షర్టు వేసుకోనా?
ఒక్కసారి ..రా ..ప్లీస్ రా..
అంటూ బ్రతిమాలి ,కాళ్ళు
పట్టుకుని ,బయట పడ్డాను..

మగ వాళ్ళ ఏమి పెద్ద
త్యాగాలు చేయక్కర్లేదు,
మా లాగ ,సంసారాలు కోసం
అంటుంది ఆమె, ఏమో,

ఈ రాత్రి కి అన్నిటికి
ఒప్పెసుకోవడమే.అదే బెటర్,
అతడు ..ఎప్పటికి అతడే.
అని ఏదో అంటుంది, ఏమో మరి.


 






నా జీవితం నా చేతి లో

కమల ..ఏదో నలత గా ఫీల్ అయి , మధ్య రాత్రి లో లేచింది, మాధవ్ ని లేపింది, అతను లేచి, ఒంటికి పట్టిన చమటలు అవి చూసి, వెంటనే హాస్పిటల్ కి తీసుకు వెళ్ళాడు..

ఒక్క గంట లేట్ అయినా మీకు దక్కేది కాదు..మీకు..అన్నారు డాక్టర్లు.

పది రోజుల తరువాత ఇంటికి తిరిగి వచ్చింది.కమల.

ఇల్లంతా దుమ్ము పట్టి ఉంది.ఆడ వాళ్ళు లేని ఇల్లు ఎలా ఉంటుంది?
ఎక్కడ మొదలు పెట్టి చేయను? ఈ ఇంటికి..

ఎంత చేసాను?  ఈ ఇంటి కోసం.

కమల ఇల్లు అద్దం లా పెట్టుకుంటుంది,కమల కి రాని విద్య లేదు..పిల్లలని ఎంత బాగా పెంచింది? ఇద్దరు పిల్లలు బాగా సెట్టేల్ అయారు..
ఇంకేమిటి ? కావాలి..

అందరూ అనే మాటలు ఇవి.

కమల మంచం మీద పడుకుని ఆలోచిస్తోంది.

కొన్ని రోజులు రెస్ట్ తీసుకోమన్నారు, ఇంకా పనులు అవి చేయొద్దు అని చెప్పేరు, ఈయనే అలా చెప్పించేరేమో కూడా..లేక పోతే నేను ఊరుకోను అని.

ఒక్క రోజు కూడ  రెస్ట్ తీసుకోలేదు, ఒక తల నొప్పి లేదు, ఒక జ్వరం లేదు, తనది మంచి ఆరోగ్య మైన శరీరం. ఇప్పుడేంటి? ఇలా..రెస్ట్
అంటారు. సరిగ్గా మొన్నే యాభై ఏళ్ళు నిండాయి.

ఓ గంట పడుకుని ,ఇంకా అలా మంచం మీద పడుకుంటే కష్టం ..చ..మరీ పేషెంట్ లా ఉన్నాను.అయినా నాకు ఇప్పుడేమయింది?

అనుకుంటూ లేచింది.ఇల్లంతా నిశ్శబ్దం గా ఉంది, పిల్లలిద్దరూ అమెరిక లో.ఈయన ఆఫీసు కి వెళ్ళారు ,ఈ వేళె..ఎన్ని రోజులు సెలవు పెట్టి కూర్చుంటారు. ఇంట్లో?

ముందు గది లోకి వచ్చి,సోఫా లో కూర్చుని న్యూస్ పేపెర్ తీసింది, ఏమిటో మనసు కుదర లేదు. పొద్దున్నే ఏదో కూకెర్ పెట్టి, అన్నం వండి వెళ్ళేరు మాధవ్, తనని ఏదో కొంచం వేడి చేసుకుని తినేయ మన్నారు.

ఏమిటో ఆకలే వేయటం లేదు..చారు అన్నం ఒక్కటే తినాలని ఉంది, ఆ మందులకి నాలుక చేదు గా అయి పోయింది.

అలసట గా సోఫా లో తల వెనక కి వాల్చింది..గోడ మీద తళ తళ మెరుస్తూ, తాన్జూరు పైటింగ్ ..ఎంత శ్రమ పడి నేర్చుకుంది ..ఇంతేనా ,ఆ మూల పెట్టిన ఫ్లవర్ వాస్ ..చక్కని వాస్..పోటేరి క్లాస్ కి వెళ్లి, మట్టి కుండలు కి రంగులు వేయడం..చక్కని పూల తో అలంకరించడం అన్ని నేర్చుకుంది..ఆఖరికి అందులో అలంకరించిన పువ్వులు కూడా..తను తయారు చేసినవే..

ఇంట్లో ఏ మూల చూసినా తను చేసిన అందమైన వస్తువులు కనిపిస్తాయి.పిల్లల కోసం బేకింగ్ నేర్చు కుంది, పుట్టిన రోజు కేకు ఇంట్లో నే తయారు చేసి ,అందరిని ఆశ్చర్య పరిచేది.

కమల అంటే..అమ్మో ..ఎంత పని మంతు రాలో అనిపించు కుంది. పని వాళ్ళ తో పని చేయించడం లో ఆమె తరువాతే అనిపించు కుంది.

పిల్లల పరీక్ష లని, వాళ్లకి ఇబ్బంది అని, ఏ పెళ్లి పేరంటాలకి వెళ్ల లేదు, నువ్వు లేకుండా నేను ఒక్కడిని ఎందుకు అని మాధవ్ కూడా బద్దకించడం..అలా చుట్టాలు తో సంబంధాలే తగ్గి పోయాయి. 

ఎలా ఉన్నావు అమ్మా..అని పిల్లలిద్దరూ దూరాల నించి ఫోన్లు చేసారు..రామా ? అమ్మా..అని అడిగేరు..ఇద్దరి మంచి బిజీ టైం ...అని నాకు తెలుసు, పరీక్షలు, తేసిస్ చివరలో ఇంకొకరికి..

ఇప్పుడు వస్తే..అంతా వృధా అవుతుంది..ఏం లేదు..అంతా బాగానే ఉంది..అని సర్ది చెప్పింది.

మాధవ్ కూడా ,ఫర్వాలేదు అమ్మకి అని నచ్చ చెప్పేడు..పిల్ల లిద్దరికీ.వస్తాం అనే అన్నారు..

మెల్లగా లేచి, వంటిట్లో కి వెళ్ళింది కమల.

విశాలమైన వంటిల్లు, తామే దగ్గరుండి కట్టించుకున్నారు. ఒక పక్క పెద్ద ఫ్రిజ్, మరో పక్క ఎల్ షేప్ లో గట్టు..వాటి మీద మిక్సి , గ్రయ్ న్డేర్ , ఓవెన్ , ఒక వేపు,తళ తళ లాడే స్టీలు గిన్నెలు, అన్ని ఎంచి, ఎంచి కొన్నవే..

నాకు కావల్సింది ఇవాల్టికి కాసింత చారు అన్నం..ఎవరైనా దగ్గరుండి వడ్డిస్తే బాగుండును అని పిస్తోంది.

ఫ్రిజ్ లో మంచి నీళ్ళు తెచ్చుకుని కూర్చున్నాను.
నా చిన్నప్పటి స్నేహితురాలు గుర్తు వచ్చింది..వసుధ, అమెరిక లోనే ఉంటుంది.ఇండియా వచ్చిన ప్రతి సారి చెప్పేది.

"కమలా..నువ్వు ఎంతో విలువైన సమయం ఇంటి మీద పెట్టేస్తున్నావు. ఇల్లు శుభ్రం మంచిదే కానీ, నువ్వు నీమీద కూడా కొంచం శ్రద్ధ పెట్టు.పిల్లలు, భర్త..అందరూ ముఖ్యమే కానీ, ఎంత వరకూ? నువ్వే నీ గురించి ఆలోచించక పోతే, ఇంకెవరూ ఆలోచించరు..నువ్వు ఏదో ఒకటి ,బయటకి వచ్చి పని చేయి, డబ్బు కోసం కాదు..నీ తృప్తి కోసం.."

అని చిలక్కి చెప్పినట్టు చెప్పింది.

ఏమిటో? ఈ వసుధ, సమాజం..సేవ, ఇల్లు తరువాతే కదా,అని నవ్వు కునేది. తన కి ఎంత గర్వమో, అందరూ కమల నిజం గా సూపర్ భార్య,సూపర్ అమ్మా అని..

అబ్బ ..ఏమిటో, నీరసం గానే ఉంది. ఆ అన్నం కూడా ఇప్పుడు వేడి చేసుకుని తినడం కష్టం గానే ఉంది..ఒంటరితనం ఎంత భయంకరం..

నేను సేవ చేసిన ఈ ఇల్లు, ఈ సోఫాలు, ఈ అలంకరణలు, ఈ వంటిట్లో స్టీల్ సామాన్లూ, ఈ బీరువాల నిండా ఉన్న బట్టలు, ఈ నగలు..

నాకు ఒక్క పూట భోజనం పెట్టవేమిటి?

నాకు తోడూ..నాకు మాట సాయం..నాకు సపోర్ట్ ..ఎక్కడుందో ..నాకు తెలుసు. ఎప్పుడో మర్చి పోయిన నా ప్రియ స్నేహితురాలి కి ఫోన్ చేస్తాను ఇప్పుడే..ఎన్ని సార్లు పిలిచింది, ఒక్కసారి మా ఇంటికి రా..నువ్వు బయట పడాలి కమలా..లేక పోతే నీకు ఒంటరి తనం ,ఒక రోజు తప్పదు అని.

కమల ఇక నించి..నా జీవితం నా చేతి లోకి తెచ్చు కోవాలి అని నిశ్చయించు కుని , స్నేహితు రాలు రమ్య కి ఫోన్ చేయ డానికి ...లేచి నిలుచుని ..కుప్ప కూలిపోయింది.