"http://www.jalleda.com/images/jalleda3d48x32.png">

30 మార్చి, 2012

జాగ్రత్త రా..బాబూ.

సుధాకర్ స్కూటర్ కి స్టాండ్ వేసి, ఇంట్లో కి వస్తూ, బయట చెత్త బుట్ట లో పడేసిన వాడిపోయిన పూల దండలు చూసి గతుక్కుమన్నాడు.
అమ్మో, ఇవి ఎవరు పడేసారు? సుధ చూసిందంటే..అమ్మో ఇంకేమయినా ఉందా??సుధ కి ఆ పూల దండలు ,ఎంత ప్రాణమో? నేను ,మామూలు మగవాడి లాగే, మనుషుల మీదే ఫీలింగులుంటాయి ,కానీ ఇలా దండలు, పువ్వులు మీద కాదు.ఇవన్ని ,కొత్తగా నేర్చుకుంటున్నాను.
సుధా..చూసావా? ఆ దండలు? అని ఇంకా ఏదో అన బోతూంటే ..
ఉండండి ,ఉండండి, ముందు ఆ షూస్ విప్పి, కాళ్లు కడుక్కుని లోపలి రండి, అని ఆర్డర్..
సరే, తప్పుతుందా !! చేయి పట్టుకున్నాను కదా ,అదే పాణిగ్రహణం..
"ఇవాళ మనం బీచ్ కి వెళ్లి , ఐస్ క్రీం పార్లోర్ లో, మంచి ఐస్ క్రీం తిని రావాలండి.."
"సరే, ముందు కాఫీ ఇస్తావా మరి?"
"నువ్వు తాగావా?"
"ఆ ,మీకు ఇదిగో కాఫీ ..నేను .".కొంచం సిగ్గు తో, "ఇవాల్టి నించి పాలే .."
"ఎందుకు? "..ప్రశ్నమొహం లో?
"మరి మన పాపో, బాబో, తెల్లగా, హెల్తి గా పుట్టాలి కదా?"
హా..ఆశ్చర్యం, ఆనందం, అప్పుడేనా అని కొంత నిరుత్సాహం..
ఇంకా మూడు నెలలేగా? అయింది, పెళ్లి అయి..
ఇంకా ఎన్ని అనుకున్నాడు తను..
మా ప్రేమ గుర్తు గా పాపో, బాబో వస్తున్నారు కదా, అందుకే దండలు పడేసాను, ఇంకా తొమ్మిది నెలలు మరి ఐస్ క్రీం తినను, పాప కి జలుబు చేస్తుంది కదా? అన్న సుధ మాటల్లోనే పాపాయిని చూసేను ఆ రోజు..అమ్మ ని కూడా..
సరే, సుధ మొహం లో సంతోషం చూసి ..తను మనస్ఫూర్తి గా సంతోషించేడు.
ఇంకా మొదలు, కాష్మీర పువ్వు, పాలు, పెద్ద వాళ్ళ జాగ్రత్తలు.
ఆరో నెల ,డాక్టర్ చెక్ అప్ అయి వస్తున్నాం.
ఆ రోడ్డు, అంతా తవ్వి పెట్టేరు, గతుకులు..గుంటలు..
"ఆపండి, ఆపండి, నేను నడిచి వస్తాను..ఈ గతుకుల్లో స్కూటర్ మీద కూర్చుంటే, లోపల పాప కి ఎలా ఉంటుందో?"

"అబ్బ ! సుధా, దేవుడు చాల జాగ్రత్తగా పెడతాడు , అంత ఫ్రజ్యల్ అని లేబెల్ పెట్టి పంపించడు, పసి పిల్లలని. "
"అయినా, నీతో వాదించలేను," అని పూర్వ  అనుభవం తో..
మరు నెల లోనే, ఒక ఫ్రెండ్ అమ్మేస్తూంటే ..ఓ చిన్న కార్, కొనేసాను.
ఇంక ఇబ్బంది ఉండదు అని..సుధ పొట్టలో ఉన్నది, మరి మా ప్రేమ గుర్తు కదా?బాబు పుట్టాడు.

ఇంక మూడో నెల లో, మెడ నిలపగానే ,అదేదో ఒక అపూర్వమయిన దృశ్యం లా ఇద్దరం ఎంత సంతోషించామో?
ఒక చిన్న ఊయల ,ముందు, అది సరిపోక, ఒక చిన్న మంచం కొన్నాం, చుట్టూ ,ఒక ఫ్రేం..బాబు పడిపోకుండా..సుధ కి ఇంక బాబు 'ప్రణవ్' తో నే లోకం..అడుగులు వేస్తే..ఒక పండగ, మాటలు వచ్చిన రోజు, అమ్మా ..అని నాన్నా అని పిలిచినా రోజు, ఇంతే తేనే నోట్లో పోసినట్టయింది.ఇంక మూడో ఏడు వచ్చింది, బడి లో వేయాలి.

ఒక పదో , ఇరవయ్యో చిన్న పిల్లల నర్సేరీలు చూసి, అన్ని విచారించి, చివరికి ఇంటికి దగ్గరని, పెద్ద గొప్ప గా లేక పోయినా అందులోనే  వేద్దాం ..అని నిర్ణయించింది.సరే అన్నాను.చూస్తూండగా ,పెద్ద బడి లో వేయాల్సి వచ్చింది.
స్కూల్ బస్సు ఉన్నది, ఎంచుకున్నాం.బస్సు డ్రైవర్ కి , విడి గా బాబు ని అప్పగించింది.

రోజు వెళ్లి, బస్సు కి దింపడం, మళ్లీ సమయానికి వెళ్లి, సాయంత్రం ,తీసుకు రావడం, దగ్గర కూర్చుని చదివించడం..ఆమె ఇష్టం గా చేసే పనులు అయిపోయాయి.
"అమ్మా..నేను ఇంక పెద్ద వాడిని అయాను ,ఎందుకమ్మా? నేను వచ్చేస్తాను ..బస్సు స్టాప్ నించి" ,
అంటే "ఒద్దు లేరా? పుస్తకాల సంచి బరువు..మోయాలి కదా, అయినా నాకు ఇంకేం పని ఉంది..?", సుధ లోని అమ్మ..జవాబు.
మూడు చక్రాల సైకెల్ నించి , రెండు చక్రాల సైకెల్ కి మారడానికి ,

సుధ ,తీసిన పరుగులు, వెనకే, హ్మం..నవ్వు, బాధ..ఇంత ప్రేమేంటి? ఈమెకు? అమ్మ లందరూ ఇంతేనా??
పార్క్ లో ఆడుకుంటూ, పడి పోతే, అంత పెద్ద అయిన,వాడిని ఎలా మోసుకుని వెళ్లిందో ..డాక్టర్ వరకూ, ఇప్పటికి నాకు ఆశ్చర్యమే..

రెండే రెండు కుట్లు పడ్డాయి, నుదుటి మీద...ఎంత కన్నీళ్ళు కార్చింది?
వాడికి కారిన రక్తం కన్నా ,సుధ కన్నీళ్ళే  ..ఎక్కువ బాధాకరం అని పించింది.

పదో తరగతి చక్కగా పాస్ అయాడు, ఇంటర్ అంటే, అందరి లాగే ,కోచింగ్ కాలేజ్ లోనే వేసాం..నా స్నేహితులు అందరూ అక్కడే ,అమ్మా..నాన్నా,అన్నాడు.
బస్సు లేదు, చిన్న బండి కావాలి, అన్నాడు.
ససే మిరా..వీల్లేదు ,సుధ..
ప్లీస్ అమ్మా..అని బతిమాలితే, ఒక చిన్న మోపెడ్ కొన్నాం.
కాలేజ్ అయిదు కి అవుతుందో, ఒక్కోసారి, ఇంకా ఏదో, ఎనిమిదో ? అవుతుంది.

సుధ గుమ్మం లో నే మకాం. ఇంకా రాలేదు, ఇంకా రాలేదు, 
ఇంత ఆలస్యం అయింది ఏమిటి ?అయినా ,ఏదో ఒక సీట్ వస్తుంది, ఎందుకు అన్ని గంటలు అలా కూర్చోపెడతారు, వెధవ కాలేజ్, మానేయ్..అంటుంది.
అదేమిటమ్మా? అందరు అమ్మలు రాంకులు ,రాంకు లు అంటూంటే ..
నువ్వు ఏమిటమ్మా? ఇలా అంటావు

ఎంసెట్ లు అయాయి, ఉన్న ఊరు లోనే చదువుకో ,అని సుధ పట్టు పట్టింది. ఇక్కడే మంచి కాలేజ్ లో ప్రవేశం కూడా వచ్చింది.

ఇంక ప్రణవ్ ఇప్పుడు ఎంజేనీరింగ్ స్టూడెంట్.
అమ్మా..నాకు మోటర్ సైకెల్ కావాలి 
అంటూ పట్టు పెట్టేడు ..సుధ ఒప్పుకోలేదు.

అలిగి ,పంతం పట్టి..కొనిపించేడు, హీరోహోండా..ఇంకా..లైసెన్స్..కూడా రాలేదు, వద్దు రా..అంటే వినడు..ఎప్పుడూ లేనంత రాష్ ..స్నేహితుల ప్రభావం అని సుధ, కాదు, ఈ వయసు అంతే అని నేను..
ఇద్దరికీ ,నిద్ర పట్టటం లేదు.ప్రణవ్.కి .ఈ నాలుగేళ్ళు ఎలా గడుస్తాయి?
ఇంత లోనే ఈ వార్త..
ఇద్దరు ఎంజెనేరింగ్ విద్యార్ధుల మృతి, బైక్ ఆక్సిడెంట్ లో. బీచ్ రోడ్ మీద అని
సుధ స్పృహ తప్పి పోయింది.ప్రణవ్ కాదు..అని ఎవరో అంటున్నారు..ప్రణవ్ కాదు, ఇంకో అబ్బాయి..ఎవరయినా ,ఎంత నరకం..

ఈ బైక్ లు ,ఎందుకు ఇలా స్పీడ్ గా వెళ్ళడానికి తయారు చేస్తున్నారు?
ఇదేమి ,రేసింగ్ కాదు కదా?
ఎలా చెప్పాలి? 
మా ప్రాణం అంత మీ మీదే..
జాగ్రత్త రా బాబూ..బాబులూ..

ఈ అమ్మ చెప్పే మాట వినండి.
అని సుధ గట్టిగా ఎలుగెత్తి చాటాలి అనుకుంది..
అందుకే ..ఈ కథ..ఇది  కథ...కాదు..రోజూ చూస్తున్న ,వింటున్న వార్తలు, నిజాలు. ఈ బైక్ లు మీద పిల్లల విన్యాసాలు, రేసులు, ఎంత శోకం మిగులుస్తున్నాయో,తల్లి తండ్రులకి ?
వింటున్నారా? పిల్లలూ..మీ అమ్మ మాట..వింటున్నారా?
జాగ్రత్త రా..బాబూ..
జాగ్రత్త..గా ఇంటికి వెనక్కి రండి. మీ భవిష్యత్తు బంగారం..మరు భూమి చేసుకోకండి..ప్లీస్..వినండి  అందరి అమ్మ ల మాట.











25 మార్చి, 2012

నేనింతే....నేనింతే...

"అమ్మా!!అమ్మా!!"
అని అరుచుకుంటూ హడావిడిగా లోపలి వచ్చేడు, మహి.
"అబ్బ..ఏమిటి రా ,ఆ హడావిడి? ఏమయింది? అంత రొప్పు తున్నావు? 
కూల్,కూల్.."
"అబ్బబ్బ అది కాదు అమ్మా..నా స్కూటర్ .".
"ఊ స్కూటర్ ,అమ్మో ఆక్సిదేంటా ??"
"కాదమ్మా విను, చిన వాల్టర్ రోడ్ లో వస్తూంటే.."
"ఊ ,వస్తూంటే? ఎవరయినా అడ్డు వచ్చి పడి పోయావా??" అప్పుడే గుండెలు దడ దడ లాడడం ,నాకే వినిపిస్తోంది.
"ఉండమ్మా! నన్ను చెప్పనీ"
నేను ట్యూషన్ క్లాసు నించి వస్తూంటే , వెళ్ళే ముందు దారి బాగానే ఉంది, వచ్చేటప్పటికి ..
"ఊ ,వచ్చేటప్పుడు". నేను .
"అమ్మ ..ఉండు నన్ను చెప్పనీ, వచ్చేటప్పటికి దారికి అడ్డం గా ఒక పందిరి వేసేసి, రోడ్డు మీద ఓ తాడు కట్టేసారమ్మా స్పీడ్ గా వస్తున్నానా? ఒక్క సారి బ్రేక్ వేసాను అమ్మా..అంతే , నలుగురు అబ్బాయిలు చుట్టుముటేసి, ఇటు దారి బంద్ ,ఇటు దారి లేదు, వెనక్కి వెళ్ళు అనేసరికి, నాకు "
" బాబోయ్ ,ఏం చేసావు రా? "
"ఉండమ్మా.. అసలే నాకు చికాకుగా ఉంది.. వాళ్ళ మీద..ఇలా అడ్డు తగలకు, పూర్తి గా  చెప్పనీ,
అయినా ఏమిటి రోడ్డు వాళ్ళ అబ్బ సొత్తా? "
"ఇదేమిటి రా బాబూ, చిరంజీవి సినిమా మాటలు మాట్లాడుతున్నావు.."
"అమ్మా.." "ఊ సరే, సరే..నువ్వు చెప్పు.".
అన్నాను, నోటి మీద వేలు వేసుకుని, ఒక పక్క మనసులో, చిరంజీవి సినిమా లో లాగే, పర్వతాలు పగిలి పోతున్నట్టు ,టెన్షన్ తో, నాకు 
చెమటలు పట్టేస్తున్నాయి  ..ఏమిటో ఏం అఘాయిత్యం చేసేదో వీడు? అని.
మహి అంటే మహిధర్..కి, తను తిట్టిన తిట్లు అన్నీగుర్తు వచ్చాయి అమ్మో అమ్మ కి తెలిస్తే, గుండె ఆగిపోతుంది, ఇంగ్లీష్ మీడియం లో చదివే నాకు ,ఇన్ని తెలుగు తిట్లు వచ్చు అని తెలిస్తే..
"ఏమయింది ? రా చెప్పు,"
"ఏం లేదమ్మా ..వాళ్ళతో తగువు పడ్డాను, నన్ను తోసేసి నా స్కూటర్ ,తీసేసుకుని, నన్ను వెళ్ళు ,వెళ్ళు అని పంపించేసారు   అమ్మా."..
"అయ్యో స్కూటర్ అక్కడే ఉందా?"
"ఎలాగరా ఇప్పుడు.. అయ్యో, నాన్న కూడా ఊరులో లేరు."
ఉండు అని చెప్పి, చిన వాల్తేర్ లో ఉన్న మా చుట్టాల వాళ్ళింటికి ఫోన్ చేసేను, ఎవరూ తీయలేదు, మా ఫ్రెండ్ సత్య ..ఊ వాళ్లకి అయితే లోకల్ పలుకబడి ఉంది, సత్య ఇంట్లో లేదుట , ఎలా ఇప్పుడు?
డోర్ బెల్ మోగింది..ఎవరూ? అని అరుస్తూ, విసుగ్గా తలుపు తీశాను.
హసీనా ,మా ఇంట్లో పని మనిషి ,కొడుకు  సలీం.
ఎప్పుడో ఒక రోజు మా ఇంటికి వచ్చేడు. 
గుర్తు పట్టేను, ఏమిటిరా ?" మీ అమ్మ ఎలా ఉంది?" ఊ.. రేపు పని లోకి రానని ,ఓ చెడ్డ కబురు మోసుకు వచ్చాడా?
"అమ్మ గారూ,"
వీళ్ళు మా కన్నా స్వచ్చమయిన తెలుగు మాట్లాడుతారు.. అనుకుంటూ..
" ఏం కబురు తెచ్చేవురా? మహి, ఇలా రా.. నువ్వు, నీ గది లోకి దూరి పోకు, నీ విషయం అంతా పూర్తిగా వినాలి నేను," అంటూ, ద్విపాత్ర అభినయనం లోకి దూరి పోయాను ,అమ్మ లకే సాధ్యం ఇది, మరి..ఇన్ని పాత్రలు ఒకేసారి పోషించడం..
"చిన బాబు స్కూటర్ తెచ్చి, కింద మన కార్ పక్కనే పెట్టెను, అమ్మ గారు..ఆ చిన వాల్తేరు ..అమ్మవారి పండక్కి మేం కరెంట్ పెడతాం కదా అమ్మగారు ,అంటే మా ఓనర్ పని, మేం చేస్తాం, బాబు ని చూసేను, అక్కడ , చిన బాబు ని చూసేను, బాబు వెళ్ళినాక ,నేను మంచి గా ,వారితో మాట్లాడి, మా అమ్మ పని చేసే ఇంట్లో బాబే, అని చెప్పి, తాళాలు లేవు కదా, తోసుకుని వచ్చి ,కింద సెల్లార్ లో పెట్టెను ..అమ్మ గారూ.."
"హమ్మయ్య ..చాల హ్యాపీ రా..ఒక పెద్ద బెంగ తీరింది. ఇప్పుడు ఆ స్కూటర్ ,ఎలా అనుకుని, అందరికి ఫోనులు చేస్తున్నాను.."
"ఉండు, ఇంద ,ఈ యాభై తీసుకో" అన్నాను, పర్స్ లోంచి తీస్తూ..
"ఒద్దమ్మా ,మా అమ్మ తిడతది, వస్తా అమ్మగారూ", అంటూ వెళ్లి పోయేడు.
మహి ..అని వెనక్కి తిరిగి చూస్తే,  అప్పటికే ,తన గది లోకి వెళ్లి తలుపు వేసుకుంటున్నాడు..
సమస్య తీరింది కదా..అని నేను ఇంకా బోళ్ళు పని ఉంది వంటిట్లో అని లోపలి వెళ్లి పోయాను.
మర్నాడు, హసీనా పని లోకి వచ్చి, మరింత వివరం గా వర్ణించి, చెప్పింది, తన కొడుకు చేసిన సాయం గురించి..
ఊ ..ఊ..అని పని లో పడి, నేను విని ఊరుకున్నాను.
నిన్నటి ఉత్కంట  తగ్గేసరికి,  ఇప్పుడు ఆ మాటలు వినడం..విసుగ్గానే ఉంది, అవును మరి మా వాడు, స్కూటర్ అక్కడ వదిలి వస్తే, దీని కొడుకు భద్రం గా తీసుకు రావడం ..మింగుడు పడోద్దూ  ..
ఏమిటో ఈ మనసు. ఇంత స్వార్ధం ..అని ఎవరో, నాతో అన్నట్టు అనిపించింది.
మా పనిమనిషి హాసిన ముస్లిం అయినా ,తనకే ,మన పద్ధతులు అవి బాగా తెలుసు.
వినాయక చవతి రోజు పూజ చేసి, మర్నాడే, గది సద్దేద్దాం అని ,దేవుడు ని తీయ బోతే, అదేమిటి అమ్మా? మూడో రోజు తీయాలి గదా..నిన్న కదిపి పెట్టేరా? అని అడిగేసరికి..
నాకు చిన్నతనం అనిపించింది, ఈ దేవుడు, పూజలు ఈ మధ్య కదా మొదలు పెట్టెను, పిల్లల కోసమని, వాళ్లకి పూజలు అవి అస్సలు తెలియకుండా పోతాయని ..
ఊరు దేవత ,కనక మహా లక్ష్మి, మార్గశిర మాసం లో రష్ గా ఉంటుందని, ఆ గుడికి  ఓ రోజు బయలదేరుతూంటే చెప్పింది హాసిన ఏ మరి.
నాకు ఏదయినా కష్టం వస్తే, వెంటనే ,మా వారు కి ఫోన్ చేస్తాను, లేక పోతే నా బెస్ట్ ఫ్రెండ్ సత్య కి..వాళ్ళిద్దరి సలహా ,లేనిదే ఏ పని చేయలేను.
ఇంట్లో  ఏ సమస్య వచ్చినా ,ముందు కంగారు పడి, తరువాత మెల్లగా ఏం చేయాలో అని తీవ్రం గా ఆలోచిస్తూ కూర్చుంటాను.
మొన్నటికి మొన్న ,వంటిట్లో గిన్నెలు తోముతోంది, వాళ్ళాయన ,వచ్చి బెల్ కొట్టేడు. 
చెయ్యి కడుక్కుని వెళ్లి పోయింది ,అంతే, ఆ గిన్నెలన్నీనేనే తోముకోవాల్సి వచ్చింది.
మర్నాడు, తీవ్రమయిన స్వరం తో, అని నేను అనుకున్నాను," ఏమిటే అలా వెళ్లి పోయావు..?"
అని అడిగితే, "మా ఇంటికి మా తోటికోడలు వచ్చింది , మా పిల్ల కి సంబంధం తెచ్చింది, మా ఆయనకి కాళ్ళు చేతులు ఆడవు, నేను ఇంట్లో లేక పోతే, అని ఉన్న పళాన నన్ను తోలుకు పోయాడు "
సరే, పోనీ ఇవాళ అయినా వచ్చేవు, అంతే చాలు..అని లొంగి పోయాను..
ఏమిటో, మా ఆయన మీదైనా ఎప్పుడయినా కోపం వస్తుంది కానీ, పని మనిషి మీద పొరపాటున కూడా రాదు...గిన్నెలు తోమే మహా పని నించి నన్ను తప్పించే .మహా మనిషి మరి..
మనం వాడిన గిన్నేలే,  తోమడం మొదలు పెడితే, ఒక పర్వతం లా అనిపిస్తాయి, కళ్ళల్లో నీళ్ళు ఒక్కటే తక్కువ.
ఒక్కో రోజు, జీవితం అంటే విసుగు కలిగినప్పుడు మటుకు, చక చక అంట్లు తోమేసి, ఇల్లు ఊడ్చేసి, అబ్బ , ఎంత పని చేసేను ఈ వేళ,అనుకుంటే ఎంత బాగుంటుందో? ..హుహ్..ఆ రోజు, పున్నమి కో అమావాస కో ఎప్పుడో వస్తుంది..
కొన్ని రోజులు అయింది..
ఒక రోజు, మళ్లీ, వాళ్ళాయన వచ్చి బెల్ కొట్టేడు.
ఇదిగో, ఆ పనులు చేసి మరి వెళ్ళు హసీనా. . అని నేను ఒక వేపు అరుస్తూనే ఉన్నాను,
" అమ్మ గారు..మా అబ్బాయి సలీం తెలుసు కదా.. మనింటికి వచ్చేడు ,యాడ్ని, కౌన్సిలర్ గారింట్లో , గది లో పెట్టి తాళం పెట్టేరెంట.. వాళ్ళమ్మాయి గీతో ఏదో, ఆ అమ్మాయి ఎంట పడే డంత ..మా అబ్బాయి అట్టాంటి వోడు కాదు, ఆ అమ్మయే వెంట పడి ఉంటుంది, నేను మజ్జానం వొచ్చి కడుగుతా,అమ్మా ..ఏం అనకమ్మా,"
అంటూ వెళ్లి పోయింది.
సరే తప్పదు కదా, మిగిలిన పని అంత చేసుకున్నాను,
మజ్జాన్నం ..లేదు, సాయంత్రం లేదు..
మర్నాడే వచ్చింది. కోపం తో మొహం ఎర్రగా అయిపోతున్న, బయటకి ఒక్క మాట మాట్లాడ   లేదు.
మొహం లోనే కోపం అంతా చూపిస్తూ..
"హ్మం..ఇదేనా మజ్జాన్నం ?" అన్నాను.
"ఏం సెప్పమంటారు, ఇంటికి పరుగు పరుగు న పోయి, అప్పటి కప్పుడు ,మా యీది లో ఉన్న ఆడోల్లు ,మొగోళ్ళు ని బతిమాలి, బామాలి, కోన్సిలోర్ ఇంటికి పోయి, మా అబ్బాయి ని, విడిపించండి, అని కేకలు పెట్టి అరసినాం."
అమ్మో, అరిసార? అన్నాను..నేను అదే యాస లో మర్చిపోయి, గుండె మీద చేయి వేసుకుని.
మా మేనల్లుడు టీ వి. యాళ్ళకి డ్రైవరు ,ఓ ఫోన్ కొట్టేసరికి ,టీవీ 9 వాన్ ట, వచ్చి, మా గోల అంతా చూపించేసారు ట..ఇంకేముంది, కౌన్సిలర్ ,ఒచ్చి ,ప్రెమాన పూర్తిగా నాకేమి తెలీదు, అన్నాడు, ఈ లోగ వెనక ద్వారం గుండా 
సలీం ని యిడిపించారు ట  , వాడు, ముందు కు వచ్చి, అమ్మా..పదవే,చాలు, గొడవ చేసింది చాలు..అన్నాడు, "
అంతే.. అందరూ అరుచుకుంటూ ..క్షమాపణ అది ,ఇది అన్నారు..
మా బాబే, చాల్లే అమ్మా..పద..అంటూ అందరిని వెళ్ళండి ,అని తరిమేసాడు.
ఇంటికి వచ్చి, ఏమిట్రా ..అలా చేసేవు? టీ వి లో అంతా సుపిస్తారుట..అంటే..
ఇంకా ఒదేలేయ్ అమ్మా.. గీత మంచి పిల్ల, నేనంటే ఇష్టం అనుకుంటా, కరెంట్ పని మీద వెళితే తనే మాట్లాడింది. పోనీ ..అమ్మా ..అనేసాడు.
మా వీధి అంతా అదే మాట, కోనసేలోర్   మళ్లీ గెలవాల అంటే, మాతో పెట్టుకున్టాడా  ..మాది అంతా ఒకటే కట్టు కదా..మా ఓటు పడాల వద్దా?
" నీకెంత ధైర్యమే ?" అన్నాను..
హసీనా ముసి ముసి నవ్వుతో, మరి తప్పదు..అమ్మా..మా లాంటి వాళ్ళకి, ధైర్యం లేకపోతే బతగ్గలమా  ? ఇంత లోనే కళ్ళ ల్లో నీళ్ళు ..
"మా ఆయన కి ఆ తాగుడు జబ్బే లేక పోతే ,మేం శుభ్రం గా బతికే వాళ్ళం..కదా? ఈ ఆడ పిల్ల కి పెళ్లి చేయాల, ఇద్దరు కొడుకుల కి మంచి జీతం తెచ్చే పని కుదిర్చాల.".అంటూ..కళ్ళు తుడుచు కుంటూ పని లో పడింది.
నేను..నా నాలుగు గదుల ఇంట్లో   కూర్చుని, ఫోన్ ల మీద , ఫ్రెండ్స్ సలహాల మీద, సాయం మీద బతికేస్తాను..
ఎదురు పడి..జీవితం నిజం గా ఎదురు పడితే....ఏమవుతానో?
హసీనా వేపు ఆరాధన గా చూసిన నాకు, మళ్లీ ,మా ఇంట్లో పని మనిషి అని గుర్తు వచ్చి ,సర్దుకున్నాను..నేనెప్పుడూ ఇంతే.. వీర పలాయన వాదం
నేనింతే....నేనింతే, అని గొనుక్కున్నాను..నాలో నేను.. 





















   












   



13 మార్చి, 2012

అదృశ్య స్నేహాలు..???

శుభ రాత్రి ..
అని ఒక స్టేటస్ మెసేజ్ ,టైపు చేసి, వసుధ..హమ్మయ్య..ఈ రోజు అయింది ,అని నిట్టూర్చి ..వంటింట్లో మిగిలిన పనులు చేసుకోవడానికి లేచింది.
ఏమిటో? ఇది ఒక అలవాటో? లేక దుర్వ్యసనమో? ఏమో? 
పేస్ బుక్ లో సభ్యురాలు కాక మునుపు, ఏం చేసే దాన్నా? అని ఆలోచిస్తూ ,సింక్ లో పళ్ళాలు, గిన్నెలు కడుగుతూ ఆలోచిస్తోంది.
ఏమో? టీ వి.చూసేది, లేదా పుస్తకాలు చదివేది, లేక పోతే మధ్యాన్నం ,భోజనం చేసి నిద్ర పోయేది.
ఈయన, ఉదయం ఎనిమిది గంటలకి ,డబ్బా లో కొంచం టిఫిన్, పెట్టుకుని ఇంట్లోంచి బయట పడితే వచ్చేది ,వచ్చేది రాత్రి ఎనిమిది కే, ప్రభుత్వ రంగం లో పని, ఆఫీసు లో పని తక్కువ, మాటలు, అదే సెమినార్లు ఎక్కువ..సగం రోజులు భోజనాలు ,అక్కడే అయిపోతాయి.
పిల్లలు, ఇద్దరూ తలో చోట ఉన్నారు.. ఇంకా నాకేం పని ఉంటుంది?
ఈ పేస్ బుక్ లో సభ్యురాలు అయాక, సమయం ఎలా గడిచి పోతున్నదో ,తెలియటం లేదు.
ఈ మధ్య ,కొంత మంది, మరీ దగ్గర అయిపోయేరు.
అందులో సమత ఒకరు. పిచ్చి పిల్ల..నాకు ఇద్దరూ కొడుకులు అవడం తో ,నా కూతురు లాగా అయిపొయింది.
ఇంజినేరింగ్ చదువు తోంది..ఆఖరి సంవత్సరం ..లోకి వచ్చేసింది.సమత రెండో ఏడాది చదువు లో పరిచయం..అయింది.
నేను పెట్టే చక్కని మెసేజ్ లకి వెంటనే లైక్ లు పడేవి, అలాగా మొదలు అయింది. మా స్నేహం..
ఒకరికి ఒకరు మా మెయిల్  ఐ డి లు కూడా ఇచ్చి పుచ్చుకోవడం తో ఇంకా దగ్గర  అయ్యాం.
మధ్యలో పరీక్షలు అనో, స్నేహితుల తో బిజీ అనో, కొన్ని రోజులు ఎలాంటి స్టేటస్ మెసేజ్ లు ఉండేవి కాదు, దానితో ,నేను, చాల బాధ పడి పోతూ ,అయ్యో ఏమయింది? ఎందుకు? రాలేదు పేస్ బుక్ లోకి అని ప్రతి పది నిముషాలకి ,పని చేసుకుంటూ వచ్చి చూడడం ..ఇది ఒక విచిత్రమయిన బాధ..
నేను ఇక్కడ ఈ విశాఖపట్నం లో , తను, హైదరాబాద్ లో, నాకు ఎందుకు బాధ ? అంటే, ఏమో? దూర మయిన పిల్లల స్థానం ,ఇలా భర్తీ చేసుకున్నానేమో ? అనిపించేది.
మా ఇద్దరికీ ఉన్న వయసు వ్యత్యాసం..ఎప్పుడూ అడ్డం కాలేదు, మా స్నేహానికి. నేను ఉద్యోగం అంటూ ఏమి చేయక పోయినా..ఉదయం అయిందంటే, ఒక గంట, రెండు వార్త పత్రికలూ చదివితే కాని, అదీ ,కాఫీ తాగుతూ, ఇంక ఏ పని మొదలు పెట్టను. ఎప్పుడూ ,ఈ సమాజం ఎందుకు ,ఇలా ఉంది అని ఏవో ఆలోచనలు, వయసు తో సంబంధం లేకుండా, నిత్య నూతనం గా ఉండడానికే తపిస్తాను.
అందుకేనేమో, ఈ అమ్మాయి సమత నన్ను తన స్నేహితురాలిగా ,ఆప్తురాలిగా  భావించి, తన మనసు లో మాటలు, భావాలు అన్ని నాతో పంచుకునేది..
ఎందుకో, ఈ కాలం అమ్మాయిల లాగ కాదు, చాల కుదురైన అమ్మాయి  , ఇలా ముక్కు మొహం తెలియని అమ్మాయి తో, నీకు ఈ బంధాలు ఏమిటి? అని మా ఆయన, అప్పుడప్పడు విసుక్కునేవారు..
ఇంట్లో వారు నాకు పెట్టిన పేరు, సెంటిమెంటల్ ఫూల్..అని..ఏదో చిన్న వస్తువు అయినా సరే, అవసరం లేదు ,పడేద్దాం, అంటే ..అమ్మో, చాల సెంటిమెంట్ ,అది కొన్న రోజు, మనం ఇలా అనుకున్నాం..అంటూ ఆ సంభాషణలు అన్ని తిరగ తోడేస్తూ ఉంటాను..
అవేమి, ప్రత్యేకం కావే?? ఎప్పుడూ మనం అనుకునే, మాటలే కదా..అంటే వెంటనే నాకు కళ్ళలలో నీళ్ళు వచ్చేస్తాయి..
ఏమిటో ఈ భావోద్వేగం? నాకు ఒక్కర్తి కేనా? మా సంసారం లో,ప్రతి చిన్న వస్తువు, మేం ఇద్దరం అనుకుని, సంప్రదించుకుని, కూడబలుక్కుని,కూడబెట్టి ఎంతో శ్రమ తో,ఇష్టం మరియు కష్టం తో  కూడిన అనుబంధం తో కొనుక్కున్నవి ..అని నా భావన.అందుకే ఏదయినా ,ఇంక పడేసి, వేరొకటి కొనుక్కుందాం అంటే, ముందు వచ్చేవి, కళ్ళల్లో నీళ్ళు.
అమ్మా ! ఇంత సెంటిమెంట్ ..హుహ్..కష్టం అమ్మా..ఇలా ఉంటే..రోజులు మారిపోతున్నాయి, కొత్త నీరు వస్తుంది, అంటూ నాకే ..ఈ పిల్లలు, పాఠాలు.చెప్పడం.అందుకే అన్నారు కదా, గుడ్డొచ్చి పిల్లని వెక్కిరించింది అని.
పడుకునే ముందు..దూరం గా అమెరికా లో ఉన్న నా పిల్లల గురించి, కాదు, పక్కనే ఆదమరిచి నిదురుస్తున్న మా ఆయన గురించి కాదు..నా మానస పుత్రిక సమత గురించే ఆలోచిస్తూ..పడుకున్నాను.
ఉదయం అయింది....ప్రతి రోజు..ఒక కానుకే నాకు అని నమ్ముతాను, ఉదయించే సూర్యుడిని చూస్తే,చాలు..అన్ని సమస్యలు, ఆలోచనలు ,వేడి తగిలిన  మంచు లా కరిగి పోతాయి, రాత్రి కే మళ్లీ, అన్ని చీకటి తో ,దొంగల్లగా మనసులోకి ప్రవేసిస్తాయి..ఇలాగ ఏవో సిద్ధాంతాలు నాకు.
ఇంటి పనులు, వంట పనులు, అన్నీ అయి మధ్యాన్నం రెండయింది, పేస్ బుక్ తెరిచేసరికి..
ఇవాళ కూడ లేదు సమత నించి ఎటువంటి సందేశం..పేస్ బుక్ లో, జవాబు లేదు నా ఇన్ బాక్స్ లో..
నాకు ఎందుకో మనసంతా దిగులు ఆవరించింది.
అలాగే, ఒక నెల రోజులు గడిచి పోయాయి.
నేను నెమ్మదిగా ఫేస్ బుక్ లోకి వెళ్ళడం కూడ తగ్గించేసాను.
ప్రతి ఉదయం ,బద్దకించకుండా, ఉదయించే సూర్యుడు కూడా ఎందుకో ,ఈ సారి నాకు నా మనసులో ఉన్న ఏదో దిగులు ,చింత చీకట్లను దూరం చేయ లేక పోతున్నాడు.
ఇంక నువ్వు మర్చిపో , నీ ఫేస్ బుక్ కూతురు, పెళ్లి చేసుకుని ఏ అమెరికాకో   వెళ్లి పోయి ఉంటుంది, తన భర్త తో హాయిగా ,ఉండి ఉంటుంది...ఇంక నువ్వు, ఇంకో ఫ్రెండ్ ని వెతుక్కో, వసుధా..అన్నారు ..ఈయన.
నాకు ఎందుకో , నమ్మాలనిపించ లేదు, అమెరికా లో ఉంటే ఏం? ఒక్క సందేశం పెట్ట వచ్చు కదా ఫేస్ బుక్ లో..ఇదే రోజూ ,నా మనసులో ఆలోచన.
సమత..ఏమయిందో? ఏమయి ఉంటుంది..??
ఇవే ఆలోచనలు..
ఇంక విసుగు వచ్చి మెల్లిగా ,మర్చి పోవడానికే ప్రయత్నిస్తోంది.
ఆ రోజు..సమత ..వి మిస్  యు ..అన్న ఒక మెసేజ్ కనిపించింది.
సమత ఫ్రెండ్ ఒక అమ్మాయి గీత పెట్టింది ..ఆ మెసేజ్.
నాకు గుండె ఆగిపోయింది..
ఎందుకు మిస్ అవుతోంది తను.
గీత కి మెసేజ్ పెట్టెను, సమత ఎలా ఉందో నాకు చెప్పమని, వెంటనే.
గీత వెంటనే మెసేజ్ పెట్టింది..సమత ఇస్ నో మోర్ అని..
నాకు వెంటనే చెమటలు పట్టి, కళ్ళు తిరిగినట్టు అయిపొయింది..
ఎప్పుడూ ఆఫీసు కి ఫోన్ చేయని నేను ఫోన్  చేసాను, వెంటనే ఇంటికి రమ్మని..
ఆనంద్ ఇంటికి వచ్చి, నా పరిస్థితి చూసి, కంగారు పడి, ఏమయింది? ఏమయింది? వసుధా అంటూ డాక్టర్ కి ఫోన్ చేసి, రమ్మన్నాడు.
నాకు ఏమీ కాలేదు. ఫరవాలేదు, ఇలా కూర్చో ..
సమత ఇంక లేదు ట..అంటూ భోరున ఏడ్చేసాను.
ఆనంద్ నన్ను ఊరుకో బెడుతూ, చాల బాధ పడ్డాడు తను కూడ..
నేను ఆ అమ్మాయి కబుర్లు అన్నీ ,తన కి చెప్పేదాన్ని.
నేను ఇంక ఫేస్ బుక్ విషయమే మర్చి పోయాను. కాని, పిల్లలు ఇద్దరూ సెలవుల్లో వచ్చి, అమ్మా..నువ్వు, ఒక్క సంఘటనే కే ఇలా అయిపోతే ఎలా? అమ్మా..నీకు ఎంతో మంచి పేరు, ఫేస్ బుక్, లో, మేం నీ మెసేజ్ లు మిస్ అవుతున్నాం అమ్మా..అంటూ..నన్ను మరి, మరి అడిగేసరికి,
సుమారు ఆరు నెలల తరువాత నా ఎకౌంటు లోకి లాగ్ ఇన్ అయాను.
చాల మెసేజ్లు , ఫ్రెండ్షిప్ కోసం పంపిన మెసేజ్ లు చాల ఉన్నాయి.
ఒక్కొక్కటి చూస్తున్నాను.
మెసేజ్ లో ఒకటి గీత నించి.
మేడెం, మీరు మా సమత ఫ్రెండ్ అని తెలుసు, తను మీ గురించి ఎప్పుడూ చెబుతూ ఉండేది.
తను చాలా మంచి స్టూడెంట్, చదువు తప్ప ఇంకొకటి తెలీదు, చాల పాత కాలం అమ్మాయి, అని అందరం అనే వాళ్ళం.
అలాంటి అమ్మాయి ని ప్రేమ అంటూ ఇద్దరు అబ్బాయిలు, వెంట పడి ప్రేమిస్తున్నాం అంటూ చాల హింసించేరు, మేం అందరం చెప్పేం, అలాంటివి మామూలు ,ఈ కాలేజ్ లలో, పట్టించుకోకు అంటూ.
ఆ రోజు పరీక్షకి వస్తోంది, తను, మేం కొంచం వెనక గా నడుస్తున్నాం, ఆ రమేష్, అదే ప్రేమిస్తున్నాను అని వెంట పడ్డ అబ్బాయి, వచ్చి, కత్తి తో పొడిచేసాడు, మేం అందరం చూస్తూనే ఉన్నాం, కొన్ని అడుగుల దూరం లో..
అందరం ఘోల్లున అరిచేం..
పోలీసులు పారిపోతున్న అతని ని పట్టుకున్నారు.
హాస్పిటల్ కి తీసుకు వెళ్లారు..రెండు రోజులు పోరాడి, కను మూసింది, మేం అందరం షాక్ అయ్యాం..మా తల్లితండ్రులు అయితే రోజూ మమ్మలిని కాలేజ్ వద్ద దింపడం మొదలు పెట్టేరు.
ఇంక ముందు చదవ లేక పోయాను.
నా మనసు అంతా ఎవరో పిండేస్తున్నట్టు బాధ, రాక్షసులు అంటే వీరేనా? ఎవరు ఇచ్చారు వీళ్ళకి. ఒక ప్రాణం తీసే అధికారం..చక్కటి, కుసుమం ని కాళ్ళ కింద నలిపేసే కాఠిన్యం, ఎలా ఉంటుంది ఒక మనిషి? 
ఎవరి కి పుట్టిన వారు? వీళ్ళు ,ఈ రాక్షసులు..
ఎవరిని నిందించాలి, ఈ విలువలు దిగజారుతున్న విద్య నా? మొత్తం సమాజమే ఇలా తగలడిందా...
నేను నా ఇల్లు, నా పిల్లలు, నా ప్రపంచం ఇవి క్షేమం .అంతే చాలు అనుకునే నా లాంటి వారి వల్లా? నేను ఏమీ నష్టం చేయ లేదే ?
నా పిల్లలని నేను బాగానే పెంచానే ..ఇంక నేను ఏం చెయ్యగలను నేను ఇంత కన్నా.?? ఇంతేనా? నేను ఇంకేం చేయలేనా?
అన్యమస్కం గా ఫ్రెండ్ షిప్ కోసం పంపిన వారి పేర్లు..


చూస్తూంటే..గీత, సమత ఫ్రెండ్..అని కనిపించింది..
తను సమత ..మెసేజ్ కిందే నాకు పెట్టింది, గీత ...


హ్మం..ఆలోచించాలి, మళ్లీ ఇంకో సమత లాగా దూరం అవుతే ,అంటే పెళ్లి, అయో, పై చదువులకో వెళ్లి పోతే..అయినా..నేను..తనకి అవసరం అవుతానా? అవసరం ఒక్కటేనే..ఫ్రెండ్షిప్ చాలదా. తేలికగా తీసుకోవాలా ? నేను కూడా ఈ స్నేహాలు.. ఈ అదృశ్య స్నేహాలు? ఇంతేనా?
తనకి, ఈ నవతరానికి ,నా ఉపయోగం ఇంకా ఉందా?


ఇంకా కిందకి వెళ్ళాను, ఆనంద్ ..ఆనంద్..నించి ఫ్రెండ్షిప్.మెసేజ్..ఎప్పుడూ ,ఏమిటో ఇవన్ని పని లేని ఆడ వారు కల్పించుకున్న అదృశ్య స్నేహితుల పేజ్ ..పోనీలే ,నన్ను ఎక్కువ షంటడం లేదు అంటూ.. నన్ను ఏడిపించే ఆనంద్ నించి నాకు ఫ్రెండ్షిప్ మెసేజ్.
హ్మం..ఇంకా ఈ ఫ్రెండ్షిప్ పేజ్, ఈ ఫేస్ బుక్, నా జీవితాతం ,నాతో నే ఉండే పేజ్..నా పేజ్..నా వ్యక్తిత్వం, నా అస్తిత్వం..ఈ పేజ్..
అనుకుంటూ. ఇద్దరి  స్నేహ హస్తాలు.. గీత, ఆనంద్ ,లకి క్లిక్ చేస్తూ..ఇవాల్టి ఫేస్ బుక్ కి శుభం పలికాను..

















11 మార్చి, 2012

నోట్ బుక్ ..


మూడు దశాబ్దాల్ క్రితం ..స్టూడెంట్ గా ఉన్న రోజుల్లో
రాసుకుని, దాచుకున్న కవిత్వం.

నా పోస్ట్స్ లో మళ్లీ పబ్లిష్ చేసుకుంటున్నాను..నన్ను నేను కనుక్కుని..మళ్లీ..ఈ నోట్ బుక్ లో..
వృక్ష నీతి  ( సంఘం)

గంగ రావి కి గంగ వెర్లు
నల్ల సంద్రం నిండి మింగి
వెర్రి ఊడలు వెర్రి దించి
శివమెత్తిన పిచ్చి గాలి
వ్రేళ్ళ వృక్షము పైకి తంటే
వ్రేళ్ళ సందున లేత మొక్క
చిరు చిరు రెపరెపలు.


ప్రయాణం

అయోమయం అంధకారం
అర్ధ రాత్రి ఈ పయనం
వెనక కదలిక కి ముందు చక్రాలు
చెట్లు కదులు ,దృష్టి నిలుచు
అంతా లోకి కడుపు మంట
గొంతు లోకి ఉండ లాగ
ఆత్మ కదిలి, గుండె కదిలి
మనిషి బతికి ,మనిషి చచ్చు..



గుండెల్లో ఎర్రదనం
కళ్ళ నిండా చల్లదనం
పిల్ల దాని ఎర్ర రిబ్బను
ఉతికి వేసిన పచ్చ రిబ్బను.

 three dimensions

పొడవు వెడల్పు గ్రంధం లోన
లోతుకు అంతు చూడదలిచి
అనంత కోట్ల ప్రయాణం లోన ,కనుగొంటి ని
అధునాతన అనాగారికతను ..






"నీకేం తక్కువ చేసేను?"

"నీకేం తక్కువ చేసేను?"
మళ్లీ రెట్టించాడు..మహేష్.
అన్ని ఎక్కువే..అని మనసులో అనుకున్నాను..


పైకి మటుకు ఏమీ మాట్లాడ కుండా ,నా పని నేను చేసుకుంటున్నాను. ఎలా చెప్పను? ఏం చెప్పను? ఈ మనిషికి.
దోసెలు   పోస్తున్నాను..కొబ్బరి చట్ని అయింది, టమాట పచ్చడి ఉంది, కారప్పొడి ఉంది, తల తుడుచు కుంటూ ,స్నానం చేసి వచ్చి, టిఫిన్ కి ఏం చేసానో చూస్తూ, "సాంబార్ లేదా?" అన్నాడు.


నిన్నటి నించి ,విపరీత మయిన తల నొప్పి..ఈ మిగ్రెయిన్ తల నొప్పి, నాకు వస్తే, అమ్మ ఇంట్లో అయితే ఎన్ని సేవలు చేసేదో? గుర్తు వచ్చి, కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి.


మహేష్ కంట పడ్డాయి ..హ్మం....కలకంటి కంట నీరు చూడలేరు కదా ఈ మగ వాళ్ళు? 


" ఏమిటో పెద్ద కష్ట   పడి పోతున్నట్టు..పిండి రుబ్బడానికి మషిన్..ఉంది, పచ్చళ్ళు చేయడానికి ఇంకోటి..కుకర్   లు ఉన్నాయి, ఇంట్లో సమస్తం అమర్చి పెట్టెను, అయినా రుచి గా  చేసి పెడతావు అనే కదా..పెళ్లి చేసుకున్నాను,లేక పోతే, నేను ఒక్కడిని  , హాయిగా ఉండేవాడిని"..


ఈ మాటలు ఏదో నవ్వులాట గా ,అంటూ, నాకు ఏదో చేయి సాయం చేయడానికి వచ్చి ఉంటే..ఈయన, నాకు ఇలాగ పొద్దున్నే కళ్ళల్లో నీళ్ళు తిరిగి ఉండేవి కావు.


అయిదు గంటలకే లేచి ,కాఫీ డికాషన్ తీయాలి, కాఫీ ఫ్రెష్ గా ,మంచి కాఫీ వాసన వస్తూ ఉండాలిట..ఇడ్లీ పిండి కూడా ఒక్క రోజు కన్నా వాడ కూడదు..అచ్చం దసపల్ల హోటల్ లాగ, రోజూ ,టిఫిన్ లోకి, మూడు రకాల పచ్చళ్ళు , వీలయితే సాంబారు ఉండాలిట, ఇడ్లీ లు, మెత్తగా ,పువ్వులాగా ,నోట్లో వేసుకుంటే కరిగి పోయేలా ఉండాలిట.


మహేష్ కోరికలు ఇవి..ఇలా లేక పోతే , అయిష్టం ,మొహం లోనే కాదు ,మాటల్లో కూడా చెప్పడానికి మొహమాట పడడు..


అబ్బ, అబ్బాయి అయితే, చాలా,ఇన్ని కోరికలు తీర్చు కోవచ్చా?? నా కోరికలు ఏమిటో ,నన్ను ఒక్క రోజు అడగలేదు, చెప్పనివ్వ లేదు..


ఇడ్లీ లు అలాగే ఉండేవి, అమ్మ చేసేవి.అయిన నేను ఎప్పుడు వెళ్లి చూసేను, వంటింట్లోకి .ఎలా చేస్తారో?.


ఎప్పుడూ చదువు, లేకపోతే స్నేహితురాళ్ళ తో, సినిమాలు, షికార్లు, నాన్న ముద్దు, ఆడ పిల్ల .ఏమీ అనకు..మా అమ్మే అది, అంటూ..ఎంత ముద్దు చేసే వారో?


అలాంటిది, ఈ పెళ్లి ఎలా జరిగింది?? 


అయినా నాది తప్పే, సివిల్ ఇంజేనీరింగ్ చదివింది ,కాని, ఉద్యోగ ప్రయత్నాలు ,పెద్దగా చేయలేదు, అమ్మయ్య చదువు అయింది అంటూ, హాయిగా రెస్ట్ తీసుకుందాం అనుకుంది..


అయినా , ఏమంత శ్రద్ధ గా చదివింది ? ఆ చదువు కూడా..ఎప్పుడూ, ఫ్రెండ్స్ ,కబుర్లు, ఎలాగో, ఫస్ట్ క్లాసు అనిపించు కుంది..చదువు అయ్యాక ,అనిపించింది, స్కూల్ లో బాగానే చదివేది కదా, ఎందుకని ,ఇంకా కష్టపడి చదవ లేదు, ఈ ఇంజనీరింగ్? 


ఏమిటో? అంతా ఒక కల లాగ గడిచి పోయింది, కాలేజ్ బస్సు లో ,ఒక గంట ప్రయాణం, ఆడ పిల్లలు, మగ పిల్లలు, కలిసి ప్రయాణం..ఇంక, ఆ కబుర్లు, సరదా ,సందడి..ఏదో పిక్నిక్ కి వెళుతున్నట్టు..ఎంత హాయిగా గడిచి పోయాయి, ఆ నాలుగేళ్ళు?


డిగ్రీ అవగానే, నాన్న అడిగేరు, ఏం చేస్తావు అమ్మా సుధా ?అని..


ఏమిటో? తను ఏమీ సరి అయిన జవాబు ఇవ్వలేదు, గమ్యం లేని చదువు చదివి ,అలసి పోయెను. ఇప్పుడిప్పుడే, ఇంక కొంచం శ్రద్ధ గా చదివి ఉంటే బాగుండేది అనిపిస్తోంది.


అమ్మ అప్పటికి చెపుతూ ఉండేది, సుధా..చదువు చాల ముఖ్యం అమ్మా..అని,నాకేమిటో..అమ్మ చాదస్తం గా చెపుతుంది అనిపించింది.


ఇంతలో, నాన్న గారి ,ఫ్రెండ్, ఈ సంబంధం తెచ్చేరు.


మహేష్ పేరు, ఒడ్డు, పొడుగు, నా కన్నా ఎక్కువే, సాఫ్ట్ వేర్ ఇంజినీర్, హైదరాబాద్ లో ఉద్యోగం, ఒక్క చెల్లి, పెళ్లి అయిపొయింది, తల్లి తండ్రులు ఏలూరు లో ఉంటారు, వారికీ అక్కడ ఇల్లు అవీ ఉన్నాయి, పెద్దగా ఏమీ బాధ్యతలు లేవు, అన్ని విధాల , వంక లేని సంబంధం.


నాకు కాదు అనడానికి..ఏమీ కారణం కనిపించలేదు..


పెళ్లి అనగానే, ఎక్కడలేని, హుషారు వచ్చింది.


హమ్మయ్య ..నా ఇల్లు, నా ఇష్టం వచ్చినట్టు తీర్చి దిద్దుకుంటాను, షికారులు తిరుగుతాం, ప్రేమించుకుంటాం..పెళ్లి తరువాతే ప్రేమ..అని నా మనసు లో ఎప్పుడో నిర్ణయం అయిపొయింది..మా క్లాస్ లో ఇద్దరు, ముగ్గురు, ప్రేమించి, పెళ్లి, కి తయారు యేరు ,కాని నాకు ఎప్పుడూ ఆ ఆలోచనే లేదు.


పెళ్లి డేట్ ,కుదరగానే, ఇంక అమ్మ నేను, ఎంత షాపింగ్ చేసేమో, పట్టు చీరలు, మామూలు చీరలు, డ్రెస్సులు, మాచింగ్ చెప్పులు, స్టికేర్ దగ్గర నించి అన్ని, మాచింగ్ వి కొనడానికి ,ఎన్ని షాపింగ్ లు చేసేమో?


నాకయితే, షాపింగ్ అంటేనే విరక్తి, తల నొప్పి వచ్చింది, అంతలా తిరిగేం..ఇంక తరువాత పెళ్లి కార్డ్లు ల ఎంపిక..నాకు నచ్చింది..అమ్మ కి నచ్చదు, నాన్నకి నచ్చింది, నాకు నచ్చదు..ముగ్గురికి నచ్చింది, కుదరడానికి ,వారం రోజులు పట్టింది.


హ్మం..మహేష్ ..నా జీవితానికి ..ఇంక జీవితాంతం తోడూ..అతని ఎన్నిక లో ఎందుకు తొందర పడ్డామో?


అయినా ,అమ్మ ,నాన్న గారలది..పెద్దలు కుదిర్చిన సంబంధమే..ఏమిటో ఎక్కడ తప్పిందో మాచింగ్..??


పెళ్లి లోనే తెలిసింది, నా ఫ్రెండ్స్ వేసే జోక్స్ కి విసుగ్గా పెట్టేడు మొహం..అతనికి అన్నీ పధ్ధతి గా ఉండాలి అమ్మా..నేను చేసేవి కూడా నచ్చేవి కావు, ఏమిటమ్మా ,ఇలా చేసేవు? అనేవాడు..చిన్నప్పుడు కూడా ,అని మురిపం గా చెప్పేరు మా అత్తగారు.


"నీ భార్య వచ్చాక ,నీకు ఇష్టమయినట్టు ,చేయించు కో రా మహేశు ..ఇంత కన్నా నేను చేసి పెట్టలేను నీకు "అనే దాన్ని.


నాకు గుండె గొంతు లోకి వచ్చింది.


నేను ఇప్పుడు ,అన్నీ పద్దతిగా, చక్కగా వంటలు అవీ వండి పెట్టి, ఇల్లు సద్ది, మంచి పేరు సంపాదించు కోవాలా?
అయ్యో, చక్కగా చదివి, ఉద్యోగం ఎందుకు చేయలేదు? అదే తేలిక గా ఉండేదే?


అయినా ,నేను, ఇంటర్ నెట్ నించి, వంటలు అన్నీ నేర్చుకుని, ఒక్క ఆరు నెల లో, ఫైవ్ స్టార్ చెఫ్ ,కాక పోయినా, బాగానే నేర్చు కున్నాను.


అయినా ఎప్పుడూ వంకలు పెట్టడమే ..వంకాయ కారం పెట్టి కూర చేస్తే, ఇంత పొడి, పొడి, గా ఉందేమిటి? నూనె పొయ్యాలి ఇంకాస్త, ఇదేమిటి? ఇప్పుడు అందరూ నూనెలు అవీ తగ్గించ మంటున్నారు కదా, అని నేను ఎంతో జాగ్రత్తగా ,చేసేను, రుచి ఏమీ తగ్గలేదు..నాయితే, ఎంత కమ్మ గా ఉందొ? 


ఏమిటి ఈ మనిషి..


అయినా ఇలా వంటలు చేసుకుంటూ, నేనేమిటి ఇలా కూర్చున్నాను, ఇంతేనా జీవితం అనుకుని, ఒక రోజు, నేను ఉద్యోగం చేస్తాను ..అని ప్రకటించెను.


నీ ఇష్టం..నేను ఇంటికి వచ్చేసరికి ,నువ్వు ఇంట్లో ఉండాలి, అలా మూసి ఉన్న తలుపులు ,తెరుచుకుని, ఇంట్లో కి రావడం ,నాకు అస్సలు ఇష్టం లేదు.


నాకు రుచులు, ఎక్కువ, నీకు తెలుసు కదా..నాకు ఏమీ లోటు ఉండకూడదు.నేను అందరి లాంటి వాడిని కాదు..


నేను అయినా ,నిన్ను ఏం బాధ పెడుతున్నాను? నువ్వు అడక్కుండానే ,అన్నీ కొని పెడుతున్నాను, సొంత ఇల్లు ఉంది, ఇదిగో వచ్చే నెల కార్ కూడా కొంటున్నాను..


నాకు తెలియకుండానే, నన్ను అడగ కుండానే, నా ఇష్టం తో పని లేకుండా ,అన్నీ జరిగి పోతాయి..


ఏమిటో, నేను ఒక పెద్ద తప్పు చేసేను..అని అర్ధం అయింది, నా జీవితం గురించి ,ఎంత తేలికగా ,నిర్ణయం తీసుకున్నానో?
నా ప్రమేయం లేని ,నా జీవితం..ఇది.


నలుచదరం గా ఉన్న దాన్ని ,గుండ్రం గా ఉన్న దాంట్లో పెట్టడానికి ,ప్రయత్నిస్తే, అది ఒక వస్తువు అయినా, దానికి గాయం తప్పదు, అలాంటిది, నా మనసు , నా వ్యక్తిత్వం..విషయం..లో జరుగుతోంది.


నేను ,అనే నేను చివరికి మిగులుతానా? ఈ జీవితం జీవిన్చేసరికి..మహేష్ భార్య గా నేను ,జీవించ డానికి..నేను ఎన్ని కోల్పోవాలో?


ఇంత కోలోపోవాలా నేను? లేదా నేనే ఎక్కువ ఆలోచిస్తున్నానా?


ఇంక రేపొద్దున్న ఒక పిల్లాడు, అమ్మో ఒక పిల్ల పుడితే ఎలా ఉంటుంది?
ఏదుచు కుంటూ పుట్టిల్లు చేరుకునే ఉద్దేశం లేదు నాకు.


ఈ ఉద్యోగం మాట ,ఎత్తినప్పట్నించి. ..మరీ దుర్భాలం గా ఉంది..


అందుకే ఈ తల నొప్పి, మనసు గాయపడితే, శరీరం కూడా నలిగి పోతుంది కదా..


మహేష్ ..టిఫిన్ రెడి ఏనా??


ఆ ఒక్క నిముషం..నేను ఒక ప్లేట్ లో ..


రెండు దోసెలు, రెండు పచ్చళ్ళు, ఒక కారప్పొడి, మీద నెయ్యి వేసి, ఇంకో చేత్తో గ్లాస్ లో నీళ్ళు .తెచ్చి టేబిల్ మీద పెట్టి.


" నేను ఉద్యోగం చేయక తప్పదు అండీ, నేను ఏదో ఒక ఉద్యోగం చేస్తాను, కనీసం పిల్లలకి టీచెర్ గా ..మీకు ఇష్టం ఉన్నా..లేక పోయినా సరే, లేక పోతే నాకు పిచ్చి ఎక్కుతుంది, నేను ఇలాగ వంటలు వండుతూ ,ఇంట్లో కూర్చో లేను, మీరు చెప్పినవన్నీ వండి పెడుతూ , ఇంట్లో కూర్చోడానికి నేను ,ఏమీ చదువు లేని, ఆలోచన లేని మొద్దు ని కాదండి..ఒక ఆలోచన, మనసు ఉన్నస్త్రీ నండి..మీకు ఒక వంటలు చేసే వంటలక్క ఒక్కటే కాదు, మిమ్మలిని ప్రేమించే ,గవురవించే భార్య మీకు కావలి అనుకుంటే, ఒప్పుకొంది, లేదా నేను ఇంక ఇక్కడ ఉండలేను"


అని మనసు లో మాట చెప్పి, నా గది లోకి వెళ్లి పడుకున్నాను..


ఈ తల నొప్పి తగ్గాలంటే, నిద్ర ఒక్కటే మందు,
నా మనసు లో గాయం కి మందు, మటుకు మందు  మెలకువే..
నా ..అన్న వేకువ లోకి మెలకువ.


ఇంక నిర్ణయం అతనిదే.." నాకేం తక్కువో"
అర్ధం అయితే, ఒప్పుకుంటాడు..అన్న ఆలోచన ..ఆఖరి ఆలోచన ,సుధ నిద్ర లోకి జారుకుంది..





















8 మార్చి, 2012

woman's day..

ఎక్కడ స్త్రీ పూజింప బడుతుందో.
ఎక్కడ స్త్రీ కన్నీళ్ళు కార్చదో.
ఎక్కడ స్త్రీ , అందం గా, ఆనందం గా,
తన జీవితం మలుచు కుంటుందో,

ఆ పుడమి మీదకి, ఆ స్వర్గం లోకి,
దేవుడా..స్త్రీ కి జన్మ నివ్వు..
దేవుడు కూడా మగ వాడేనా?
అందుకేనా పురిటి నొప్పులు 

నవ జాత శిశువు ఆకలి 
భారం ,అమ్మ కి ఇచ్చి,
అంతులేని సుఖం మటుకు 
మగవాడికి ఇచ్చేవు?

చెప్పులు వేసుకుని ,ఇంటి 
గడప దాటాలంటే, ఎన్ని గడపలు
పెట్టేరు? ప్రకృతి లో పువ్వు తో
పోలిక పెట్టేరు, ముళ్ళు లాంటి 

మగ వారే ,ఆమె కి రక్షణ 
పెట్టేరు, పిల్లలే ఆమె కాళ్ళకి
బంధాలు యేరు, ఆమె లేని 
ఒక్క రోజు కూడా ,ఇల్లు గడవదు.

కానీ, సంపాదన మీద అధికారం
ఆమె ది కాదు, నువ్వు, షోకులు 
సింగారాలు చేస్తావు, అని వెక్కిరించి,
ఏమిటలా మసి గుడ్డ లాగా ,అలా ఉన్నావు?

అని వెక్కిరించే ,మగ వారె, ఆమెకి,
ఇంట అండ..ఉద్యోగాల లో రాణిస్తే.
నువ్వు స్త్రీ వి కదా, అని వెటకారం..
అతను సృష్టించిన అడవిని ఆమె 

జయిస్తే, అది కూడా ఒక అవకాశమే,
అందాల ప్రదర్శనే..అని చేత్కారం.
అందుకే స్త్రీ కంట నీరు చిందని 
ఆ రోజే, మన వొమన్ డే ,,

కానీ, ఈ ఎనిమిదో తారీఖునే 
కాదు, స్త్రీ అంటే, పుడమే,
నిన్ను మోసే అమ్మే,
నీ ఆకలి తీర్చే అమ్మే..

ఆమె ని గౌరవించడం 
నీకు ఒక అలవాటు, ఒక సాధన 
కావాలి, స్త్రీ కంట కన్నీరు కు
నువ్వు ఎప్పటికి కారణం కాకు..

అప్పుడే, అప్పుడే, 
జనని, అవని, అన్నపూర్ణ,
లక్ష పేర్లతో కొలవడం కాదు 
ముఖ్యం, నీ మనసుని 

శుద్ధి చేసుకో, పాత..భావ 
జాలం నించి, బయట పడి,
ఆడ పిల్లని ఆహ్వానించు 
నీ ఇంటి లోకి, నీ మది లోకి..

వొమన్'స డే..కోసం..అందరికి..




6 మార్చి, 2012

మధూలిక

నేను అవాక్కయాను  ఈ వార్త విని,ఇది నిజమా? మధూలిక పెళ్ళా?
అదీ ఇంత తక్కువ సమయం లో, డిగ్రీ తీసుకుని ఎంత కాలం అయింది? మూడు నెలలు..హ్మ్మం..ఇది నిజం గ మూడో ప్రపంచ యుద్ధం కన్నా గొప్ప సంచలన వార్తే..


మేం ముగ్గురం, చిక్కని ,తీయని స్నేహితం రుచి చూస్తున్న చిన్ననాటి స్నేహితురాళ్ళం. మా ముగ్గురిలో మధూ , తెలివైనది, చదువు అంటే నిజమైన అభిరుచి, అసలు తన ప్రోద్భలం తోనే ,నేను, జ్యోతి ఏలూరు లో డిగ్రీ అవగానే ,విశాఖ లో పీ జీ చేయడానికి వచ్చాం.


డిగ్రీ అవగానే ,నేను జ్యోతి ,హమ్మయ్య..ఇంక చదువు అయిపొయింది..ఇంక ఇంట్లో కూర్చుని, హాయిగా పుస్తకాలు చదువుకుంటూ, సినిమాలు చూస్తూ    , అమ్మ దగ్గర..మంచి ,మంచి వంటలు నేర్చుకుంటూ..ఇంక వైవాహిక జీవితానికి తయారు అయి పోదాం..అనే సగటు ఆడ పిల్లలం..


నాకు గుర్తు ఉంది..రెండేళ్ళ క్రితం ,మా మధూ మాకు ఇచ్చిన ఉపన్యాసం.
" మీకు అసలు బుద్ధి ఉందా? అప్పుడే చదువు అయిపోయిందా? మీకు..ఇంట్లో కూర్చుంటారా? చదువు కి అసలు అంతం ఉందా? జ్యోతి, నీకయినా బుద్ధి లేదే? సరళ అంటే పోనీ, ఇంట్లో పరిస్థితులు ఎలా ఉన్నాయో మనకి తెలుసు కదా? కాని, మీ నాన్న గారికి బ్యాంకు లో మంచి ఉద్యోగం..నువ్వు ఎంత వరకూ చదివితే అంత వరకూ చదివించ గలరు.."


"అసలు చదువు అంటే ఏమిటో? మీకు తెలుసా? చదువు ఎంత వికాసం ఇస్తుందే..చూడు మన పక్కింట్లో ఉండే వకుళ అక్క? పీ జి చేసింది, ఎంత ధైర్యం గా ఉంటుందో..విశాఖ పట్నం లో ఆంధ్ర యూనివెర్సిటి గురించి ఎంత చెప్పిందో? దూరం గా సముద్రం కనిపిస్తూ, కాంపస్ అంతా మొక్కలు, చెట్లు, తో పచ్చని వాతావరణం లో ,హాయిగా ప్రశాంతం గా ఉంటుందని,సరదా సరదా గా ఉంటుందని చెప్పా లేదూ.."


నేనూ ,జ్యోతి ఒకరి మొహాలు ఒకరం చూసుకున్నాం..ఇంకా చదువా? క్లాసు లో ఆ పాఠాలు వినడం, పడి పడి , పరీక్షల ముందు చదివి, చదివినది మర్చి పోకుండా ,పరీక్ష పేపర్ మీద రాయడం, ఆ మూడు గంటల లో వ్రాసిన దాని బట్టి  ,మా మార్కులు, ఫలితాలు, ఇదేనా చదువు అంటే..మా కేమి అంత మోజుగా, సరదాగా లేదు, ఈ చదువులు చదవడం. ఏదో ఒక డిగ్రీ వస్తుంది, చాలదా? ఇంకా ఏమిటి?


ఇద్దరం అదే అడిగాం..దానికి మధూ చెప్పిన సమాధానం నాకు ఇంకా గుర్తు ఉంది.ప్రతి పదం ..మది లో చెక్కినట్టు...


" సరళా..జ్యోతీ..మీకు నేను చెప్పలేదే, నా చిన్నతనం లో, చాల అర కొర..సదుపాయాలతో ,మా మామ్మ , తాత గారి ఇంట్లో గడిచింది..మా మామ్మ ని ఆసుపత్రి లో వేసేరు, పక్ష వాతం ..వచ్చి పడి పోతే..
ఓ రోజు, నేను ఉదయమే..మామ్మకి సాయం పడుకున్న మా అమ్మగారికి ,కాఫీ పట్టుకెళుతున్నాను ఫ్లాస్క్ లో, ఉన్న ఒక జత చెప్పులు లో ,ఓ చెప్పు తెగి పోవడం తో, ఉత్తి కాళ్ళ తోనే నడుస్తున్నాను..ఇంతలో,నా పక్కనే ఓ కార్ ఆగింది, అందులో, మా క్లాసు మేట్ 'అమర్' వాళ్ళ అమ్మ గారు డాక్టర్ రమణి ఉన్నారు..నాకు ఆవిడ తెలుసు, నేను ఆవిడకి తెలియక పోవచ్చు..


"ఎక్కమ్మా కార్ లో, చిన్న పిల్లవి, నిన్ను దింపేస్తాం "..అని," ఎక్కడికి వెళ్ళాలి"  రాజేంద్ర ప్రసాద్ వార్డ్ కి అని చెప్పేను..


నన్ను దింపేస్తూ  "నువ్వు నాకు తెలుసు, మధూలిక కదా..బాగా చదువుతావు అని మా అమర్ ఎప్పుడూ చెపుతాడు..బాగా చదువుకో అమ్మా..మధూ..నువ్వు పెద్ద అయాక ఇలాగే కార్ లో తిరుగుతావు..చదువు వల్లే అన్ని వస్తాయి.." అంటూ నన్ను భుజం తట్టి, అక్కడ దింపేసి వెళ్లి పోయారు.వెళ్లి పోతూ ఆవిడ నా వట్టి కాళ్ళ వేపు చూసిన చూపు ,నన్ను వెంటాడుతూనే ఉంది.


ఆ రోజు నించి, చదువు అంటే అంటే నాకు పిచ్చి..చదువు కుంటే,మనం ఎంతో, ఎన్నో సాధించ వచ్చు..డిగ్రీ అంటే ఒక మెట్టు..మనం ఎక్కవలసిన మెట్లు ఇంకా చాల ఉన్నాయి, యూనివెర్సిటీ లో చదువు ఇంకా బాగుంటుంది..మనం ఎలాగో ఒక లాగా ఒప్పిద్దాం ,మన తల్లి తండ్రులని..


ఏమిటో,మధూ చెప్పిన ఆ ఉదంతం మమ్మలిని కూడా కదిలించింది. ఎప్పటిదో ,అయినా తన బాధ మా బాధ, తన కసి మా కసి చేసుకుని, ముగురం ,ఇంట్లో వాళ్ళని ఒప్పించి, ఫిజిక్స్ లో పీ జి చేయడానికి ,విశాఖ పట్నం వచ్చెం.


ఇక్కడ కూడా మంచి స్నేహితుల ని సంపదించేం  కానీ, మా స్నేహం..మటుకు గట్టిగ వేళ్ళు నుకుని ,వట వృక్షం లాగా అయిపొయింది.


ముగ్గురు మరాఠీలు అన్నా..త్రిమూర్తులు  స్త్రీ లింగం.. లో అన్నా..మేం ఒకటే ప్రాణం ,ఒకటే శరీరం అన్నట్టు..ఎలా తిరిగే వాళ్ళమో?


చూస్తుండ గానే మా ఉన్నత చదువులు కూడా అయిపోయి, ఇంక వెనక్కి వెళ్ళే సమయం వచ్చేసింది.


నేను కాలేజ్ లో లెక్చరర్ గా పని చేయాలని నిశ్చయం చేసుకున్నాను, మంచి లెక్చరర్ అని పేరు తెచ్చు కోవాలని ,మనసులో గట్టిగా నిర్ణయించుకున్నాను.


జ్యోతీ ,బ్యాంకు పరీక్షలు రాసి, వాళ్ళ నాన్న గారి లాగే..ఆఫీసర్ అవాలని నిర్ణయం తో,బ్యాంకు  పరీక్షలకి చదవడం   మొదలు పెట్టింది.


మేం ఇద్దరం ఏలూరు లో ఉన్నాం..


ఇంతలో ఈ కబురు.


మధూలిక పెద్దమ్మ పిల్లలు ,అక్కడ ఉండడం తో, వారితో కొంచం సమయం గడిపి వస్తాను ,తరువాత ఏం చేయాలో కూడా ఆలోచించాలి అని వైజాగ్ లోనే ఉండి పోయింది.


మధూలిక ఏలూరు వచ్చింది అని తెలుసుకుని, నేను జ్యోతీ, ఆవేశం గా తన మీదకి దాడి చేయడానికి బయలు దేరాం.


తను నవ్వుతూ ఎదురు వచ్చింది.


మీరు ఏమంటారో నాకు తెలుసు..


ఉండండి. అంటూ.. ఒక చిన్న కాగితం పట్టుకు వచ్చి చూపించింది.


అదీ ఒక అప్లికేషన్ ఫోరం లాగా ఉంది.


పేరు..మధూలిక,
చదువు..Msc ఇన్ ఫిజిక్స్.
తల్లి తండ్రులు...లక్ష్మి, నారాయణ .
ఇతర కుటుంబ సభ్యులు..ఇద్దరు చెల్లెళ్ళు, ఒక తమ్ముడు.
ఉద్యోగం...భార్య పదవి..


ఇలా ఉంది, దాని మీద, అవాక్కయాం..మధూ చెప్పడం మొదలు పెట్టింది .


నేను లైబ్రరీ లో కూర్చుని, జాబ్ కోసం ప్రయత్నాలు మొదలు పెట్టాలి, నాన్న గారికి ఇంక భారం కాకూడదు అని ,ఆలోచిస్తూ, వార్తా పత్రికలు తిరగేస్తూ కూర్చున్నాను.


నా పక్కనే..కూర్చున్న ఒక అందమయిన యువకుడు, చెయ్యి చాచి..
'మధూలిక'? అన్నాడు..అప్రయత్నం గా తిరిగి చూసాను,
'అమర్' అన్నాడు, చెయ్యి చాచి..


చిన్న నాటి క్లాసు మేట్..నేను ఎలా మర్చి పోతాను? అతని అమ్మగారు ,నా చదువు కి, నాలో కసి పెంచడానికి దోహదం అయారు కదా..


చిరునవ్వు తో "అమర్..చాల మారిపోయావు, నేనూ మారి ఉంటాను లే.."
అన్నాను.


"నేను నిన్ను రెండు మూడు సార్లు చూసాను, కాంపస్ లో,పలకరించుదాం అంటే   గోడ లాగ నిన్ను అంటి పెట్టుకుని నీ స్నేహితురాళ్ళు ఉండే వారు..నేను ఎమ్బియే చేసాను, ఉద్యోగం కూడా వచ్చింది.."


"బొంబాయి లో ఉద్యోగం ..మా అమ్మగారు నీకు గుర్తు ఉన్నారు కదా.నాన్న గారు పోయేరు, అమ్మ క్లినిక్ చూసుకుంటోంది ఇప్పుడు, అక్క అమల కి పెళ్లి అయిపొయింది.."


"నాకు ఎక్కువ సమయం లేదు, నన్ను పెళ్లి చేసుకుంటావా? "అని అడిగేడు..నేను స్టన్ అయిపోయేను..


వెంటనే, ఏమి ఆలోచన లేకుండా..సరే..అన్నాను..


నాకే ఆశ్చర్యం వేసింది..


అతని అమ్మ గారు గుర్తు వచ్చేరు..చదువు కుంటే..చాల బాగుంటుంది, జీవితం లో పైకి రావచ్చు అని చెప్పేరు..నాకు ఆ ఒక్క మాటే గుర్తు, నన్ను నడిపించింది ఆ మాటే, సరే, ఆవిడ కోడలు అవడమే ఒక వృత్తం పూర్తి అయినట్టు అనిపించింది.


అమర్ సంతోషం తో ఉబ్బి తబ్బిబ్బు అయాడు, నాకు నువ్వంటే చిన్నప్పటి నించి ఇష్టం, నీకు కూడా ఇష్టమేనా? అని ఆశ్చర్యం గా అడిగితే..


అవును..అని ధైర్యం గా అబద్ధం చెప్పేసాను..మీ అమ్మ గారు అంటే, అని మనసులో అనుకుని..


హా అని అరుస్తూ, ఈ కబురు అమ్మకి చెప్పాలి అని గెంతు కుంటూ అమర్ వెళ్లి పోయాక, నేను కూర్చుని, నాతో తెచ్చుకున్న తెల్ల కాగితం మీద ఇలా రాసుకున్నాను.


హు..మధూ, చదువు గొప్ప ఫలితాలు ఇస్తుంది, జీవితం లో పైకి వస్తావు అంటే, ఇదా..అని మీరు అంటారు..కానీ, నాకయితే, ఇలా ఒక మంచి కుటుంబం లో స్థిర పడడం కూడా..ఒక మంచి పరిణామమే..అనిపించింది..అందుకే ఇంకేమి ఆలోచించక ఒప్పేసుకున్నాను, అమర్ కి ఏం తక్కువ? ప్రేమ..అలాంటి వి, పెళ్లి అయాక ,అవే పుడతాయి..


అని ధైర్యం గా మాకు సమాధానం ఇచ్చి పెళ్లి చేసుకుంది మధూ ..


ఇదంతా జరిగి, ముప్ఫై ఏళ్ళు అయింది.


నేను లెక్చరర్ నించి ప్రిన్సిపాల్ అయాను., పెళ్లి మటుకు చేసుకోలేదు, ఎవరూ నచ్చక, తరువాత వయసు వచ్చి, నేను కోరుకున్నా ,నాకు ఎవరూ దొరకక.


జ్యోతీ పెళ్లి చేసుకుంది, బ్యాంకు ఆఫీసర్ కూడా అయింది, అతను ఒక ఆక్సిడెంట్ లో పోయేడు, ఇద్దరు పిల్లల ని చక్కగా పెంచింది.


మధ్యలో , సరిగ్గా చెప్పాలంటే, రెండు దశాబ్దాలు ,మేం కలుసు కోవడం అవనే లేదు,జ్యోతి హైదరాబాద్ లో ఉన్నది ,అని తెలుసు, మధూ, అమర్ తో, బొంబాయి, తరవాత అమెరికా ,వెళ్లిందని తెలిసింది, ఇద్దరు అబ్బయలు. తనకి, ఇలా ,ఏవో అర కొర సంగతులు తెలుస్తూనే ఉన్నాయి.


ఈ మధ్యే ,ఈ ఇంటర్ నెట్ మూలం గా మేం ముగ్గురం కలుసు కున్నాం.జ్యోతి ,కూతురి పెళ్లి కి తప్పకుండా వస్తాను ,అని చెప్పినట్టే మధూ వచ్చింది.


ఈ రోజు మేం ముగ్గురం కలుసుకున్నాం..


మధూ..మధూ ఏనా? లావుగా, నగలు నిండు గా వేసుకుని, పెద్ద పట్టు చీర లో, పెద్ద దాని లా ఉంది.


చేతులు పట్టుకుని అలా ఉండి పోయేం..కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి, ముగ్గురికి..మధూ అంది..చదువు ని మీరు సార్ధకం చేసుకున్నారు.
నేను చాల సంతోషం గానే ఉన్నాను, కాని, ఏదో లోటు..ఉద్యోగం చేయడం కుదరలేదు, అమర్ ఉద్యోగ బాధ్యతలు తో ,ఎన్నో దేశాలు తిరిగేం.


మీరు ఇద్దరూ.చక్కగా స్థిర పడ్డారు...నా ఆలోచనే గొప్పది.. చదువే అలంకారం ,అని నిరూపించేరు,నా నగల అలంకారం .దిగదిడుపే..మీరు సాధించిన విజయాల ముందు ,అని మనస్ఫూర్తి గా అభినందించింది..


నువ్వు ప్రేరేపించిన విద్యే..మధూ..అని చేతులు విడవ కుండా పట్టుకున్నాను ..మమ్మల్ని ఈ రోజు ఈ స్థితి లో ఉంచింది..చదువు ఎప్పటికి చెరుపు చేయదే..నువ్వు సంతోషం గా ఉన్నావు కదా, అంతే చాలు..అంటూ కబుర్ల లో పడి పోయేం..ఒక వృత్తం పూర్తి అయింది..జీవిత చక్రం..లో వృత్తాలు అలా చుట్టుకుని పోతూ ఉంటాయి..అని ఆలోచన లతో, ముగ్గురం ..ఒకరి కళ్ళ లోకి ఒకరు చూసుకుంటూ, ఉండిపోయాం.


మధూలిక మా చదువులకి, మా భవిష్యత్తులకి, పునాది. మా చేతులు పట్టుకుని నడిపించిన స్నేహ మూర్తి..మధూలిక ని మేం ఎప్పటికి వదలలెం అనుకుంటూ ఈ క్షణం మరపు రానిది అని ఆస్వాదిస్తూ..మేం త్రిమూర్తులం..ముగ్గురు మరాఠీలమే ..ఎప్పటికి...మరి..అనుకుంటూ కదిలాం..