"http://www.jalleda.com/images/jalleda3d48x32.png">

19 సెప్టెం, 2014

'కౌగిలి 'ముక్తవరం పార్ధ సారధి..వ్రాసిన చిన్న నవల.
చదివితే మనసు కలత చెంది, ఈ వివాహ వ్యవస్థ ఒక మగవానికి ఎంత అండ గా ఉంటుందో ,ఒక స్త్రీ భార్య గా మారేక, చేసిన అనేక త్యాగాలు, మార్పులు ఆమె జీవితం లో ఎలా అతలాకుతలం చేస్తాయొ, ఇంకా ఆ పై, అమ్మ గా ఆమె శరీరం ఎలా శిధిలం అవుతుందో ,ఆవిడ చివరికి దీనం గా ఎలా ఒంటరి గా నిలబడతుందో.. అన్ని ఎవరొ మనకి విడమర్చి చెప్పినట్టు అర్ధం అవుతుంది.

మీకేం తక్కువ? అంటూ, చీరలు, నగలు, మొదలైన సుఖాలతో ఆమె నవ జీవితం లో ధుఖాన్ని, అసమానతలని కప్పి పుచ్చేలా ,ఈ సమాజం మగవానికి అండ గా నిలుస్తుందో మనకి కనువిప్పు అవుతుంది.

మనోరమ ,బాలు ఒకే ఆఫీసు లో ఉద్యోగాలు చేస్తూ ఉంటారు. బాలు ఒక ఏడాది  ఆమె చుట్టూ తిరిగి, పెళ్ళి చేసుకుంటాడు . మనోరమ ఒక మధ్య తరగతి అమ్మాయి, ఒక చెల్లి, తమ్ముడు..తల్లి తండ్రులు ఆమె కుటుంబం.

విచిత్రమైన కుటుంబం, తండ్రి పెద్దగా ఇంటి గురించి పట్టించుకోడు, అందువల్లనేమో అందరూ బాధ్యతా రహితం గా తోస్తారు బాలు కి .
మాట్నీలు, రాత్రి అంతా పేకాటలు, ఎప్పుడు పడితే అప్పుడు కాఫీలు, ఈ వాతావరణం బాలు కి కొత్త .
బాలు వేసే లెక్కలు, పొదుపు ఖర్చులు, సమయ పాలన , ప్లానింగ్ ,మనోరమ కి కొత్త, ఆమె కి కొత్త, ఆమె కి ఫడవు.

పెళ్ళి కొత్త మోజు తీరేక, చిన్న చిన్నగా గొడవలు మొదలవుతాయి. మనోరమ జీతం లో అన్నీ కోతలే, ఎప్పుడు, ఎందుకు చేసావు ఇన్ని అప్పులు అన్న దానికి ఆమె దగార నుంచి సమాధానం ఉండదు.
ఆఫీసు కి అంత అలంకరణ ఎందుకు? అందరితో అంత చనువు ఎందుకు? అని బాలు కి కోపం, విసుగు.
అతనికి ఉద్యోగం లో పైకి రావాలని తీవ్రమైన కోరిక.

మనోరమ మీద కోపం తో కుటుంబ నియంత్రణ పద్దతులు పాటించక ఆమె ని గర్భవతి ని చేస్తాడు.

రచయిత వాక్యం ఒక చోట..మనుషులు పరస్పరం వాడుకుంటారు.

ఒక పిల్లవాడు పుట్టేక, ఆమె మరింత చికాకు పడుతూ ఉంటుంది, తను తల్లినవడానికి మానసికం గా సిద్ధం కాలేదు
అని ఆమె బాధ. తల్లి అయేక ఆమె మరింత బాధ్యత గా ఉంటుంది అని బాలు ఆలోచన.
కలకత్తా లో ఏదో ట్రైనింగ్ అని చెప్పి నెల రోజులు, చంటి పిల్లాడితో వదిలి వెళ్ళిపోతాడు. తన ఉద్యోగం , పైకి వెళ్ళడం అతని ముఖ్యమైన విషయాలు జీవితం లో, భార్య, పిల్లాడు, కుటుంబం అన్నీ తరవాతే ..

మధ్యలో మరో అబార్షను , మనోరమ ఆరోగ్యం మరింత దిగ జారుతుంది.
అతను పట్టించుకోడు, మళ్ళి ఆమే ఇంటికి వస్తుంది.
మరో సారి గర్భం.. ఒక అనుకోని ఘటన తో ఎనిమిదో నెలలో పాప పుడుతుంది. ఆమె మెదడు కి దెబ్బ తగిలి, బుద్ధి మాంద్యం పిల్ల గా పుడుతుంది.

మనోరమ లో అప్పటి వరకు లేని మాతృత్వం పొంగి ,కూతురిని ఎలాగైనా నయం చేసుకోవాలని తాపత్రయ
పడుతూ ఉంటుంది. బాలు కౄరం  గా ఈ పిల్ల బ్రతకడం దండగ అంటూ ఉంటాదు. ఆమె కన్నీరు పెట్టుకుంటూ ,వైద్యం కి సాయం చేయమని బ్రతిమాలుకుంటుంది. ఆరోగ్యం పూర్తిగా పాడై పోయి, సన్నాగా పుల్ల లా తయారు అవుతుంది. అలాంటి ఆమె ని తన ఖర్మానికి తనను వదిలేసి, బొంబాయి కి బదిలీ అయిందని చెప్పి, కొడుకు ని తీసుకుని వెళ్ళిపోతాడు.
ఆమె ఉద్యోగం కి ఈ బదిలీ సౌకర్యం లేదు అని జవాబు, ఆమె అతనితో వస్తాను అంటే..

అక్కడితో నవల అయిపోతుంది.

కానీ ఆలొచనలు ముసురుకొని, ఏమిటి ఇంత అన్యాయమా? వివాహ వ్యవస్థ లో క్రౌర్యం  మనకి లీలగా అర్ధం
అవుతుంది. మగ వాని ఆరొగ్యం, మనసు, ఇంతగా చితికి పోవు, స్త్రీ మనసు నలిగినంత గా అతని కి బాధ లేదు అంతా సౌకర్యం గా ఉన్నంతవరకు అతనితో పేచీ లేదు. ఒంట్లో బాగో లేక పోయినా లేచి వంట చేసే స్త్రీ చాలా గొప్పదని మనకు నూరిపోసారు. అందుకే మనం అలా సాగుతూ ఉంటాం. దొంగ జబ్బులు అని వెటకారాలు, జబ్బు మనిషి ఎప్పుడూ మూలుగు తూ ఉంటావు అని ఆమె ని హేళన చేయడం.. నాకు ఒక్కోసారి అనిపిస్తుంది, ఆమె జబ్బులకి అసలు మందులు మాకులూ కూడా ఆలస్యం గానే కనుకొన్నారు అని..

రచయిత ఎక్కడా ఎవరి పాత్రని విమర్శించడు, అలా జరుగుతున్న సంఘటనలను చెప్పుకుంటూ పోతారు.

ఒకసారి బాలు  భార్యకి చెప్పి తన పై ఆఫీసరు ని భోజనానికి పిలుస్తాడు. ఆమె బయటకి వెళ్ళి ఇంటికి రాదు, విపరీతమైన కోపం తో ,తన ఉద్యోగం కోసం ఆమె ని వాడుకోవడానికి రాలేదు కాని, చక్కగా అలంకరించుకుని
,సహ ఉద్యోగులతో కులుకుతూ మాట్లాడుతుంది అనుకుంటాదు..
అంతే కదా.. ఒక స్త్రీ, ఎక్కడ ఎలా మసులుకోవాలో ,ఎలా అలంకరించుకోవాలో ,ఎవరి కోసమో అన్ని ఆమె కి చెపుతుంది ఈ సంఘం. మగ వారు చేసిన ఈ సంఘం. ఎంత అన్యాయం, ఎంత హింస ,కనపడని హింస.

నువ్వు సంఘం చెప్పు చేతల్లో ఉంటే అంతా శాంతి, ఒక్క అడుగు బయటకి పడినా రక రకాల పేర్లు, నీతులు
చెప్పడం..

ఆడవారిని కూడా ఈ కుట్ర  లో భాగం చేయడం.. వారి తెలివి కి నిదర్సనం.

స్త్రీ కి స్త్రీ యె శత్రువు అంటూ ,ఉసి గొలుపుతారు. దయచేసి ఆ మాయలో పడకండి. నేను ఈ నవల చాలా సార్లు చదివాను, నన్ను నేను తెలుసుకోవడానికి  ,నాకు చాలా ఉపయోగపడింది ఈ చిన్న నవల..

ముక్తవరం పార్ధసారధి  గారికి వందనాలు..

9 జులై, 2014

రెండు కవిత లు ..

స్టిల్ ఫోటో 

మనం ఇల్లు సద్దుకుందాం అనుకుంటూ ఉంటాం ..
ఇంతలో పిలుపు వస్తుంది ..
ఎక్కడ చదువుతున్నామో మడత పెట్టిన పుస్తకం అలా బోర్లించి .
అయ్యో పుస్తకం నలిగి పోతుంది ..ఐనా అలాగే చేస్తాం ..
అదే అలవాటు మరి ..
బీరువాలో ఒక కొత్త చీర ,ఇంకా అంచులు , జాకెట్టు కుట్టించలేదు
ఆఖాశం మీద చుక్కల్ల్లా గా ,ఎంత అందమైన పూలు చీర నిండా ,,
రేపటికి దాచుకున్నాను ..ఆ మంచి రోజు కోసం ..
ఆ పండగ కోసమే
అన్నీ అలాగే ఉంటాయి ..
నువ్వే ఉండవేమో ..
గుండె ఝల్లుమంది కదూ
లైఫ్ స్టిల్ ఫోటో ..
కదిలించి ,నడిపించి ,అనుభవించు ..ఇప్పుడే ..
ఈ క్షణమే ...
అవును ..ఈ క్షణ మే ..
స్టిల్ ఫోటో ..నువ్వు అయిపోక మునుపే ..


భోషాణం ..23-06-14


అదిగో ఆ మూల రంగం పెట్టె మటుకు నాది
కదపకు ..విప్పకు ...ఎప్పుడూ
నేనే ఎప్పుడో చూపిస్తాలే ..
మరో తరానికి చూపిస్తాలే ..
నా ఆశల సీతకోక చిలుకలు రంగులు వెలిసి
కన్నీటీ చుక్కలు ఎండి బుగ్గల పై ,చారికలు కట్టి
ప్రవహించని నది గడ్డ కట్టినట్టు , ఆ మూల ఎక్కడో
ఒంపేసి ఉంటాయి , జాగ్రత్త సుమీ ..
అక్కడక్కడ బోసి నవ్వులు ,కొంగు న వేలాడేసుకున్నవి
ముడి వేసాలే జాగ్రత్తగా .. అదిగో ఆ పచ్చ చీరకే ,ఆ కొంగే
నే తిన్న జీడి పాకం ,ఇంకా జిగురు గా అంటుకుంటూ ,
బాల్యం ని ఎప్పటికీ పారేసుకోను అని తెలియదా ?
నవ్వులు గోడల పై అతికించాను అరే ఇక్కడ
కొన్ని చేరాయే , ఈ భోషాణం లో ,ఎప్పుడు ఎగిరిపోయాయొ ,
వేళ్ళ సందు నుంచి జారి మరి ..
యవ్వనం ఎగరేసిన ఝండా రెప రెప లాడుతూ ఉండేది
ఇక్కడ ఒద్దికగా చుట్టుకుని ,చమ్మగా , చుట్లు చుట్లు గా
దాక్కుంది , భోషాణం గట్టి గా బంధించింది కదా ,
మరే ఒకటా రెండా ,ఎన్ని జీవిత క్షణాలని ,
జీవించక ముందు తర్వాత ,ఒక స్పెసిమెన్‌ లా తీసి దాచింది .
దీనినే టైం కాప్సూల్ అని అంటారుట ..
పాతి పెట్టండి , సీలు వేసి ,
ఎప్పటికీ , నీకూ నాకూ
ఒకటి మటుకు కాదు ..భోషాణం ..తీపి గుర్తులు దాచే భోషాణం ..

6 జులై, 2014

నది ప్రవాహిస్తూ ఉంది

 నది ప్రవాహిస్తూ ఉంది 
వేయి పడగల ఫణి రాజు 
మెలికలు  తిరుగుతూ 
కుత్సిత ఉత్తేజిత  ఊగిసలాట తో 
అసాధరణ  నాట్య కళాకారిణి  
ఆఖరి మిరుమిట్ల ప్రదర్శన వలే 
నదీ ప్రవాహం 
శోభా మయమైన ఉత్సుకత తో 
నది ప్రవహిస్తూ 
ప్రవహిస్తూ కదులతుంది 
నది ప్రవహిస్తూ 
కదులుతూ కూడా .. 

అద్భుతాన్ని తేరిపార చూస్తూ ఉంటాను 
చీల్చుకుని  వెళ్ళే నది
కొండ పై గుహల మూలలు నుండి 
ఉన్నతాల పై మండే జ్వాల లా
స్థల ధ్వంస రచన చేస్తూ
పోటెత్తిన గిత్త లా
విరోధి ని మట్టు పెడుతూ 
ఆకలి గొన్న సింహం 
ఎర పై విసిరిన పంజా లా
ప్రవహిస్తున్న  నది 
కొండ వాలు ల పై నించి జారుతూ 
బండ రాళ్ళ పై తొక్కుతూ 
ఒడ్డు గండ్లు పై నించి దొర్లి పోతూ 
నిపుణుడైన న గారడి వాడి తాడు  పై  నడక లా 
నది ప్రవహిస్తూ ఉంది  

అక్కడ
ఒక్క క్షణమాగి 
ఎగ శ్వాస కై తడుముకుంటూ
లేక                     
సరి చూసుకుంటూ 
ఉపేక్ష తో కూడిన స్పర్శా 
అశాశ్వత మైన జీవితాలు                                                        
చేతనా  వస్తువుల కోల్పోయిన ఆత్మలు 

వారి ఆశ లు 
భయాలు ,వారింపులు 
కోపాలు ,లోభిత్వాలు            
చిన్న చిన్న అసూయలు 
వెర్రి వేలాడ్డాలు
అల్పమైన విషయాలకి
ఇంకా
వేల నీడ ల
ఖాళీ కోరికల తో 
ప్రవహించే నది 
ప్రవహించే నది 
నా మది ని దోచేస్తూ
తన దాష్టిక చేష్ట ల తో
అందె వేసిన నాట్య గత్తె
తన గమనాన్ని తానూ పాటిస్తూ
లేలేత ఆత్మల ని మోసుకుంటూ
తన చేతుల మధ్య
తెలియని తీరాలకి 
ఆమె ప్రవహిస్తూ 
నేను ఆశ్చర్య పడుతూ 
ఆమె ఎరుగునా ఆ వస్తువులు
ఆమె హత్తుకున్న
తన తీయని ఎడద లో
వస్తువు లు
ఆమె పోగు చేస్తున్న  
కాలం ,కెరటా  ల లో
ఇంకా
వదిలి వేస్తూ
ఆమె కదులుతూ
ఆమె స్పర్శి స్తుందా 
లెక్క లేని పిచ్చి వస్తువులు 
తన లో బలవంతం గా దాచుకుంటూ                                               
కాగితపు పడవలు 
విరిగి పోయిన హృదయాలు
పూల గుత్తులు 
పవిత్రమైన మునకలు 
నది ఒడ్డున గవ్వలు 
మానవ వృధాలు
లాలా జాలాలు 
చచ్చి పడిన శరీరాలు
నాచు
మోటార్ బోట్లు 
ఆమె పేగులు మెలిపెడుతూ
మొసళ్ళు మెండు గా పీక్కుంటూ
సగం శిధిల మైన శరీరాలు                                                                            
చిన్న చేపలు 
తమ మనుగడ కోసం జగడిస్తూ
నది ప్రవహిస్తూ 
నది ప్రవహిస్తూ                                                
రాజసం ఒలికించే తిరస్కారంతో కదులుతూ
అల్పమైన కట్టడాలు  
మానవుడు నిర్మించినవి                                                          
స్టీల్ తో గుచ్చుతూ
 కాంక్రీట్ పోస్తూ
 పవిత్ర జలాలని భ్రష్టు పరుస్తూ
తన ఆఖరి ప్రయత్నం అరికట్టాడానికి
తన అజేయమైన జలాలు తో
నది ప్రవహిస్తూ
తన గమనాన్ని తానే అనుసరిస్తూ 
వారి పొగరు చూసి క్రోధు రాలై
ఆ నది
పిగిలి పోతుంది 
బహు సుందరం గా వెళ్ల కక్కుతుంది 
ఆగ్రహాన్నిపగల గొడుతూ 
ఆనకట్టలు ,వారధులు 
ఇంకా వారి నివాసాలు
ఒక్క శుభ్ర మైన ఊడ్పు లో
ఎలా అంటే 
నేల ని తయారు చేస్తున్నట్టు
కొత్త లోక పునర్ నిర్మాణం కోసం 
రెచ్చగొడుతున్నట్టు
వారి లోపాలని
నిరూపిస్తున్నట్టు
తన సొంత బలాన్న
అందాన్ని 
ఇంకా నిబద్ధతని
ఎలా అంటే
తీక్ష్ణ మైన బ్రహ్మాండ నర్తింపు లా
ఆ నటరాజు ది 
నేను ఆ ఒడ్డున కూర్చుంటాను 
విస్మయ పడుతూ
ఆమె కి ఎరుకేనా ఈ బంధం
అంతు బట్టని అగాదం అనిపించే  ప్రవాహం లో
ఇంకా ఒడ్డున ఉన్న ఆ జటిలమైన జీవితాలు  ?
మానవ సమూహాలు
సంపూర్ణం
తల్లులూ కూతుళ్ళూ
తండ్రులూ కొడుకులూ
కలుషిత మై
రాజకీయాలు  అధికారం
ఇంకా ధనమూ
విద్యుత్ కాంతులు
పరివేష్టించి న 
నీచ జీవితాలు
మరియు
ఎక్కడ
విద్వత్తు నశించిందో
మానవ యోగ్యత 
ఇంకా ఒక వ్యాపార సరుకు గా మారిందో
తగ్గింపు ధర ల లో 
అమ్ముకుంటారొ 
ఆమె మృదువుగా 
ప్రవహిస్తుంది
రాజస మైన సరళి లో
వైఫల్యాలు  తనని తాకక 
మానవ జాతివి 
నేను ఇంకా అక్కడ కూర్చుంటాను
వింటూ ఉంటాను
సవ్వడి  లాంటి
లక్షల చిన్ని తరంగాలు
ఒడ్డున రాళ్ళ ల ని బలం గా తాకుతూ 
శ్రావ్యమైన ధ్వనులని
నేను  సంభ్రమ పడుతూ 
ఆమె ఎవరో
ఎరగని అణకువ గల
విడి వడి , నిష్పక్షపాతమై
అనుసరించాలి అనే కోరిక తో
తన దారిన తను 
నది మైదానం లోకి ప్రవేశించింది 
మహనీయమైన గమనం  తో
వేద మంత్రాల ని పారాయణం చేస్తూ
కుంగిన ఆశలని ఉత్సాహ పరుస్తూ
నిస్తేజితులైన జీవాలని పరిరంభణం చేస్తూ
విశ్వ సమన్వయం కి తెర లేపుతూ 
అలా ప్రవహిస్తూ ఆమె 
రక రకాల ఆత్మ ల ని స్పర్శిస్తూ
వేల ఎడద ల ని వెలిగిస్తూ
హరివిల్లు రంగులు వెద జల్లతూ
ఆమె ఔదార్య హృది ని  హత్తుకుంటూ 
దట్టమైన మబ్బుల వేపు
నది ప్రవహిస్తూ ఉంటుంది
హుందాగా
తన ప్రకాశం లో తానే చలి కాచుకుంటూ
లయ బద్ధమైన 
స్వర గుసగుసలు తో 
నది ప్రవహిస్తూ                                                                 
 ఆ నది
 వయోరహిత నాట్య కారిణి లా 
నర్తిస్తూ 
 శతాబ్దాల జ్ఞానాన్ని పంచుతూ
 దేవ సైనుకుడి తేజస్సు తో
సామ్రాజ్ఞి చుట్టు ఉండే దివ్య తేజస్సు తో
 నది ప్రవహిస్తూ 
ఆ నది
మరియు ఆ జీవం
మెలివేసుకుని 
చిక్క నైన  బంధం లో
ఒక్కొక్కటి
స్వాభావిక భాగమై
మరొక దాని లో .
నది ప్రవహిస్తూ ఉంటుంది
ఇంకా
ఆ నది ప్రవహిస్తూ ఉంటే
జీవితమూ కొనసాగుతూ ఉంటుంది .. 

(Nidadavolu Malathi, 3/3/98)

అనువాదం వసంత లక్ష్మి .

జున్‌ నెల విహంగ లో ప్రచురింప బడింది  

17 జూన్, 2014

గోడ

నేనొక హౌస్ ఫ్లై ..అయ్యో 
అచ్చు తప్పు హౌస్ వైఫ్ ..
నేను మొన్నటి వరకు వాలేదాన్ని 
మా ప్రక్కింటి కి మాకు మధ్య గోడ పై ..

అప్పుడు మోగేది సహజమైన ఒక 
ఆకలి గంట , పిల్లల ఆగమనం మరొక గంట 
ఆ పై కాలు ఝాడిస్తూ ,నడక షూ లు 
కట్టి ,సాగించేవారం మా మాటల ఆటలు .. 

హితురాలు ,స్నేహితురాలు తో 
ఇంటి విషయాలు ,ప్రాపంచిక కబుర్లు 
ప్రక్కింటి కథలు ,పిల్లల లోట్లు ,
కావేవి మా కబుర్ల కి అర్హాలు .. 

అక్కడక్కడ కుదిరి కూర్చున్న 
ఆ పై పై ఒంటి బరువు అంత వీసీ కాదు 
సుమా కరిగించడం అంటూ వాపోతూ 
కంచం లో చేయి కడిగే వాళ్ళం ..కుంభాలు లాగిస్తే 

మరి వచ్చేది ముందు నిద్ర ,ఆ పై ఉదరం 
అంటూ ప్రత్యక్ష ప్రహసనం చూసి కాస్త 
విచారించి , మన వల్ల కాదు లే ,మన మేమీ 
ఐస్వర్యా ,సుస్మితాలమా ? ఏమిటి లెస్తూ ..

అని సరిపెట్టుకుంటున్న సమయం లో 
వచ్చి పడింది ,ఇంటింటా ఠణా ఠణ్ అంటూ 
నెట్ సౌలబ్యం ,ఆపై తొండ ముదిరి నట్టూ 
వై ఫై అయింది ..మరి మా గోడ పై మాటల 

ఆకారం ,స్థానం మారింది ,మరొక ముఖ పత్రం 
గోడ వచ్చి కూర్చుంది , మా ప్రక్కింటి స్నేహ లత 
నా మధ్య ,ఐతే ఏం కానిం అని అలాగే కొనసాగించాం 
ఈ లోగా తామర తుంపల లాగా " ఈ " స్నేహితుల 

సంఖ్య పెరిగింది ,ఏం రాస్తే అదే లైకు అన్నారు ,
ఇంకా రాయండి మీరు అంటూ చప్పట్లు చరిచి 
కామెంట్స్ అంటూ పెట్టి ,ఉత్సాహ పరిచారు ,
అదేమి స్నేహం ,ముఖం తెలుసా ? మాట తెలుసా ? 

అని ముక్కు మీద వేలు వేసుకున్న వాని మీద 
కోపగించి కటీఫ్ చెపుతామంటే ,అబ్బే , నాతి చరామి 
అనేసావు కదా అనేసారు ,ఐతే సరే ,నా ముఖం కన్నా 
నాకు ఈ ముఖ మే ఎక్కువ అని తెగించేసాను ..

సరే నీ ( ఖర్మ ) ఇష్టం అనిపించేసాను ,ఇదిగో 
ఇవాళే చూసాను ,నా స్నేహ లత ఎలా ఉందో అని 
అలగలేదు కానీ ,ఎక్కడికి మాయం అయిపోయారు అంటూ 
ఇక్కడే ఉన్నానే అంటే ? ఎక్కడా మన గోడ మీద మీరు 

మరి కనిపించటం లేదు ,ఇదేం పని , 
మీ మాటల గల గల లు కోసం 
కలవరిస్తున్నాను ,ఈ మాటలు కాదండోయ్ 
నిజం గా మాటలు ,కంఠం నుంచి వెలువడే మాటలు ..

అవురా ? ఎంత తప్పు చేసాను అంటూ 
కంఠం సవిరించాను ,మాట రాదే ..
ఏదో స్టాటిక్ సౌండ్ వస్తోంది ..ఇప్పుడు నేనే 
గోడ నై పోయాను ..అయ్యో ..అయ్యయ్యో ....

11 జూన్, 2014

పనస పొట్టు కూర ..పూర్ణా మార్కట్

నిన్న ఎవరో మితృలు పనస పొట్టు కూర అని చెప్పేసరికి ,నా మనసు నందు మెదిలే ..ఈ పూర్ణా మార్కట్ చిత్రం ..
మా ఇంటినుండి బయలు దేరి ,అలా సిరి పురం కూడలి లో ఎడమ పక్క తిరిగి, పూర్వం ఎల్లీస్స్ గార్డెంస్ అన బడే ఎల్లమ్మ తోట, ఇప్పుడు జగదాంబ కూడలి లో ఎక్కడా ఆగక, అలా ముందుకు వెళుతూ ఉంటే టర్నర్‌ సత్రం వస్తుంది ,ఆ ప్రక్కనే మన విశాలాంధ్ర పుస్తక నిలయం ఉంటుంది, మరి అక్కడ తొంగి కూడా చూడకూడదు , ఆ మాయ లో పడితే మరి లేవను , ఇంకా ముందుకు తిన్నగా అలా వెళుతూ ఉంటే ,మా పూర్ణా మార్కెట్ వస్తుంది ..పూర్వం ఇక్కడే పూర్ణా థియేటర్ ఉండేది ,పాత హాలు లో మరి చాలా పాత సిన్మాలు కూడా చూసిన జ్నాపకాలు వేలాడుతూ వెంబడిస్తాయి , ఎదురుగా పూర్ణా ఆప్టికల్స్ ,నడిపేది ఎవరనుకున్నారు ? ముస్లిం ఫామిలీ ,మూడు, నాలుగు తరాలుగా ఏమో నడుపుతున్నారు ఆ షాప్ లు . వాచ్ రెపేర్ కూడా వారి దే ..
ఆ అంచునే మొదలు అవుతుంది ,పూర్ణా మార్కెట్ సందడి .
పాదాచారులు నడవడానికి మిగిల్చిన దారిలో ఏమో ప్లాస్టిక్ సామాన్లు అమ్మే దుకాణాలు, అక్కడ దొరకనివి లేవు ..
మగ్గులు, బకెట్లు , చాటలు ,కాదేది ప్లా్స్టిక్ కి అనర్హం ? అని సమస్తం కళ్ళ కి పసుందు గా కనిపిస్తాయి , పాత తాళాలు , ఇనప సామాన్లు, స్టీలుసామాన్ల కొట్లు , పూజ సామాను , ఇత్తడివి . స్టీలువి ..ఒకటేమిటి ? మనకి ఏం కావాలి అన్నా ,ఈ మార్కెట్ కి వస్తే సరిపోతుంది ..
ఇంక కుడి వేపు తిరిగితే మొదలవుతుంది ,ఎంత జీవన వైవిధ్యమో , బుట్టలు ,తట్టలు ,పట్టుకుని ,కొప్పులు ముడి వేసి ,కుడి పైట వేసిన మన అప్పలమ్మ లు, అప్పాయమ్మలు ,నూకాలమ్మలు ,ఇంతింత పెద్ద కుంకుం బొట్టులు తో , కాలి కి బరువైన వెండి కడియాలు కంఘ్ మని మోగుతూ , ఐదు రూపాయలకి ఐదు కట్టలమా ! అంటూ కొత్తిమీర పరిమళం , ముక్కు కి ఆనించి లాగేస్తారు ,మొదట్లో తెలియక ,ఆ పరిమళ మాయ లో పడి ముందే ఈ ఆకు కొనేసి ,ఇంకా తక్కువకి కూడా అమ్ముతారని ..ఓ బాధ పడి పోయాక ,ఇప్పుడు తెల్సింది లెండి ,ఆకు కూరలు ఆఖరున కొనాలి అని ,నలిగి పోతాయి కదా ..
మనం కారు లో వెళితే కనుక ,ఈ బుట్టల వాళ్ళు అందరూ ఒక నిముషం లో బుట్ట తట్ట ఎత్తి పట్టుకుని , మనకి చోటు చేసి ,మళ్ళీ వారి జాగా లో వారు కూర్చుంటారు , సహ జీవన సౌకర్యం ..ఎంత బాగా నేర్చితిరో కదా ? ఔరా ?? అని ఆశ్చర్య పడిపోతాను ..నేను ..
ఒక వర్స పాటించాలండీ ,ఎలా పడితే అలా ప్రవేశిస్తే ఎలా ? రండి చూపిస్తాను ,నాతో పాటు మా పూర్ణా మార్కెట్ .. రంగుల హంగులు ..
ముందు రోడ్డు వైపు నుంచి చాకచక్యం గా ,ఆవులు ,గేదెలు రాకుండా అమర్చిన ఇనప పట్టి ల ను దాటి ,అడుగు పెట్టామా ?? పెద జాలారి పేట అమ్మణి లు, అమా బత్తాయి ,కమలా ,ద్రాక్ష ,అంటూ నాలుగేసి తీసి మన చేతిలో పెట్టేస్తూ ఉంటారు, అబ్బో ,ఏదో పేరంటం అనుకునేరు సుమీ ,రేటు కట్టి ..ఇవ్వాల్సిందే ,ఎంత ? అంటూ అడిగామా ? ఎంత ..వంద అంటూ ఒక పెద్ద అంకె చెప్పి గుండే గుభేల్ మనిపించాక , వారిని తప్పించుకుని ఆ మయ సభ లో ముందుకు అడుగు వేయాలి అంటే ,ఒకటే దారి ..పది కి ఇస్తావా ?
హు ..పళ్ళు కొనే మొహమే నా ఇది అంటూ ,చూపులతో ,మాటలతో మొహం ఈడ్చేస్తారు ,దుర్యోధనుడి కైన గర్వ బంగం తల్చుకుని ... థూ అంటూ మనమూ దులిపేసుకుని ముందుకు అడుగు వేయాలి అన్న మాట ,,
అటు మళ్ళీ ఎడమకి తిరిగితే పాత కరాచీ దుకాణం ..అందులో సరుకులు అన్నీ టొకున అమ్మేలా ,బస్తాడు మిరపకాయలు ,అలా పెట్టి ఉంటాయి ,ఇవి మనకి అక్కర లేదు కదా ,ఎదురు బొదురుగా ,చింతపండు ,పిక్క తీసింది, తీయనది ,మిర్చీ ,అప్పడాలు ,వడియాలు , ఇంకా ఎన్నో బస్తాల బస్తాల తో కనిపిస్తాయి ..
మనం ఇవన్నీ దాటుకునీ ముందుకు వెళ్ళామా ? లాంతరు చిమ్నీలు, అప్పడాల పీటలు కర్రలు ,అమా ం దస్తాలు , పెనాలు , కుంపట్లు , దేవుడి దీపాల సమ్మెల లు . గులాబీ స్వీట్ చేసూనే గుత్తులు , జంతికల గ్ట్టాలు అన్నీ పాత మోడలు వి ఇలా సమస్తం ..మన పాత వంటిల్లు ని గుర్తు చేస్తూ కనిపిస్తాయి ,ఓ సంబరపడి కొనేసి ,అటక ఎక్కించినవి ఎన్నో ,
అందుకే ముందుకు పదండి , ఆ ఒంపులో ,తమల పాకులు కట్టలు, కట్టలు , అరటి దూట , అరటి ఆకులు ,ఇలా పచని దుకాణాలు , కనిపిస్తాయి , మరి ముందుకు తోసుకు వెళ్ళాలి ,ఎందుకంటే ఈ కూరల దుకాణాల దగ్గర విపరీతమైం రష్ ...
ఉత్తరాది వారు చక్కగా భార్యా భర్తలు ఇద్దరూ ,పెద్ద పెద్ద సంచీలు మోసుకుని వారం పది రోజులకి సరిపడా కూరలు కొనుక్కుని వెళతారు ,వాళ్ళ కి కావల్సిన కూరలు నూల్ కోల్ , గోబీ , ఇలాంటివి ఇక్కడే ఎక్కువ దొరుకుతాయి మరి ..
మరి మనమో ,నిన్ను ఇక్కడ దింపేసి నేను ఇక్కడే ఎదురు చూస్తూ ఉంటాను ..ఇంత గొప్ప సాయం చేసాను ,తీసుకు వచ్చి ,నాకు ఊపిరి ఆడదు బాబూ , అంటూ సూకరాలు పోయే మగ మహారాజులు మన వారు కదా ,అందుకే ఒక సంచీ చేతిలో పట్టుకుని నేను ..అలా ముందుకు సాగుతున్నానూ ...
ఆ మలుపులో చూస్కోండి ఇంక ,బఠాణీలు, ఉప్పు బఠానీలు , అటుకులు , మర మరాలు ,చిన్న బిస్కెట్లు ..ఇల చిరు తిండ్లు మనలని నోరు ఊరిస్తూ ..
అబ్బ..ఇవి తర్వాత , కొంచం ముందుకు వెళితే ,అమ్మా ,ఫ్రెష్ ..చుక్క కూర ,తమరికి ఇష్టం కదా ,ఆరు నెల్లకి ఒకసారి వెళ్ళినా ,వారి జ్నాపక శక్తి అమోఘం .చదువుకుని ఉంటేనా రాజ్యం ఏలేసే వారు కాదూ ,
ఆకు కూరలు చూడగానే ఒళ్ళూ మరచి ,పాల కూర ,పుదీన ,చుక్క కూర అంటూ లిస్ట్ చెపుతూ ఉండగా ,ఏమండీ మీరు కూరలు కొనడాని కే వచ్చారా ? అంటూ , నిల్చుని ,నిల్చుని ఇంక ఆగలేక పలకరించిన ..అతను ..కూరల ఆవిడ నా ముసి ముసి నవ్వులు చూసి అయ్యగారా ? అమ్మ అంటూ మరో రెండు కట్టలు కొసరు వేసింది .ఎంత అంటే ఇంద అని చెప్పి బేరం ఆడ్డమే మర్చిపోయాను ..
సరే వచ్చావి కదా ,ఈ సంచి నువ్వు పట్టుకొ అంటూ ,మరో సంచి కొని మరీ ,ముందుకు వెళితే నా అంత ఎత్తున అరటి గెలలు ,సపోటా , ఇంకా ఏవేవో పళ్ళు ..
మరో ప్రక్క అల్లం ,ఉల్లి పాయలు ..ఇవి ఆర బోసి .
కింద నేల చిత చిత , ఒళ్ళు ఒళ్ళు రాసుకుంటూ చిర చిర, అమ్మి కొప్పు లో దోపిన చామంతి చూడగానే అమ్మో పూలో గుర్తు వచ్చింది ..
నాలుగు మూరలు అంటూ అంట కట్టే పిల్లడిని కాదు అనలేం , కొసరుగా రెండు మూరలు కొని , ఇంకా నా వల్లా కాదు ,అంటూ ముఖం లో రంగులు మారుస్తున్న అతనిని చుస్తూ ..
సరే పద ,ఇంకా చాలా ఉంది ,ఆ వెనక కుండలు ,కూజాలు , బుట్టలు ..అమ్మా ..నువ్వు అచ్చ్నం విశాపట్నం దానివి అని నేను ఒప్పుకుంటnను .ఇంక చాలు ,ఈ రోత నా వల్ల కాదు భరించడం ..అంటే ..
భరించలేక ,పూర్ణా మార్కెట్ లో అందాలు చూడాలి అంటే వైజొగ్ వాడివి అయి ఉండాలి అనే ఫండా తెలియ చెప్పి ,ఇంకా దొండకాయలు , అరటి కాయలు , పొట్ల కాయలు అన్ని ఇప్పుడే కోసుకు వచ్చినట్టూ నవ నవ లాడుతూ ..చెయ్యి లాగేస్తోందే ..
రెండు అల్లా నాలుగు సంచీలు అయాయి ..అంతే అవి అలా పి్లలు పెట్టేస్తయయి ..
ఇంకా బయట పడుదాం అనుకుని మళ్ళీ ట్రెల్లిస్ దగ్గర ,ఆగి విన్యాసాలు చేస్తూ ఉంటే అక్కడ కనబడుతుంది ...పనస కాయ పొట్టు ..చింత చిగురు ..రెండూ ,జంట కవుల లా గే ప్రక్క ప్రక్క .. ఒకటే ఆత్రం ..కొనేసుకోవాలి అని ..ఎలా చేయాలో ఏమిటో ?
పోనీ అమ్మకి ఇచ్చేద్దామా ?? ఆమె వండి పెడుతుంది .. అమ్మో అమ్మ కి పని కాదూ ..ఎలా ? టు బై ఆర్ నాట్ టు బై అని ధర్మ సందేహం లో రెండు నిముషాలు ఆలోచించి ఇది వాతం అంటూ ఎప్పుడో అమ్మ చెప్పిన మాట గుర్తు తెచ్చుకుని ,చింత చిగురు ..కూడా మరోసారి అంటూ ...అడుగులు ముందుకు వేస్తాను ..
ఇది మా పనస పొట్టు కథ ..కథో కార్యమో అవుతే ,తినేది ,ఈ కూరే కదా ,మనం ఎందుకు ఊ హైరానా పడి పోవడం అంటూ ,తేలికగా ఏ బీరకాయో , దొండ కాయో వండడం వచ్చు కానీ ,ఇవన్నీ చేయడానికి ..నేనే మైనా నలుడా భీముడి నా ??
అనుకుంటూ ..నాలుగు సంచులతో ఇంటి మొహం పట్టమా ?? ఏమేం వండను  ? ఏమేం ఫ్రిజ్ తినేసింది అని మటుకు అడగ కండి ..మరో మూడో యుద్ధం కి కారణం అవుతారు మీరు ..మా ఇంట్లో ..అదీ సంగతి ..

4 జూన్, 2014

అగ్ని సాక్షి గా పెళ్ళి ,చావు...

చిట్టి చిట్టీ ,ఏమిటమ్మా .. చా పద్దెనిమిది ఏళ్ళు వచ్చాయి నాకు ఇంకా చిట్టి ఏమిటి అంటూ సీత గొడవ పెడుతూ ఉంటుంది , మనకంత తాహతు లేదు అంటూ ,డిగ్రీ చదువు అయినా చదవనివ్వండి అంటే ,మన కుటుంబాల లో ఇదే గొప్ప ,నేనూ ఎనిమిది వరకు చదివాను అని మీ నాన్నమ్మ నన్ను చదువు కున్న కోడలు అంటూ మూతి మూడు వంకలు తిప్పేది ,అంటూ అమ్మ నా చదువు మధ్యలో ఆపించినా ,పత్రికల లో కథలు ,నవల లు చదవడం నాకెంత ఇష్టమో ,భర్త అంటే ఇలా ఉండాలి అని ఎన్ని కలలో ..
ఇంట్లో ఎప్పుడూ చూసార ? అల్ల వారి అబ్బాయి అంటూ ..చిన్న చిన్న గా చెవులు కొరుక్కోవడం . బడి లో గుమాస్తా ..మంచి సంబంధం అంటూ ,ఉన్న దంతా ఊడ్చి ,ఊడ్చి ,నాన్న గారు ఈ సంబంధం కుదిర్చారు ..మరి పాపం తమ్ముడికి ?? చదువు చెప్పిస్తాం .వాడి ఊసు నీకేలా ? అమ్మ ప్రేమ గా చివచివ లు ..
రామారావు అమాయకుడు అన్నారు ,అంటే ఏమిటొ మరి , సీత నువ్వింత అందం గా ఉన్నావు నీ కు ఎవరూ ప్రేమికులు లేరా ? అంటే అయోమయం గా , నేనంత అందగెత్తనై నాకు తెలియదే ,మీరు మరి లక్ష రూపాయిల కట్నం తీసుకున్నరేం ? నేను అంత అందగెత్త నైతే అన్నందుకు ,మొదటి సారి నా చెంప పై దెబ్బ పడింది ..
రామారావు మెత్తనైన వాడు ,అమాయకుడు ..అన్నారే ..ఇంత గట్టిగా ఉందే అతని చేతి దెబ్బ ? కళ్ళల్లో నీళ్ళు గిర్రున తిరిగాయి మొట్ట మొదటి సారి ..చిట్టీ అని పిలిచే అమ్మ ఏది ? నా కంట నీరు చూడలేని అమ్మ ఏది ??
రామారావు చేతిలో నా చేయి పెడితే అంతేనా ? ఇంక నా మంచి చెడ్డలు అమ్మ నాన్న కి పట్టవా ? ఎలా ఉన్నావు ? అని అడగరేం ?
అవును లక్ష రూపాయలకి వడ్డీ కడుతూ ,ముక్కుతూ మూలుగుతూ నడుపుతున్న సంసారం ,ఎలా ఉన్నావు తల్లీ అని అడిగి ,దించిన కుంపటి మళ్ళీ ఎద పై ఎక్కించుకోరు కదా ? నేనేమైన అడిగానా ? నాకు పెళ్ళీ చేయండి అని, చదువుకుంటాను నాన్నా అంటే ,భారం తల్లీ అన్నారు ..నేను ఉద్యోగం చేసి ,వారిని పువ్వుల్లో పెట్టి చూసుకునే దాన్ని కదా ,ఎవరు చెప్పారో ఆమ్మాయిలు కుంపట్లు అవీ అని ,కాలం ఎంత మారినా మా అమ్మ నాన్న మటుకు పాత కాలం పద్ధతులే ఏమైనా అంటే ,మనకి అంత తాహతు లేదు ..అన్నిటికీ ఒక్కటే మాట ..
ఏం చెప్పి పంపించింది అమ్మ ..తల వంచుకు ఉండు ,అత్తారింట్లో ,ెదురు సమాధానం చెప్పకు , నీ పని నువ్వు చక్కగా చేసుకో ,బద్ధకించకు , పని మనిషి అంటూ ఎవరూ వద్దు ,పని చేసుకుంటూ ఉంటే పని చులాగా ఉంటుంది ..ఆరోగ్యం గా ఉంటుంది .పని బద్ధకం పనికి రాదు ..అంటూ ..
తు చ తప్పకుండా , అమ్మ మాటలు పాటిస్తున్నాను ..ఐనా అప్పుడప్పుడు చెంప దెబ్బలు , నడుం వంచి పిడ్ గుద్దులు ..ఎందుకు ? అని అడిగినందుకు ..మరో రెండు ..
అత్తగారు వచ్చి ఏం చెప్పారో మరి , పండగ ఈనాం అంటూ ఎభై వేలు తెమ్మని సతాయింపు ..వద్దు అండీ ,మా నాన్న ఇప్పటికే అప్పుల్లో ఉన్నాడు .నా వల్ల కాదు ,పని మనిషి కూడా పెట్టుకోకుండా పొదుపు గా చేస్తున్నాను ,ఇంకా యేమిటి తక్కువ ? అని అన్నందుకు ..
రెండ్రోజులు అయింది గాస్ అయిపోయి ,కిరస నూనె కుంపటి మీద వంట .. ఏమండీ ఒక్క సారి వచ్చి కాస్త స్టవ్ లో కిరసం పోయండి ,నా చెయ్యి బాగా లేదు , ఇంట్లో నే ఉన్న రామారావు ని కేకేసి పిలిచాను ..
ముందు గదిలోం చి నవ్వుకుంటూ , వచ్చి , కిరసన్‌ డబ్బా లో నూనె అంతా నా పై వంచాడు ,పాపాత్ముడు ..వీడు భర్తా ?? కళ్ళల్లో నీళ్ళూ తిరిగి ,కిరొసిం కంపు కొడుతూ నేను ,అవాక్క్కయ్ నిల్చుని ఉండగా ,అగ్గి పుల్ల అంటించి నా పై వేసాడు ..
ఆ చిన్న గదిలో మంటలు పైకి ఎగిసాయి ..సీత ..అగ్ని సాక్షి గా పెళ్ళాడిన సీత కి అమ్మ మాటలు గుర్తు వచ్చాయి .బ్రతికినా చచ్చినా అత్తా రింట్లో అని , లుంగి ఊడి ,కాళ్ళ కి అడ్డం పడి ,ఒక్క క్షణం , పారిపోవడం ఆలస్యం అయిన రామరావు ని గట్టిగా కౌగిలించుకుంది ..
అగ్ని సాక్షి గా పెళ్ళి ,ఒక్క ఏడాది గడవకుండానే చావు ..సీతా ..రామారావుల కథ ఇది ..కాదు కాదు ఇంకా ఎంత మందిదో కథ ..సీతల కథ ..
అగ్ని కి ఆహుతవుతూ భర్త ని కూడా కౌగిలించుకుని , చనిపోయిన.. చంపేసిన ...ఒక భార్య గురించి వార్త ..శభాష్ ...అని ...ఆమె లాంటి మరెందరో ..పెళ్ళి పెళ్ళి ..కాదూ ..జీవితం ..జివితం ..ముఖ్యం ..
UnlikeUnlike ·  · 

29 మే, 2014

మా విశాఖ - ఏలూరు ప్రయణం ,కార్‌ లో ..


శనివారం ,ఆదివారం రెండే రెండు రోజులు ..మాకు వీలు కుదిరిన రోజులు ,ఏలూరు వెళ్ళాలి ,మా ఇల్లు నిర్మాణం లో ఉన్న ఇల్లు ( ఫ్లాట్ లు ) చూసి రావాలి .
ఎప్పటి లాగే మేం బయలుదేరే రోజు చిన్నపాటి వర్షం తో స్వాగతం పలికింది . రాత్రి అంతా పెద్ద ఉరుములు మెరుపులు ,జడి వాన బెదిరింపులు ..ఉదయానికి ప్రశాంతం గా మబ్బుల తో నిండిన ఆకాశం ..మరీ ఎక్కువ కురవను లెండి ,మరి బయలుదేరండి ..అంటూ దీవించింది .
ఇంకేం ? ఎప్పుడూ లేనిది నేను కూడా నాలుగు గంటలకే లేచి ఇడ్లీ లు పడేసి అంటే ఇడ్లీ పాత్ర లో ,కొబ్బరి పచ్చడి కూడా చేసి ,ఇంట్లో ఉన్న బిస్కెట్ హల్దీరాం పాకెట్ కూడ పడేసాను, అదేమిటో ప్రయాణం లో పిచ్చి ఆకలి వేస్తుంది మాకు.  ఇంతేకాదండోయ్ ,స్టీలు ఫ్లాస్కు లో వేడి ఫిల్టర్ కాఫీ కూడా పోసేసాను, ఇంత బుద్ది నాకెప్పుడు వచ్చింది చెప్మా ?? అని నాకే హాశ్చర్యం వేసింది కానీ ఇదిగో మరీ అరవై దగ్గర పడుతోంది కానీ కొంచం బుద్ధి పడేద్దాం ఆ తింగరి బుర్ర లో అని ఎవరో పెద్దలు పాపం నిర్ణయించుకున్నారు కాబోలు ..ఎందుకో అందుకు. ఈ సారికి ఏ హోటలు దగ్గర ఆగుదాం అని దిక్కులు చూసే శ్రమ తప్పింది నాకు ..
ఉదయం ఆరున్నర కే బయలుదేరి పోయాం , వీధులన్నీ ఇంకా ఖాళీ గా ,ఉదయపు నడకల వారి తో , ప్రశాంతం గా ఎంత బాగుందో ..మా విశాఖ అనిపించింది ..

ఉక్కు పరిశ్రమ దాటేసాం అంటే విశాఖ దాటేసినట్టే, చిన్న చిరు జల్లు మాకు తోడు గా మాతో కూడా , ఎండ రానా మాననా అని తొంగి చూస్తూ సరేలే ఇంకాసేపు పడుకుందాం అని ముసుగు తన్నే పిల్లలా గా ( సిగ్గు ఎందుకు ,తల్లి కూడా అంతే అని చెప్పేయ్ ) బద్ధకం గా మబ్బుల చాటున దాకుందే మో !
ఆకు అలమలు కి పండగే ,మరి ,తలంటి పోసుకున్నట్టు , జల జలా తలలు కదుపుతూ ,చిరు జల్లుల కొసరు లు కురిపిస్తున్నాయి చెట్లు . నల్లని తారు రోడ్డు కూడా మెరిసి పోతోంది , అంచున ఎర్రటి మట్టి ,బుద్ధి గా కుదురుకుని ,మొదటి రోజు బడి కి వెళ్ళీన పిల్లాడి ,దువ్విన జుట్టు లాగ అణచి వేసి జర జర మని మాతో పాటూ పరుగులు పెడుతొంది .

కనుచూపు మేర పచ్చదనం .ఒక్క రంగు కాదు ,లేలేత పచ్చని పొలాలు దిగంతాల వరకు పరచుకుని కర్ర పట్టుకుని పెత్తనం చేసే నాన్న లాగ ,పెద్ద పెద్ద చెట్లు ,ఎత్తున, అలా అక్కడక్కడ నిలుచుని గంభీరంగా కాపలా కాస్తూ,ఇంకా ఎత్తు ఎదగని పొదలు వయ్యారం గా రంగురంగుల పూలు తలలొ అలంకరించుకుని ..

అనకాపల్లి దగ్గరకి వస్తోంది ,ఇంత ఎత్తున చెరకు పొలాలు , అరటి చెట్లు ఒంగి పోయి, కారు పరుగులు తీస్తూ ఉంటే నా కళ్ళు కిటికీ కి అంటించి మనసులో ఆ రంగుల ప్రకృతి చిత్రాలని నిరంతరం నా
కళ్ళ కమెరా ల తో చిత్రాలు తీసుకుంటూ ,నేను .

అన్నవరం వస్తున్నాది  అని ఎత్తైన కొండలు చెప్పాయి , ఆ కొండ దారి దాట గానే ,రెండు వేపులా అందం గా పేర్చి పెట్టి , పసుపు రంగులో మామిడి పళ్ళు ఎంత నోరు ఊరించాయో , వెనకే వరసగా మామిడి తోటలు ఒక్కో చెట్టు కి ఎన్ని కాయలో , ఆగుదామా ?అని అడిగే లోపల మా చల్తి కా నామ్‌ గాడీ ఎక్కడా ఆగదు అని ఘామ్మని వంద మైళ్ళ స్పీడ్ లో పరుగులు పెడుతున్న కారు ని ఆపమంటావా ? అని ఒక చూపు నా మాట ని బంధించింది .

అదేమిటో ,మామధ్య ఒక్కోసారి మాటలే అక్కరలేదు ,అలా అర్ధం అయిపోతూ ఉంటాయి అన్నమాట ..
మరి ముప్ఫై ఏళ్ళ పైన  సాహచర్యం కదా ..

రాజమండ్రి దగ్గర పడింది ,నేను నావిగేటర్‌ అంటే దారి చూపు మహిళ ని కదా , ఎక్కడైనా ఆగుదాం అని ఆకలి అని ఆత్మా రాముడి సంకేతాల తో ఆగాం ..ఒక చెట్టు కింద ,రోడ్డు ప్రక్కకి కార్‌ ఆపి .

చేతులు సానిటసెర్ తో కడిగేసుకుని ,అబ్బ ఎంత సంతోషమో ,పెద్ద గొప్ప పని చేసాం అని, చేతులు శుభ్రమా ? అదేమిటి అనే రోజులు పోయాయి కదా ,ఇడ్లీ లు శుభ్రం గా లాగించాం ..ఎందుకైన అని కారప్పొడి కూడా పడేసాను .మరీ దృష్టి తగులుతుందని ఒక్కటి మిగిల్చాం ,డబ్బా లో ,వేడి గా కాఫీ స్టీలు గ్లాసు లో ..అబ్బ ఎంత హాపి యో ,హోటల్ బాదర బంది లేదు అని .. కాసేపు కాలర్‌ ఎగరేశాను మరి ..నా గొప్ప నేనే చెప్పుకోవాలి కదా ,గుర్తించే  వారెవరు? ఇంట్లో ??

కడియం లో పూల గుత్తులు రా రమ్మని పిలిచాయి ,మల్లె మాలలు పిలిచాయి ..అబ్బే మా బండి ఎక్కడా ఆగదు .అంటూ వెళ్ళి పోతున్నాం ..చోదకుడి దృష్టి అంతా ముందు ఉన్న రహదారి మీదే ,హ్మం ..మల్లె పూల పరిమళాలు , అయ్యో ! కాసిని గుప్పెళ్ళతో లాక్కుని ,మనసు లో నింపుకున్నాను ..

నా పక్కన ఒక సైకెల్ మీద ఒక యువకుడు ,పొడవాటి , ఏడు అడుగులు అయినా ఉంటుంది ,చెట్టు కాండం అనుకుంటా ,భుజం మీద సరిగ్గా మధ్య లో ఆంచి ,రెండు చేతుల తో దర్జాగా ,పోస్ గా తొక్కుకుంటూ ,ఔరా ..అనిపించాడు .

రావుల పాలెం వస్తోంది ,రెండు గోదావరి పాయల వారధులు దాటేసాం  ,ట్రాఫిక్ వల్ల మా బండి స్లో అయింది . నాకు దిక్కులు చూడ్డానికి వీలు అయింది .

సెవెన్‌ సీటర్ ఆటో లో ,పసుపు రంగు పరికిణీలు కట్టుకుని ఎర్ర జాకెట్లు తొడుక్కుని ,బడి పిల్లలు చాలా మంది ఒకే ఆటో లో కనిపించారు ,అందరూ ఒక్క లాగే ముద్దుగా తయారు అయారు , మెడ లో మెరుస్తున్న గొలుసులు ,మడచిన ్రెండు జడలకి ,ఎర్రెర్రని రిబ్బన్లు ,ఎంత ముద్దు వచ్చారో ,అందరూ నోట్ పుస్తకాల లో ఏవో పాటలు అనుకుంటా ,కంఠతా పెడుతూ ,గాలి లో కి పాడుతున్నారు , పది మంది వరకు ఉంటారు ..

నాకైతే ఆగి ,వారి వెంట పడి పోయి ,ఆ పిల్లల నృత్యం చూసి రావాలని ఎంత కోరిక పుట్టింది ,ఇలా ఎన్నో ఆశల దీపాలు దారి పొడుగునా వెలిగించుకుంటాం మనం ..అవే మన జీవిత మార్గం ..

వారి నగలు గిల్టు వి కాని ,టాటా చెపితే వారి కళ్ళ ల్లో మెరిసిన నవ్వుల రంగులు మటుకు పూర్తిగా నిక్కచ్చి బంగారమే ..

మోటార్ సైకెల్స్ మీద చేతిలో ఒక చంటి పిల్లాడు ,భుజాన వేలాడుతున్న లేడేస్ బాగ్‌ , తల లో వేలాడుతున్న రెండు మూరల మల్లె మాల ,ముందు సేట్ పై మరో పాప ,ఇంత మంది ని బాధ్యత గా ఏదో గమ్యం చేరుస్తున్న భర్త ,ఎంత ముచ్చట గా ఉన్నారో , నానో కార్‌ లో ఈ ఆనందం వస్తుందా ? నాకు ఒక ప్రక్క ,ఆ భుజాన బాగ్ ,ఆ పిల్లాడు ,ఎలా బాలంస్ చేస్తుందని కంగారు ..ఆవిడ కేం .దర్జా గా వెల్ళి పోతుంది ,భార్యల కి భర్త ల మీద ఎంత నమ్మకం ? తమని క్షేమం గా చేరుస్తారు అని ..

మరొక చోట ,ఏదో దేవుడి పెళ్ళి ,అందరూ హడావిడిగా పట్టు చీరలు ,నగలు , పూలు తల లో మామూలే ,చెప్పాలా ,దేవుడి పెళ్ళి కి అందరూ పెద్ద లే అన్నట్టు ఊరు ఊరు అంతా ,తరలి వెళుతోంది .. మా బండి కాస్త మంద గమనం తో పెళ్ళి నడకలు నడిచింది ..

ఇంకెంత సమ్యం ? అంటూ మా మరిది ఫోన్లు ,ఇదిగో వచ్చె ..వచ్చేసాం ..

గూడెం వచ్చాం , మనసు మన సాహిత్యం స్నేహితురాలి ఇంటికి చేరి ,సాహిత్య సుమాల్ సౌరభాలు కాసిని మూట కట్టుకుంది ..బాబోయ్ ఇలా నచ్చిన చోటు కి పరుగులు తీసే మనసే లేక పోతే ఏమై పోయే వాళ్ళం ?? మనం ..అని సంతోషం ..
ఎంత అల్ప సంతోషులం ...పూల వాసన్లు మూట కట్టుకుని మురిసే ముదితలం కాదా .. కదా మనం ..

అలా తోడు గా వర్షం ఆగి ఆగి పడుతూనే ఉంది ..ఇంతలో అదిగో ఏలూరు ఆశ్రమ కాలేజ్  వచ్చేసింది ,ఊరులో నుంచి వెళదాం అనుకుంటూ ,పొరపాటున బై పాస్ రోడ్ ఎక్కేసాం .మరి ఇది దర్జాగా ,విశాలం గా ఉంది అడ్డ దారులేల ?అనుకుని ఎక్కి ,మొదటి ఎక్సిట్ తీసుకున్నాం ..ఆ దారి గోపన్న పాలెం  మీదుగా మా అశొక్ నగర్ దగ్గరి తంగెళమూడి వంతెన కే చేరింది ,అనుకోకుండా ఒక పావుగంట ముందుగా గమ్యం చేరి ,ఒంటి గంట మేం అనుకున్న సమయానికే ఇంటికి చేరాం ..

వెనక్కి వచ్చిన ప్రయాణం కథా కమామీషు ,మరో సారి ..మరి ఉండనా ??











23 ఏప్రి, 2014

అర్ధం కాని వింత కథ ..

“ఆవ పెట్టిన ఆనపకాయ కూర, దోసకాయ పప్పు , పులుసు పెట్టమని చెప్పి వచ్చాను ” వెళ్ళాలి  అంటూ లొట్టలేసుకుంటూ భోజనానికి బయలుదేరాడు మూర్తి. లంచ్  టైమ్  కావడంతో నాకూ ఆకలి దంచేస్తున్నా ఈ ఒక్క స్టేట్మెంట్ చదివి  వెళదాం అని కూర్చున్నాను కుర్చీ కి అతుక్కుని మరీనూ.
అయినా  ఈ మూర్తి ఏమిటీ ? రోజూ ఫలానా వంట చేయమని చెప్పి వచ్చాను అంటాడు,  అదేమిటి ? తనకి తోచినదేదో వండే స్వాతంత్ర్యం కూడా మూర్తి భార్య కి లేదా ఏమిటి ?
నాకు అన్నీ వింత గానే తోస్తాయి.
రోజుకొక ఆపిల్ తింటే వైద్యునికి దూరంగా ఉండవచ్చు అన్న సూక్తి నాకూ తెలుసు ,కానీ ఆ మాట పట్టుకుని ,రోజూ ఆపిల్ పండు తినమంటే విషం తినమన్నట్టు మొహం పెడతాను నేను .నాకు ఆ ఫలం చూడగానే తినాలి అని కోరిక కలగాలి ,కొనాలి, తినాలి అంతే కానీ ,అలా కొని పడేసి ,రోజూ ఏదో మందులా తినమంటే ,తినగలమా ?
మూర్తి అలా కాదు ,అతని ఆలోచన ఇలా ఉంటుంది ఏదో జబ్బు చేసి వైద్యుని దగ్గరకి వెళితే పరీక్షలు ,మందులు అంటూ ఎంత ఖర్చు పెట్టిస్తాడు ?మనం ముందే ఇలా ఖరీదైనా పళ్ళు ఫలాలు తింటూ ఉంటే మనం వైద్యుని వద్దకి వెళ్ళే పరిస్థితే రాదు కదా ? అంటాడు ..
ఇదేం ఆలోచన ?  ఫలాలేవో ఇష్టంగా తినాలి అనిపిస్తే ,కొనుక్కుంటాం ,తింటాం ,అంతే కానీ వెనక ఇంత ఆలోచన చేసి కొంటామా !

ఏమో ,నేనే తప్పుగా ఆలోచిస్తున్నానేమో ?
నాదే కొంచం తిక్క వ్యవహారం అందరూ ఇలాగే ఆరోగ్యం కోసమే కదా పళ్ళు తినేది అంటూ నన్ను నేను తప్పు పట్టుకున్నాను ..
నాకు అంత ముందు ప్లానింగ్ అదీ ఉండదు వంట విషయంలో కూడా ,ఆ రోజుకి ఏది సులువుగా వండగలను అనిపిస్తే ,అప్పటికది వండేసి ,అయింది  అనిపిస్తాను .. భాస్కర్ కూడా ,ఏది వడ్డిస్తే కంచంలో అదే మహా భాగ్యం అన్నట్టు తింటాడు , పాపం .. 
ఈ మూర్తి ఏమో  ,రైతు బజారుకి వారంకి ఒక్కసారి వెళ్ళి , ఆ వారానికి సరిపడా కూరలు ,పళ్ళు ఆకు కూరలుతో సహా తెచ్చి పడేస్తాడుట ,అదేమిటి ? మీ ఆవిడ రాదా ? తను కదా వండాల్సింది ?అని మాటల మధ్య ఒకసారి అడిగితే ,దానికి సమాధానంగా  - " అబ్బబ్బ ! ఆ రైతు బజారులో జనమే జనం అండీ , ఆడవారిని తోసేస్తూ 
రాసుకుంటూ ఎందుకు వచ్చిన కర్మ ? నేనున్నాగా !అయినా , నాకు తెలిసినంత బాగా మా సరోజ కి కూడా తెలియదండీ " ,అన్నాడు  గొప్పగా. 
నేను విస్తు పోయాను ,ఇలా కూడా ఉంటారా ? మగవారు అని .
భాస్కర్ని ఎప్పుడైనా, ‘ఇవాళ వండడానికి కూరలేవీ లేవు. నాకు బద్ధకంగా ఉంది ,అలా బండి వేసుకుని వెళ్ళి ,నాలుగు రకాల కూరలు తెచ్చి పడేయవా ? ఏదో ఒకటి వండుతాను ఈ పూటకి’ అని అడిగితే ..
” బాబోయ్! నాకు అలాంటి పనులు అప్పచెప్పకు,  ఐనా మొన్నటి అనుభవం  చాలదంటావా ? ” భాస్కర్ బాణం విసిరాడు .
“అది ఆర్నెల్ల కింద మాట .. ” ముసి ముసిగా నవ్వుతూ అన్నాను .
భాస్కర్ ఊరుకోలేదు . " ఉండు అలా మాట మర్చకు ,నేను వంకాయలు తెస్తే అన్నీ పుచ్చువి ,చచ్చువి అంటూ నువ్వు విసుక్కోలేదూ ?”
“…………………..”
” పోనీలే అంత బద్ధకం గా ఉంటే ఏమీ వండకు ,హోటళ్ళు ఉండేవి అందుకే కదా ,పద తయారు అవు ” అంటూ ఎలా మాయ చేస్తాడు ,అంతే కానీ కూరలు మటుకు కొని తీసుకు రాడు ..
కానీ  మూర్తి అందుకు భిన్నంగా కనిపిస్తాడు
నా కన్నా  ఐదారేళ్ళు  పెద్దేమో మూర్తి   అయినా  ఏదో చాలా పెద్దవాడిలా  మాట్లాడుతాడు ,నాకు తెలియని ప్రపంచం ఆయన మాటల్లో వింటూ , కంటూ ఉంటాను ..
‘పాపం సరోజ ‘ అని అప్పుడప్పుడు నిట్టురుస్తూ ఉంటాను .
మేమిద్దరం కలిసి ఒకే విభాగం లో రెండేళ్ళు నించి పని చేస్తున్నా ఎప్పుడూ వాళ్ళావడ్ని  కలిసే సందర్భం రాలేదు ఎందుకో !
భోజనానికి వెళ్ళిఒక కునుకు కూడా తీసి వస్తాను అని చెప్పే మూర్తి ,పది మిముషాలలో హడవిడి గా వచ్చి ,సొరుగు తాళం తెరిచి ,"మా  అలమారా తాళాలు మర్చి పోయాను " అంటూ మళ్ళి అంతే హడావిడి గా  వెళ్ళి పోయి నన్ను ఆశ్చర్యంలో ముంచెత్తారు .
ఇంటి బీరువా తాళం చెవులు ,ఇంట్లో భార్య చేతికి ఇవ్వరా ?
నాకిది  ప్రపంచ ఎనిమిదో వింత . మా బీరువా తాళం చెవులు ఏ దిండు కిందో ,నా బట్టల  బీరువా లో బట్టల మధ్యో ఉంటాయి ..
అసలు తనంతట తాను బీరువా తాళం తెరవనే తెరవడు. పైగా -
"అవన్నీ నీ చీరలు ,నీ వస్తువులే కదా ,ఆ పేపర్లు అవీ నువ్వే ఎక్కడొ జాగ్రత్త చేస్తావు. నేనిప్పుడు 
వెదికానంటే..అన్నీ కలిపేసానంటూ గోల పెడతావు.  అదంతా నాకెందుకు ? నువ్వే తీసివ్వు ప్లీజ్ ” అంటూ బ్రతిమాలుకుంటాడు . 
ఇలా ఆఫీసుకి  ఇంటి బీరువా తాళాలు తెచ్చే మగవాళ్ళుంటారని కానీ, వాటినిలా ఇంత భద్రం గా దాచే మొగుళ్ళుంటారని కానీ..  ఇదిగో ఇప్పుడే మొట్ట మొదటిసారిగా చూస్తున్నా. చూసి నమ్మలేని దాన్నౌతున్నాను.
ఆ మర్నాడు తనే మరింత వివరణ ఇచ్చాడు.నేనేమీ అడగకుండానే ,
"మా ఆవిడ  చేతికి రోజూ ఇరవై రూపాయలిస్తాను . ఏ  గొంగూరకో , తోటకూరకో పనికొస్తుందని . అంతకు మించి ఆవిడకేం  ఖర్చు ఉంటుంది చెప్పండి ? అన్నీ నేనే  చూసుకుంటున్నాను కదా” అంటూ తనో పెద్ద  ఘనవంతుడన్నట్టు  నవ్వాడు .
ఈ మాటలు వినగానే నా మతిపోయింది.
నాకు వచ్చే జీతంలో నేను మా అమ్మగారికి కొంత పంపిస్తూ ఉంటాను.

బజారుకి వెళ్ళానంటే నన్నాకర్షించేవి  ఎన్నుంటాయని ! కొత్త డిజైన్   చీరో ,రంగుపూల  గాజులో, లేటెస్ట్ మోడల్   స్టీలు గిన్నో ,ఏదో ఒకటి కళ్ళబడక మానదు . ఆ వెంటే  కొనుక్కుని రావడము  నా కలవాటు.
ఇంటి కొచ్చా క , ‘ఇదిగో చూడు, నా సెలెక్షన్ ఎలా ఉందొ’ అంటూ ఉత్సాహంగా అడిగితే కూడా . ,కనీసం ‘ఎంత ' అని కూడా అడగడు.  చూడకుండానే , ' బాగుంది ,బాగుంది’  అనే భాస్కర్ నా కళ్ళముందు గబుక్కున కనిపించాడు నవ్వుతూ.
ఇదే  మా ప్రపంచం .అందరిదీ కూడా  ఇంతేననుకుంటున్ననాకు మూర్తి ప్రపంచం చూసాక మనసు కలత బారింది.  ఏదో నాకు తెలీని, అంతు పట్టని కొత్త ప్రపంచంలా తోచాడు.
బహుశా ,నేనెప్పుడూ ఇలాంటి వారిని అంతకు ముందు చూడకపోవడం వల్ల  కావచ్చు .
మూర్తి లాంటి వారు ఉండే ప్రపంచం గురించి అవగాహన తెచ్చుకుంటూ , అలవాటు పడుతున్నాను ..
మూర్తి రెండ్రొజుల నించి ఆఫీసుకి రావటం లేదు ,ఎందుకా ? అని మధన పడుతున్నాను .
ఏదో ఒకటి మాట్లాడుకుంటూ పని చేసుకునే వాళ్ళం  కదా,  ఆ  మనిషి ప్రక్క సీట్లో లేకపోవడం  లోటుగా తోచింది ..
అటెండర్ని అడిగితే ,ఆ అమ్మకి బాగో లేదటమ్మ  అంటూ పూర్తి వివరణ లేని కబురు తెచ్చాడు.
వారి ఇల్లు నాకు తెలుసు . ఇంటికి వెళుతూ ,ఒక సారి తొంగి చూద్దాం అని నిర్ణయించుకుని స్థిమిత పడ్డాను .
ఆ  సాయంత్రం ఒక అరగంట ముందే బయలుదేరాను ,చెప్పానో లేదో ,నేను అప్పుడు రీసెర్చ్ స్కాలర్ని ,మూర్తి నా సీనియర్ ..
అనుకున్నట్టే వెళ్ళాను పిలవని అతిథి లా ..
మూర్తి ఆశ్చర్యపోయి , కొంచం కంగారు గా ,"సరోజా! నేను చెపుతూ ఉంటానే , విమల అని , ఆవిడ వచ్చారు ” అని ఒక కేక వేసాడు ,ఆ మూడు గదుల ఇంట్లో ప్రతిధ్వనించేలా .

లోపలనించి సరోజ వచ్చింది . తలకి కట్టు కట్టుకుని , నీరసం గా కనిపించింది ,  నన్ను చూసి సన్నగా నవ్వుతూ .'నమస్తే 'అనబోయింది.
నేను  హడలి పోతూ 'ఏమయిందండీ ? తలకి  ఆ కట్టు ఏమిటి ?’ అని కంగారుగా అడిగాను ..
ఆవిడ కళ్ళల్లో నీళ్ళు గిర్రున తిరిగాయి ,నాకు చాలా బాధ అనిపించి, ఓదార్పు గా ఆమె చేయి పట్టుకున్నాను.
ఈ లోపు  మూర్తి లుంగీ లోంచి పాంటులోకి మారి ,ఇప్పుడే వస్తాను అంటూ బండి తాళాలు తీసుకుని బయటకి నడిచాడు ..
అతన్ని   వెళ్ళ నిచ్చి ,   “ఎవరైనా కొట్టారా "? అని అనుమానిస్తూ అడిగాను .
"అబ్బే కాదండి , మా ఆయన బంగారం ” అంటూ జరిగిన సంగతి చెప్పింది
రెండ్రోజుల క్రితం , స్నానానికని కి వెళ్ళి,  బాత్రూం లోంచి  తడి చీర చుట్టుకుని, బయటకి వచ్చిందిట. గచ్చు మీద తడి చూసుకోక కాలు వేసి జారి పడిందట. ఆ పడడం అధాటున మంచం అంచు తగిలి ,బొట బొటా రక్తం చిమ్మిందిట .
ఆవిడ చెప్పేదంతా నేను శ్రద్దగా వింటూ, ఆలోచిస్తున్నా. ఆమె ఇంకా చెబుతోంది .
“నాకు స్పృహ లేదు . ఎప్పటికో ఈ లోకంలోకి వచ్చి పడ్డాను .”
ఆ రోజు మూర్తి వేరే పని మీద మరో ఆఫీసుకి వెళ్ళడం గుర్తుకొచ్చింది .
“అయ్యో ! ఎంత పని జరిగింది ? . పోనీ లేచి డాక్టరు దగ్గరకు వెళ్ళారా ?”
“అబ్బే లేదండి ,చిన్న దే కదా , పంచదార అద్దాను ,ఏం చేసినా రక్తం అలా ధారలుగా కారుతునే ఉంది ,ఈయన ఎక్కడ ఉన్నారో ,తెలీదు .”
“పోనీ మీ వారికి వెంటనే ఫోన్ చేయక పోయారా ?”
“నాకు ఫోన్ చేయడం  రాదండి. ” అంది, అసహాయం గా .
చేతిలో పది రూపాయలు మించి ఉండని ఆవిడ పరిస్థితి తల్చుకుని నా గుండె గుభేల్  మంది.

ఈ లోగా మూర్తి ఒక కూల్ డ్రింక్ సీసా పట్టుకుని వచ్చి ,నా కళ్ళ -ముందే తన జేబు లోంచి ఫ్రిజ్ తాళం తెరిచి , అందులో ఒక పది నిముషాలు పెట్టి ,నేను వెళతాను అంటే ,అప్పుడు లేచి , స్టీలు గ్లాసులో డ్రింక్ పోసి ఇస్తూ అన్నాడు .
“విమల గారూ ! పెద్ద గండం గడిచిందండీ . ఈ దెబ్బతో ఇదిగో ఆ రోజు నించి సరోజ కి నేను వంద రూపాయలు ఇస్తున్నాను .” అంటూ గర్వంగా  ఆమె వేపు చూస్తూ ఉంటే ,ఆమె మురిపెంగా నవ్వింది
సిప్  చేసిన  కూల్ డ్రింక్ ,భగ భగమని మండి పోయినట్టు గొంతు దిగలేదు.
సరోజ చేతికిచ్చిన ఇరవైకి లెక్క చూపిస్తేనే కాని మరో ఇరవై ఇవ్వని మహానుభావుడితను. అలాటిది రోజుకో వంద ఇస్తాడా? ఆ మహా ఇల్లాలు ,పతి యే దేవుడు అనుకునే పాత కాలం మనిషి మరి , ఈయన చేతిలో పెట్టిన ఆ వంద రూపాయలని అలాగే దాచి పెడుతుందని నాకు తెలుసు .
ఇరవై ఏళ్ళు అయిందేమో , ఇది జరిగి.  నా ప్రపంచం లో నేను అలాగే ఉన్నాను. ఏ మాత్రం మార్పు లేకుండా ,   సరోజ మూర్తిల దాంపత్యం దివ్యం గా ఉండి ఉంటుంది
అది వారి ప్రపంచం . ఒకే భూమి మీద ఇన్ని రకాల మనుషుల్లో ఎన్ని రకాల  ప్రపంచాలూ!
ఎవరి ప్రపంచం వారిదే  అయినా కొన్ని వింతగా ఉండడమే  చిత్రం ,
నాకదే ఎప్పటికీ అర్ధం కాని వింత , ఒక వింత .
*******




24 మార్చి, 2014

వెలుతురు కావాలి నాకు ,మాకు ,మనకి


ఉదయం వార్త పత్రిక చూడాలంటే భయం వేస్తోంది ..

పరువు హత్య ముందు పేజీ లో ,ప్రేమ పెళ్ళా ? 

కన్నందుకు నువ్వు మా ఆస్తివి, మా బొమ్మవి ..

మేం చెప్పినట్టు వినాలి, మన కులం లోనే పెళ్ళి ..

లేదా మృత్యువు .ఇదే మా శాసనం అంటూ గొంతు కి
ఎద మీద ఆట్లాడే చున్ని తో ఉరి వేసిన రాక్షస తల్లి తనండ్రులు 
యే సంఘ సూత్రాలు వారిని ఆ పనికి ప్రేరేపించాయి ?
నీ బ్రతుకు అంతా ,నీ కులం నిర్ణయిస్తుంది , అదే మా న్యాయం ,మా చట్టం ..
మరే చట్టం మాకు వర్తించదు ,,అనే ఈ అమనుష మనుషులు ,
మన మధ్యే ,ంసులుతున్నారు, జీవిస్తున్నారు ..
మరో వార్త ..
తన శరీరాన్ని ,వ్యాపార మదుపు గా అంగీకరించనందుకు
ఆమె అంగంగాలు కోసారు ట ..
ఎంత దారుణం ?
ఏమయ్యాయి ? చట్టాలు ? స్త్రీలని రక్షించే పోలీసు వ్యవస్థలు ?
పోలీసులే దగ్గరుండి నడిపిస్తారు అని విని మరీ అంత దిగ్భ్రాంతి పొందకండి
ఒక మహిళ దగ్గరుండి ,ఈ అఘాయిత్యం చేయించింది ట ..
ఇది మన సమాజం మన చుట్టు ,మంకేమీ పట్టనట్టు మసిలే సమాజం ..
ఇలాంటి వార్త లు చదవ లేక ఉదయమే ,వార్త పత్రిక చదవడం మానేద్దామా ?
శుభం ..తప్పించుకుని తిరుగువారు ధన్యులు ..అనేసారు కదా
మనం చెవులు మూసుకుని, కళ్ళు మూసుకుని ,నోరు మూసుకుని ..
ఈ దుర్మార్గాలు భరిస్తూ ... మనకి సంబంధం లేని విష్యాలు అంటూ
బ్రతికేద్దాం ..మన బబెల్ లో ,మన నాలుగు గోడల .నేను కూడా ఆ మనం లో ఒకటే ..
చాలా కోపం ...పిచ్చి కోపం గా ఉంది ..
ఇంకా బంధించండి ఆమాయిలని, అసలు వెలుగు తాకనీయకండి ..
ఆమె ఒక క్షేత్రం అంతే ..కంచెలూ వేసి కాపాడండి ..కంచే చేను మేసినా
అదంతే ,మగ తనం అని మీసాలు మెలి తిప్పండి ..
ఆమె కి జరిగిన అన్యాయాలు ,హింస లు , అవహేళనలు
పైకి మటుకు నోరు విప్పి చెప్పకూడదు , పరువు -ప్రతిష్ట ,,అమ్మో .
ఉద్యోగాలు చేయాలి ,వేణ్ణిల్లు కి చణ్ణీళ్ళు ..తప్పదు ..ధరలు ఎలా పైకి పోతున్నాయి ?
అక్కడ జరిగే , హేళనలు, చేతులు తాకించడం , రెండర్ధ్హాల మాటలు అవి మటుకు
ఇంటికి మోసుకు రాకూడదు ..సహించాలి , భూదేవి అంత సహనం నీకు
నీ సహనమే నీకు రక్ష ..ఎలా ? సహిస్తూ ఉంటే లోకువ గా ఇంకా హరాస్మెంట్ ఎక్కువయిందే ?
నోరు మూసుకు ఉంటావా ? నీ పేరు పాడు చేయనా ? అంటూ బెదిరించే తోటి ఉద్యోగులు
అయ్యో ఈ వ్యవస్థ లో మహిళ లూ మీరు కీలు బొమ్మలు ఎందుకు ఎలా అయారు ?
కుమిలి పోతున్న ఆమె మీద నువ్వు కూడా ఒక చెడు మాట ..విసిరుతావా ?
మొత్తం అంతా కుళ్ళి పోయింది , లుక లుక లాడుతూ పురుగులు పెట్టి ఉంది
చా .. ఎంత గొప్ప సూర్యోదయం అవుతుంది ? ప్రతి రోజూ ??
దానికింద , చీకటి నీడలు ఎందుకు ? నా కళ్ళ్ కి కనిపిస్తాయి ..
నాకు సూర్యోదయం కావాలి ,ఎర్రగా కాల్చేసే కిరణాల తో ,ఈ మురికి ని ఎండ గొట్టే కిరణాలు కావాలి ,ఎండ మండి పోయినా సరే ,ఈ చీకటి, చీదర చెదర గొట్టే మిరుమట్లు గొలిపే వెలుతురు కావాలి నాకు ,మాకు ,మనకి ..

21 మార్చి, 2014

దినాలు ...365 రోజులు

భగ భగమని మంటలు
నా చుట్టూ
వసంతం వచ్చేస్తోంది కోయిలా
ఎక్కడికి పోయావు ? గొంతు సవరించుకో .

ఏ కొమ్మ పై వాలను ?
ఏ చిగుర్లు మేయను ?
యే కోయిల మరి కుహు కుహు
అంటూ తిరిగి జవాబు చెపుతుంది ?

వేప చెట్లు ,రావి చెట్లు ,మర్రి చెట్లు
ఊరు ఊరుకి అమ్మ లా వీవెనలు ఊపుతూ
మాయం అయి పోయి ,ఇనప చెట్లు ట
మొలిచాయి వాడ వాడ లా ,
యే చెట్టు పై వాలను ?

మండుటెండ కాల్చేస్తోంది ,
చుక్క నీరు లేవు ,ఏ పక్క
కుహు కుహు అని యే చిగురు తిని
సవరించుకోను గొంతు ?

మా అమ్మ కథలు చెప్పేది
ఊరి లో పిల్లలు చెట్లు కింద చేరి
అల్లరిగా కూ కూ అంటూ కూతలు
కూసేవారట , చదువుల బడి జైలు ట
ఇప్పుడు చెట్టు పుట్ట కొండా అన్ని
పుస్తకాల మీద బొమ్మలై పోయాయి ట .

ఇంకెక్కడ అల్లరి ? ఆటలు ?
ఇంకెక్కడ వసంతాగమన సంకేతాలకై
ఎదురు చూపులు ,
పట్టణాల లో అన్ని ఋతువులూ
ఒక్కటే ,మండే ఎండలు ..అంతే ..

నీ చేత్తో నీవు తవ్వుకున్నావు గొయ్యి
నీ వినాశనం నీవే కోరి తెచుకున్నావు
అంటే నమ్మరు ఈ జనం ..
ప్రకృతి ని రక్షించండి అంటూ కవితలు
అల్లుతారు , ఒక్క మొక్క నాటండి అంటే
అమ్మూ నా ఫేస్ బుక్ లో కొంపలు అంటుకుంటాయి
నే ఒక్క క్షణం మిస్ అవుతే అంటూ బడాయిలు పైగా

అడవి కి ఒక రోజు ,పిచుక కి ఒక రోజు
పులి కి మరో రోజు , ఆడ పిల్ల ల కి కూడా
ఒక రోజు ట ,ఇన్ని నోట్లు , నాణాలు కంచం లో
పోసుకుని తింటరా ఏమిటి ? అదీ చ్హూద్దాం ..

నల్లటి కోయిల కార్చిన కన్నీటి చుక్క
మరి నలుపులో కలిసి , కనిపించనే లేదు ..
రండి ,మరో రోజు జరుపుకుందాం ..పోనీ
కోయిల కి ఈ రోజు పెడదాం ...సరి పోతుంది ..

మనం చేయ గలిగింది అదే ..
దినాలు .. హుహ్ ..పెట్టు కోవడమే ..
రండి ,365 రోజులు ..దినాలు గా ప్రకటిద్దాం ..
ఈ ఫేస్ బుక్ లో నే జరుపుకుందాం ..శుభం ..