"http://www.jalleda.com/images/jalleda3d48x32.png">

17 జూన్, 2014

గోడ

నేనొక హౌస్ ఫ్లై ..అయ్యో 
అచ్చు తప్పు హౌస్ వైఫ్ ..
నేను మొన్నటి వరకు వాలేదాన్ని 
మా ప్రక్కింటి కి మాకు మధ్య గోడ పై ..

అప్పుడు మోగేది సహజమైన ఒక 
ఆకలి గంట , పిల్లల ఆగమనం మరొక గంట 
ఆ పై కాలు ఝాడిస్తూ ,నడక షూ లు 
కట్టి ,సాగించేవారం మా మాటల ఆటలు .. 

హితురాలు ,స్నేహితురాలు తో 
ఇంటి విషయాలు ,ప్రాపంచిక కబుర్లు 
ప్రక్కింటి కథలు ,పిల్లల లోట్లు ,
కావేవి మా కబుర్ల కి అర్హాలు .. 

అక్కడక్కడ కుదిరి కూర్చున్న 
ఆ పై పై ఒంటి బరువు అంత వీసీ కాదు 
సుమా కరిగించడం అంటూ వాపోతూ 
కంచం లో చేయి కడిగే వాళ్ళం ..కుంభాలు లాగిస్తే 

మరి వచ్చేది ముందు నిద్ర ,ఆ పై ఉదరం 
అంటూ ప్రత్యక్ష ప్రహసనం చూసి కాస్త 
విచారించి , మన వల్ల కాదు లే ,మన మేమీ 
ఐస్వర్యా ,సుస్మితాలమా ? ఏమిటి లెస్తూ ..

అని సరిపెట్టుకుంటున్న సమయం లో 
వచ్చి పడింది ,ఇంటింటా ఠణా ఠణ్ అంటూ 
నెట్ సౌలబ్యం ,ఆపై తొండ ముదిరి నట్టూ 
వై ఫై అయింది ..మరి మా గోడ పై మాటల 

ఆకారం ,స్థానం మారింది ,మరొక ముఖ పత్రం 
గోడ వచ్చి కూర్చుంది , మా ప్రక్కింటి స్నేహ లత 
నా మధ్య ,ఐతే ఏం కానిం అని అలాగే కొనసాగించాం 
ఈ లోగా తామర తుంపల లాగా " ఈ " స్నేహితుల 

సంఖ్య పెరిగింది ,ఏం రాస్తే అదే లైకు అన్నారు ,
ఇంకా రాయండి మీరు అంటూ చప్పట్లు చరిచి 
కామెంట్స్ అంటూ పెట్టి ,ఉత్సాహ పరిచారు ,
అదేమి స్నేహం ,ముఖం తెలుసా ? మాట తెలుసా ? 

అని ముక్కు మీద వేలు వేసుకున్న వాని మీద 
కోపగించి కటీఫ్ చెపుతామంటే ,అబ్బే , నాతి చరామి 
అనేసావు కదా అనేసారు ,ఐతే సరే ,నా ముఖం కన్నా 
నాకు ఈ ముఖ మే ఎక్కువ అని తెగించేసాను ..

సరే నీ ( ఖర్మ ) ఇష్టం అనిపించేసాను ,ఇదిగో 
ఇవాళే చూసాను ,నా స్నేహ లత ఎలా ఉందో అని 
అలగలేదు కానీ ,ఎక్కడికి మాయం అయిపోయారు అంటూ 
ఇక్కడే ఉన్నానే అంటే ? ఎక్కడా మన గోడ మీద మీరు 

మరి కనిపించటం లేదు ,ఇదేం పని , 
మీ మాటల గల గల లు కోసం 
కలవరిస్తున్నాను ,ఈ మాటలు కాదండోయ్ 
నిజం గా మాటలు ,కంఠం నుంచి వెలువడే మాటలు ..

అవురా ? ఎంత తప్పు చేసాను అంటూ 
కంఠం సవిరించాను ,మాట రాదే ..
ఏదో స్టాటిక్ సౌండ్ వస్తోంది ..ఇప్పుడు నేనే 
గోడ నై పోయాను ..అయ్యో ..అయ్యయ్యో ....

11 జూన్, 2014

పనస పొట్టు కూర ..పూర్ణా మార్కట్

నిన్న ఎవరో మితృలు పనస పొట్టు కూర అని చెప్పేసరికి ,నా మనసు నందు మెదిలే ..ఈ పూర్ణా మార్కట్ చిత్రం ..
మా ఇంటినుండి బయలు దేరి ,అలా సిరి పురం కూడలి లో ఎడమ పక్క తిరిగి, పూర్వం ఎల్లీస్స్ గార్డెంస్ అన బడే ఎల్లమ్మ తోట, ఇప్పుడు జగదాంబ కూడలి లో ఎక్కడా ఆగక, అలా ముందుకు వెళుతూ ఉంటే టర్నర్‌ సత్రం వస్తుంది ,ఆ ప్రక్కనే మన విశాలాంధ్ర పుస్తక నిలయం ఉంటుంది, మరి అక్కడ తొంగి కూడా చూడకూడదు , ఆ మాయ లో పడితే మరి లేవను , ఇంకా ముందుకు తిన్నగా అలా వెళుతూ ఉంటే ,మా పూర్ణా మార్కెట్ వస్తుంది ..పూర్వం ఇక్కడే పూర్ణా థియేటర్ ఉండేది ,పాత హాలు లో మరి చాలా పాత సిన్మాలు కూడా చూసిన జ్నాపకాలు వేలాడుతూ వెంబడిస్తాయి , ఎదురుగా పూర్ణా ఆప్టికల్స్ ,నడిపేది ఎవరనుకున్నారు ? ముస్లిం ఫామిలీ ,మూడు, నాలుగు తరాలుగా ఏమో నడుపుతున్నారు ఆ షాప్ లు . వాచ్ రెపేర్ కూడా వారి దే ..
ఆ అంచునే మొదలు అవుతుంది ,పూర్ణా మార్కెట్ సందడి .
పాదాచారులు నడవడానికి మిగిల్చిన దారిలో ఏమో ప్లాస్టిక్ సామాన్లు అమ్మే దుకాణాలు, అక్కడ దొరకనివి లేవు ..
మగ్గులు, బకెట్లు , చాటలు ,కాదేది ప్లా్స్టిక్ కి అనర్హం ? అని సమస్తం కళ్ళ కి పసుందు గా కనిపిస్తాయి , పాత తాళాలు , ఇనప సామాన్లు, స్టీలుసామాన్ల కొట్లు , పూజ సామాను , ఇత్తడివి . స్టీలువి ..ఒకటేమిటి ? మనకి ఏం కావాలి అన్నా ,ఈ మార్కెట్ కి వస్తే సరిపోతుంది ..
ఇంక కుడి వేపు తిరిగితే మొదలవుతుంది ,ఎంత జీవన వైవిధ్యమో , బుట్టలు ,తట్టలు ,పట్టుకుని ,కొప్పులు ముడి వేసి ,కుడి పైట వేసిన మన అప్పలమ్మ లు, అప్పాయమ్మలు ,నూకాలమ్మలు ,ఇంతింత పెద్ద కుంకుం బొట్టులు తో , కాలి కి బరువైన వెండి కడియాలు కంఘ్ మని మోగుతూ , ఐదు రూపాయలకి ఐదు కట్టలమా ! అంటూ కొత్తిమీర పరిమళం , ముక్కు కి ఆనించి లాగేస్తారు ,మొదట్లో తెలియక ,ఆ పరిమళ మాయ లో పడి ముందే ఈ ఆకు కొనేసి ,ఇంకా తక్కువకి కూడా అమ్ముతారని ..ఓ బాధ పడి పోయాక ,ఇప్పుడు తెల్సింది లెండి ,ఆకు కూరలు ఆఖరున కొనాలి అని ,నలిగి పోతాయి కదా ..
మనం కారు లో వెళితే కనుక ,ఈ బుట్టల వాళ్ళు అందరూ ఒక నిముషం లో బుట్ట తట్ట ఎత్తి పట్టుకుని , మనకి చోటు చేసి ,మళ్ళీ వారి జాగా లో వారు కూర్చుంటారు , సహ జీవన సౌకర్యం ..ఎంత బాగా నేర్చితిరో కదా ? ఔరా ?? అని ఆశ్చర్య పడిపోతాను ..నేను ..
ఒక వర్స పాటించాలండీ ,ఎలా పడితే అలా ప్రవేశిస్తే ఎలా ? రండి చూపిస్తాను ,నాతో పాటు మా పూర్ణా మార్కెట్ .. రంగుల హంగులు ..
ముందు రోడ్డు వైపు నుంచి చాకచక్యం గా ,ఆవులు ,గేదెలు రాకుండా అమర్చిన ఇనప పట్టి ల ను దాటి ,అడుగు పెట్టామా ?? పెద జాలారి పేట అమ్మణి లు, అమా బత్తాయి ,కమలా ,ద్రాక్ష ,అంటూ నాలుగేసి తీసి మన చేతిలో పెట్టేస్తూ ఉంటారు, అబ్బో ,ఏదో పేరంటం అనుకునేరు సుమీ ,రేటు కట్టి ..ఇవ్వాల్సిందే ,ఎంత ? అంటూ అడిగామా ? ఎంత ..వంద అంటూ ఒక పెద్ద అంకె చెప్పి గుండే గుభేల్ మనిపించాక , వారిని తప్పించుకుని ఆ మయ సభ లో ముందుకు అడుగు వేయాలి అంటే ,ఒకటే దారి ..పది కి ఇస్తావా ?
హు ..పళ్ళు కొనే మొహమే నా ఇది అంటూ ,చూపులతో ,మాటలతో మొహం ఈడ్చేస్తారు ,దుర్యోధనుడి కైన గర్వ బంగం తల్చుకుని ... థూ అంటూ మనమూ దులిపేసుకుని ముందుకు అడుగు వేయాలి అన్న మాట ,,
అటు మళ్ళీ ఎడమకి తిరిగితే పాత కరాచీ దుకాణం ..అందులో సరుకులు అన్నీ టొకున అమ్మేలా ,బస్తాడు మిరపకాయలు ,అలా పెట్టి ఉంటాయి ,ఇవి మనకి అక్కర లేదు కదా ,ఎదురు బొదురుగా ,చింతపండు ,పిక్క తీసింది, తీయనది ,మిర్చీ ,అప్పడాలు ,వడియాలు , ఇంకా ఎన్నో బస్తాల బస్తాల తో కనిపిస్తాయి ..
మనం ఇవన్నీ దాటుకునీ ముందుకు వెళ్ళామా ? లాంతరు చిమ్నీలు, అప్పడాల పీటలు కర్రలు ,అమా ం దస్తాలు , పెనాలు , కుంపట్లు , దేవుడి దీపాల సమ్మెల లు . గులాబీ స్వీట్ చేసూనే గుత్తులు , జంతికల గ్ట్టాలు అన్నీ పాత మోడలు వి ఇలా సమస్తం ..మన పాత వంటిల్లు ని గుర్తు చేస్తూ కనిపిస్తాయి ,ఓ సంబరపడి కొనేసి ,అటక ఎక్కించినవి ఎన్నో ,
అందుకే ముందుకు పదండి , ఆ ఒంపులో ,తమల పాకులు కట్టలు, కట్టలు , అరటి దూట , అరటి ఆకులు ,ఇలా పచని దుకాణాలు , కనిపిస్తాయి , మరి ముందుకు తోసుకు వెళ్ళాలి ,ఎందుకంటే ఈ కూరల దుకాణాల దగ్గర విపరీతమైం రష్ ...
ఉత్తరాది వారు చక్కగా భార్యా భర్తలు ఇద్దరూ ,పెద్ద పెద్ద సంచీలు మోసుకుని వారం పది రోజులకి సరిపడా కూరలు కొనుక్కుని వెళతారు ,వాళ్ళ కి కావల్సిన కూరలు నూల్ కోల్ , గోబీ , ఇలాంటివి ఇక్కడే ఎక్కువ దొరుకుతాయి మరి ..
మరి మనమో ,నిన్ను ఇక్కడ దింపేసి నేను ఇక్కడే ఎదురు చూస్తూ ఉంటాను ..ఇంత గొప్ప సాయం చేసాను ,తీసుకు వచ్చి ,నాకు ఊపిరి ఆడదు బాబూ , అంటూ సూకరాలు పోయే మగ మహారాజులు మన వారు కదా ,అందుకే ఒక సంచీ చేతిలో పట్టుకుని నేను ..అలా ముందుకు సాగుతున్నానూ ...
ఆ మలుపులో చూస్కోండి ఇంక ,బఠాణీలు, ఉప్పు బఠానీలు , అటుకులు , మర మరాలు ,చిన్న బిస్కెట్లు ..ఇల చిరు తిండ్లు మనలని నోరు ఊరిస్తూ ..
అబ్బ..ఇవి తర్వాత , కొంచం ముందుకు వెళితే ,అమ్మా ,ఫ్రెష్ ..చుక్క కూర ,తమరికి ఇష్టం కదా ,ఆరు నెల్లకి ఒకసారి వెళ్ళినా ,వారి జ్నాపక శక్తి అమోఘం .చదువుకుని ఉంటేనా రాజ్యం ఏలేసే వారు కాదూ ,
ఆకు కూరలు చూడగానే ఒళ్ళూ మరచి ,పాల కూర ,పుదీన ,చుక్క కూర అంటూ లిస్ట్ చెపుతూ ఉండగా ,ఏమండీ మీరు కూరలు కొనడాని కే వచ్చారా ? అంటూ , నిల్చుని ,నిల్చుని ఇంక ఆగలేక పలకరించిన ..అతను ..కూరల ఆవిడ నా ముసి ముసి నవ్వులు చూసి అయ్యగారా ? అమ్మ అంటూ మరో రెండు కట్టలు కొసరు వేసింది .ఎంత అంటే ఇంద అని చెప్పి బేరం ఆడ్డమే మర్చిపోయాను ..
సరే వచ్చావి కదా ,ఈ సంచి నువ్వు పట్టుకొ అంటూ ,మరో సంచి కొని మరీ ,ముందుకు వెళితే నా అంత ఎత్తున అరటి గెలలు ,సపోటా , ఇంకా ఏవేవో పళ్ళు ..
మరో ప్రక్క అల్లం ,ఉల్లి పాయలు ..ఇవి ఆర బోసి .
కింద నేల చిత చిత , ఒళ్ళు ఒళ్ళు రాసుకుంటూ చిర చిర, అమ్మి కొప్పు లో దోపిన చామంతి చూడగానే అమ్మో పూలో గుర్తు వచ్చింది ..
నాలుగు మూరలు అంటూ అంట కట్టే పిల్లడిని కాదు అనలేం , కొసరుగా రెండు మూరలు కొని , ఇంకా నా వల్లా కాదు ,అంటూ ముఖం లో రంగులు మారుస్తున్న అతనిని చుస్తూ ..
సరే పద ,ఇంకా చాలా ఉంది ,ఆ వెనక కుండలు ,కూజాలు , బుట్టలు ..అమ్మా ..నువ్వు అచ్చ్నం విశాపట్నం దానివి అని నేను ఒప్పుకుంటnను .ఇంక చాలు ,ఈ రోత నా వల్ల కాదు భరించడం ..అంటే ..
భరించలేక ,పూర్ణా మార్కెట్ లో అందాలు చూడాలి అంటే వైజొగ్ వాడివి అయి ఉండాలి అనే ఫండా తెలియ చెప్పి ,ఇంకా దొండకాయలు , అరటి కాయలు , పొట్ల కాయలు అన్ని ఇప్పుడే కోసుకు వచ్చినట్టూ నవ నవ లాడుతూ ..చెయ్యి లాగేస్తోందే ..
రెండు అల్లా నాలుగు సంచీలు అయాయి ..అంతే అవి అలా పి్లలు పెట్టేస్తయయి ..
ఇంకా బయట పడుదాం అనుకుని మళ్ళీ ట్రెల్లిస్ దగ్గర ,ఆగి విన్యాసాలు చేస్తూ ఉంటే అక్కడ కనబడుతుంది ...పనస కాయ పొట్టు ..చింత చిగురు ..రెండూ ,జంట కవుల లా గే ప్రక్క ప్రక్క .. ఒకటే ఆత్రం ..కొనేసుకోవాలి అని ..ఎలా చేయాలో ఏమిటో ?
పోనీ అమ్మకి ఇచ్చేద్దామా ?? ఆమె వండి పెడుతుంది .. అమ్మో అమ్మ కి పని కాదూ ..ఎలా ? టు బై ఆర్ నాట్ టు బై అని ధర్మ సందేహం లో రెండు నిముషాలు ఆలోచించి ఇది వాతం అంటూ ఎప్పుడో అమ్మ చెప్పిన మాట గుర్తు తెచ్చుకుని ,చింత చిగురు ..కూడా మరోసారి అంటూ ...అడుగులు ముందుకు వేస్తాను ..
ఇది మా పనస పొట్టు కథ ..కథో కార్యమో అవుతే ,తినేది ,ఈ కూరే కదా ,మనం ఎందుకు ఊ హైరానా పడి పోవడం అంటూ ,తేలికగా ఏ బీరకాయో , దొండ కాయో వండడం వచ్చు కానీ ,ఇవన్నీ చేయడానికి ..నేనే మైనా నలుడా భీముడి నా ??
అనుకుంటూ ..నాలుగు సంచులతో ఇంటి మొహం పట్టమా ?? ఏమేం వండను  ? ఏమేం ఫ్రిజ్ తినేసింది అని మటుకు అడగ కండి ..మరో మూడో యుద్ధం కి కారణం అవుతారు మీరు ..మా ఇంట్లో ..అదీ సంగతి ..

4 జూన్, 2014

అగ్ని సాక్షి గా పెళ్ళి ,చావు...

చిట్టి చిట్టీ ,ఏమిటమ్మా .. చా పద్దెనిమిది ఏళ్ళు వచ్చాయి నాకు ఇంకా చిట్టి ఏమిటి అంటూ సీత గొడవ పెడుతూ ఉంటుంది , మనకంత తాహతు లేదు అంటూ ,డిగ్రీ చదువు అయినా చదవనివ్వండి అంటే ,మన కుటుంబాల లో ఇదే గొప్ప ,నేనూ ఎనిమిది వరకు చదివాను అని మీ నాన్నమ్మ నన్ను చదువు కున్న కోడలు అంటూ మూతి మూడు వంకలు తిప్పేది ,అంటూ అమ్మ నా చదువు మధ్యలో ఆపించినా ,పత్రికల లో కథలు ,నవల లు చదవడం నాకెంత ఇష్టమో ,భర్త అంటే ఇలా ఉండాలి అని ఎన్ని కలలో ..
ఇంట్లో ఎప్పుడూ చూసార ? అల్ల వారి అబ్బాయి అంటూ ..చిన్న చిన్న గా చెవులు కొరుక్కోవడం . బడి లో గుమాస్తా ..మంచి సంబంధం అంటూ ,ఉన్న దంతా ఊడ్చి ,ఊడ్చి ,నాన్న గారు ఈ సంబంధం కుదిర్చారు ..మరి పాపం తమ్ముడికి ?? చదువు చెప్పిస్తాం .వాడి ఊసు నీకేలా ? అమ్మ ప్రేమ గా చివచివ లు ..
రామారావు అమాయకుడు అన్నారు ,అంటే ఏమిటొ మరి , సీత నువ్వింత అందం గా ఉన్నావు నీ కు ఎవరూ ప్రేమికులు లేరా ? అంటే అయోమయం గా , నేనంత అందగెత్తనై నాకు తెలియదే ,మీరు మరి లక్ష రూపాయిల కట్నం తీసుకున్నరేం ? నేను అంత అందగెత్త నైతే అన్నందుకు ,మొదటి సారి నా చెంప పై దెబ్బ పడింది ..
రామారావు మెత్తనైన వాడు ,అమాయకుడు ..అన్నారే ..ఇంత గట్టిగా ఉందే అతని చేతి దెబ్బ ? కళ్ళల్లో నీళ్ళు గిర్రున తిరిగాయి మొట్ట మొదటి సారి ..చిట్టీ అని పిలిచే అమ్మ ఏది ? నా కంట నీరు చూడలేని అమ్మ ఏది ??
రామారావు చేతిలో నా చేయి పెడితే అంతేనా ? ఇంక నా మంచి చెడ్డలు అమ్మ నాన్న కి పట్టవా ? ఎలా ఉన్నావు ? అని అడగరేం ?
అవును లక్ష రూపాయలకి వడ్డీ కడుతూ ,ముక్కుతూ మూలుగుతూ నడుపుతున్న సంసారం ,ఎలా ఉన్నావు తల్లీ అని అడిగి ,దించిన కుంపటి మళ్ళీ ఎద పై ఎక్కించుకోరు కదా ? నేనేమైన అడిగానా ? నాకు పెళ్ళీ చేయండి అని, చదువుకుంటాను నాన్నా అంటే ,భారం తల్లీ అన్నారు ..నేను ఉద్యోగం చేసి ,వారిని పువ్వుల్లో పెట్టి చూసుకునే దాన్ని కదా ,ఎవరు చెప్పారో ఆమ్మాయిలు కుంపట్లు అవీ అని ,కాలం ఎంత మారినా మా అమ్మ నాన్న మటుకు పాత కాలం పద్ధతులే ఏమైనా అంటే ,మనకి అంత తాహతు లేదు ..అన్నిటికీ ఒక్కటే మాట ..
ఏం చెప్పి పంపించింది అమ్మ ..తల వంచుకు ఉండు ,అత్తారింట్లో ,ెదురు సమాధానం చెప్పకు , నీ పని నువ్వు చక్కగా చేసుకో ,బద్ధకించకు , పని మనిషి అంటూ ఎవరూ వద్దు ,పని చేసుకుంటూ ఉంటే పని చులాగా ఉంటుంది ..ఆరోగ్యం గా ఉంటుంది .పని బద్ధకం పనికి రాదు ..అంటూ ..
తు చ తప్పకుండా , అమ్మ మాటలు పాటిస్తున్నాను ..ఐనా అప్పుడప్పుడు చెంప దెబ్బలు , నడుం వంచి పిడ్ గుద్దులు ..ఎందుకు ? అని అడిగినందుకు ..మరో రెండు ..
అత్తగారు వచ్చి ఏం చెప్పారో మరి , పండగ ఈనాం అంటూ ఎభై వేలు తెమ్మని సతాయింపు ..వద్దు అండీ ,మా నాన్న ఇప్పటికే అప్పుల్లో ఉన్నాడు .నా వల్ల కాదు ,పని మనిషి కూడా పెట్టుకోకుండా పొదుపు గా చేస్తున్నాను ,ఇంకా యేమిటి తక్కువ ? అని అన్నందుకు ..
రెండ్రోజులు అయింది గాస్ అయిపోయి ,కిరస నూనె కుంపటి మీద వంట .. ఏమండీ ఒక్క సారి వచ్చి కాస్త స్టవ్ లో కిరసం పోయండి ,నా చెయ్యి బాగా లేదు , ఇంట్లో నే ఉన్న రామారావు ని కేకేసి పిలిచాను ..
ముందు గదిలోం చి నవ్వుకుంటూ , వచ్చి , కిరసన్‌ డబ్బా లో నూనె అంతా నా పై వంచాడు ,పాపాత్ముడు ..వీడు భర్తా ?? కళ్ళల్లో నీళ్ళూ తిరిగి ,కిరొసిం కంపు కొడుతూ నేను ,అవాక్క్కయ్ నిల్చుని ఉండగా ,అగ్గి పుల్ల అంటించి నా పై వేసాడు ..
ఆ చిన్న గదిలో మంటలు పైకి ఎగిసాయి ..సీత ..అగ్ని సాక్షి గా పెళ్ళాడిన సీత కి అమ్మ మాటలు గుర్తు వచ్చాయి .బ్రతికినా చచ్చినా అత్తా రింట్లో అని , లుంగి ఊడి ,కాళ్ళ కి అడ్డం పడి ,ఒక్క క్షణం , పారిపోవడం ఆలస్యం అయిన రామరావు ని గట్టిగా కౌగిలించుకుంది ..
అగ్ని సాక్షి గా పెళ్ళి ,ఒక్క ఏడాది గడవకుండానే చావు ..సీతా ..రామారావుల కథ ఇది ..కాదు కాదు ఇంకా ఎంత మందిదో కథ ..సీతల కథ ..
అగ్ని కి ఆహుతవుతూ భర్త ని కూడా కౌగిలించుకుని , చనిపోయిన.. చంపేసిన ...ఒక భార్య గురించి వార్త ..శభాష్ ...అని ...ఆమె లాంటి మరెందరో ..పెళ్ళి పెళ్ళి ..కాదూ ..జీవితం ..జివితం ..ముఖ్యం ..
UnlikeUnlike ·  ·